టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్‌గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?
అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్‌గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)
దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.
'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')
Comments
Please login to add a commentAdd a comment