
‘ప్రేమ సాగరం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ దర్శకుడు, నటుడు టి. రాజేందర్. కేవలం యాక్టర్, డైరెక్టర్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా ఇలా ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారాయన. డైరెక్టర్‌గా సూపర్ హిట్స్‌ను అందించారు రాజేందర్. ఆయన డైరెక్ట్ చేసిన లాస్ట్ సినిమా ‘వీరసామీ’ 2007లో రిలీజ్ అయింది. పదకొండేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న రాజేందర్ మరోసారి మెగాఫోన్ పట్టనున్నారు. తమిళంలో ఓ పొలిటికల్ సెటైర్‌గా మూవీని తెరకెక్కించనున్నారు. ఇంత గ్యాప్ తర్వాత తిరిగొస్తున్న ఆయన హిట్ సాధిస్తారో? లేదో? వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment