
రోమియో జూలియట్ కోసం గానాపాట
రోమియో జూలియట్ చిత్రం కోసం ఒక సూపర్ గానా పాటను రికార్డు చేసినట్టు ఆ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు. జయం రవి, హన్సిక, పూనం బాజ్వా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మెడ్రాస్ ఎంటర్ ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరిన ఈ చిత్రం కోసం ఇటీవల యువ సంగీత దర్శకుడు డీ ఇమాన్ సూపర్ గానా పాటను రూపొందించారని దర్శకులు తెలిపారు.
దీని గురించి ఆయన చెబుతూ, అ నేగన్ చిత్రంలో ఢంక మారి... ఊదారి అనే పాట మంచి హిట్ అయ్యిందన్నారు. ఆ పాటను రచించి యువ గీత రచయిత రాజేశ్ తన చిత్రం కోసం ఒక గొప్ప గానా పాటను రాశారన్నారు. ఉండనక...అనే పల్లవితో సాగే ఈ పాట ను యువ సంగీత దర్శకుడు అనిరుద్ గానం చేసినట్టు తెలిపారు. ఈ పాట యువతను ఉర్రూతలుగిస్తుందన్న నమ్మ కం ఉందన్నారు. ఈ చితం కూడా ఊహించిన దాని కంటే బాగా వస్తుందని, చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు ఉందని దర్శకుడు తెలిపారు.