నా పెళ్లి మీ ఇష్టం | shimbhu marriage is parents choice | Sakshi
Sakshi News home page

నా పెళ్లి మీ ఇష్టం

Published Wed, Jan 20 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

నా పెళ్లి  మీ ఇష్టం

నా పెళ్లి మీ ఇష్టం

 నా పెళ్లి మీ ఇష్టం కానీ అంటూ సంచలనాలకు కేంద్ర బిందువైన నటుడు శింబు మరోసారి వార్తల్లోకెక్కారు.ఈ మధ్య నటి హన్సికతో ప్రేమ ఫెయిల్యూర్, ఇటీవల బీప్‌సాంగ్ కలకలం సంఘటనలు కాస్త సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో వివాహం విషయంలో శింబు పేరు మరోసారి హెడ్‌లైన్‌లో కొచ్చేసింది. ప్రేమ వివాహం చేసుకోవాలన్నది శింబు బలమైన కోరిక.
 
  ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆ దిశగా ప్రయత్నించి విఫలం అయ్యారు కూడా. శింబు నయనతార ప్రేమ వ్యవహారం, నటి హంన్సికతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అలా రెండు సార్లు ప్రేమ బ్రేకప్ అవ్వడం, ఇటీవల బీప్ సాంగ్ వివాదం శింబు మనసును బాగా కలచివేశాయని చెప్పవచ్చు. మరో పక్క ఆయన తల్లిదండ్రుల పెళ్లి ఒత్తిడి కూడా శింబుపై చాలా ప్రభావం చూపినట్లుంది. వెరసి ప్రేమ వివాహం చేసుకోవాలనే తన ఆకాంక్షను పక్కన పెట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలవంచేలా చేశాయి.
 
  ఎస్ శింబు తన తల్లిదండ్రులు సెలెక్ట్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించారు. అయితే ఒక నిబంధనను విధించారట. అదేమిటంటే తల్లిదండ్రులు చూసిన అమ్మాయి తనకు నచ్చాలి. అదే సమయంలో తానూ ఆ అమ్మాయికి నచ్చి ఉండాలి అన్నది శింబు కండిషన్ అట. ఈ విషయాన్ని ఆయన తండ్రి టీ.రాజేందర్ వెల్లడించినట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. శింబు తల్లిదండ్రులు ఆయనకు తగిన వధువు అన్వేషణలో ఉన్నారు.
 
  అయితే ఇటీవల శింబు కుటుంబ సభ్యులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి ఒక విందులో పాల్గొన్నారని అక్కడ వారి మధ్య శింబు పెళ్లికి సంబంధించిన చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని టీ.రాజేందర్ కొట్టిపారేశారు.అయితే శింబుకు నచ్చిన పెళ్లికూతురుని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement