శింబు తారుమారు పాట | Simbu croons for Vikram Prabhu's Veera Sivaji | Sakshi
Sakshi News home page

శింబు తారుమారు పాట

Published Sun, May 15 2016 2:20 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

శింబు తారుమారు పాట - Sakshi

శింబు తారుమారు పాట

నటుడు శింబు చర్య ఏదైనా ఒక సంచలనమే. ఆడినా,పాడినా, నటించినా వాటికి విశేష ప్రచారం లభిస్తుంది. శింబుకు నటన వృత్తి అయితే పాడడం ఫ్యాషన్. ఇంతకు ముందు ఆయన పాడిన పాటలకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.ఎక్కువగా తన చిత్రాలకే పాడుకునే శింబు ఇటీవల ఇతర హీరోల చిత్రాలకు తన గానాన్ని పంచుతున్నారు. తాజాగా విక్రమ్‌ప్రభు చిత్రానికి ఒక పాట పాడారు.
 
 ఇంతకు ముందు జయంరవి,హన్సిక హీరోహీరోయిన్లుగా రోమియో జూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అధినేత ఎస్.నందకుమార్ తాజాగా విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.షామిలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గణేశ్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
 ఇటీవల ఆయన సంగీత సారథ్యంలో తారుమారు అనే పాటను నటుడు శింబు పాడారు. దీన్ని ఇంతకు ముందు దండామారి ఊదారి, ఎంగ తల ఎంగ తల వంటి సూపర్‌హిట్ పాటలను రాసిన రోఖేశ్ ఈ తారుమారు పాటను రాశారు. శింబు పాడిన ఈ పాటా మార్కెట్‌లో విడుదలైన తరువాత ఊరువాడ మారుమోగుతుందంటున్నారు వీరశివాజి చిత్ర యూనిట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement