జయం రవి హీరోనా.. విలనా? | Jayam Ravi two role in Romeo Juliet movie | Sakshi
Sakshi News home page

జయం రవి హీరోనా.. విలనా?

Published Tue, Jun 14 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

జయం రవి హీరోనా.. విలనా?

జయం రవి హీరోనా.. విలనా?

యువ నటుడు జయంరవి హీరోనా? విలనా? అదేమిటీ హీరోని పట్టుకుని అలా అంటున్నారు అని అనుకుంటున్నారా? జయం రవి స్టార్ హీరోనే. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రంలో అలాంటి సందేహానికి దోహదమయ్యే కథా పాత్రలో నటిస్తున్నారట. విజయాలకు నమ్మకమైన హీరోలలో జయం రవి ఒకరు.
 
  రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుదన్ వంటి చిత్రాల వరుస విజయాలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతోపాటు నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటుడు జయం రవి. కాగా ప్రభుదేవా స్టూడియోస్ సంస్థ వైవిధ్య భరిత చిత్రాలను నిర్మిస్తోంది. వాటిలో ఒకటి రోమియో జూలియట్ చిత్ర యూనిట్ జయం రవి, హన్సిక, దర్శకుడు లక్ష్మణ్, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, నటుడు వీటీవీ.గణేశ్‌లతో నిర్మిస్తున్న చిత్రం బోగన్.
 
 ఈ చిత్ర యూనిట్‌లో అదనంగా ప్రముఖ నటుడు అరవిందస్వామి వచ్చి చేరారు. విశేషం ఏమిటంటే ఇందులో జయం రవి పాత్ర హీరోగానూ, విలన్‌గానూ రెండు డైమన్షన్లలో సాగుతుందట. అంతే కాదు అరవిందస్వామి పాత్ర అలానే రెండు కోణాల్లో సాగుతుందట. అందుకే బోగన్ చిత్రంలో జయం రవి హీరోనా?విలనా? అన్న సందేహం కలగక మానదు.
 
 దీని గురించి దర్శకుడు లక్ష్మణ్ ఏమంటున్నారో చూద్దాం. ‘నా గత చిత్రం రోమియో జూలియట్ పూర్తిగా వినోదభరితంగా సాగే ప్రేమ కథా చిత్రం. అయితే దానికి పూర్తి భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా బోగన్ ఉంటుందని తెలిపారు. ఇందులో కథతోపాటు మంచి కామెడీ ట్రావెల్ అవుతుందని తెలిపారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే బోగన్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement