ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రాబోతుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. గత నెల చివరలో తమిళంలో రిలీజైన క్రైమ్ డ్రామా ప్రశంసలు అందుకుంది.1999లో మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
రేడియో జాకీ నుంచి హీరో, దర్శకుడిగా మారిన ఆర్జే బాలాజీ.. రీసెంట్‌గా 'సొర్గవాసల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. చేయని నేరానికి జైలుకెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? జైలులో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? అసలు అల్లర్లు జరగడానికి కారణమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నవంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. సరిగ్గా నాలుగు వారాల తర్వాత అంటే డిసెంబర్ 27న ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. జైలు బ్యాక్ డ్రాప్‌లో నడిచే క్రైమ్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కాకండి. 'సొర్గవాసల్' అంటే స్వర్గద్వారం అని అర్థం!
(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment