
విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’. ఈ సినిమాలో ఆయన ఓ కిరాణా కొట్టు యజమాని. పేరు కాళీ. మంచి ఫ్యామిలీ మేన్. అయితే ఒక భయంకర మైన క్రైమ్ నెట్‌వర్క్‌తో ఈ కాళీకి సంబంధం ఉంటుంది. మరి... కాళీ సీక్రెట్ మిషన్ ఏంటి? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని సమాచారం.
ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ విడుదల చేయనుంది. ‘‘పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment