శింబు పాటలో మంచి పదాలూ ఉన్నాయి
శింబు పాటలో మంచి పదాలు ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి మాటలు లేని బీప్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తండ్రి టీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాట్స్‌యాప్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ శింబుపై కావాలనే కొందరు కుట్ర పన్ని దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మహిళలను ఉన్నతంగా చూపిస్తూ పలు చిత్రాలు రూపొందించాననీ, తనకు మహిళలపై చాలా గౌరవం ఉందని, అదే మర్యాద శింబుకు ఉందని అన్నారు. తను స్త్రీలను ఏనాడు అగౌరవ పరచలేదని అన్నారు. మహిళా సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే తాను వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు.
చట్ట నిబంధనలు తెలియవు
నటుడు శింబు ఒక టీవీ ఛానల్‌కు బేటీ ఇస్తూ తాను 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. సినిమా మినహా తనకేమీ తెలియదనీ అదేవిధంగా చట్ట నిబంధనలు తనకు తె లియవని అ న్నారు. ఆ కష్ట కాలంలో తన కు అండగా నిలబడిన తన తల్లిదండ్రుల కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను పాటను కావాలని వాట్స్‌యాప్‌లో పోస్ట్ చేయలేదని అందువల్ల తనను విమర్శించడం సబబు కాదని అన్నారు. తప్పుగా భావిస్తే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు.
రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శింబు సోమవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటీషన్‌పై ఈ నెల 23న విచారణ జగపనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. శింబుపై ఫిర్యాదులను, ఆర దోళనలను భరించలేక ఆయన ఇంటి ముందు సోమవారం నలుగురు ఆయన అభిమానులు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నడిగర్‌సంఘం ఖండన
శింబు చర్యల్ని నడిగర్ సంఘం ఖండించింది. దీని గురించి ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా అన్నది కళకు, కోట్లాది రూపాయల వ్యాపారానికి చిరునామా అన్నారు. అలాంటి సినీ రంగంలో తప్పు చేస్తే చింతించడం, క్షమాపణ కోరడం చేయాలని పేర్కొన్నారు. శింబుపై సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడం విశేషం.