Sanghamitra
-
సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘ మిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్‌బాబు,ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ సేవలందిస్తుంది. -
‘సంఘమిత్ర’ మొదలవుతోంది..!
బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ముందుగా టాప్ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్‌గా పోస్టర్స్ రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్ ఫేం దిశా పటాని టైటిల్ రోల్లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఆ భారీ చిత్రం ఆగిపోయిందా..?
బాహుబలి ఘనవిజయం సాధించిన తరువాత కోలీవుడ్ నుంచి అదే స్థాయిలో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర అనే భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే కష్టాలు మొదలయ్యాయి. దర్శకుడు అనుకున్న హీరోలు సినిమా చేసేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నాడు. ఇక టైటిల్ రోల్ కు ఫైనల్ చేసిన శృతి హాసన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వటంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది. ప్రస్తుతం సంఘమిత్ర పాత్రకు నటి కోసం అన్వేషిస్తున్నారు. హన్సిక చేస్తుందన్న ప్రచారం జరిగినా.. ఆమె కూడా తాను ఈ ప్రాజెక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆలోచనలో పడ్డ దర్శకుడు సుందర్ సి, సంఘమిత్ర కన్నా ముందు మరో సినిమా చేసే ఆలోచన చేస్తున్నాడట. సంతానం లీడ్ రోల్ లో తానే తెరకెక్కించిన కలకళప్పు సినిమాకు సీక్వల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు సుందర్. సుందర్ ఈ సీక్వల్ ను గనుక ప్రారంభిస్తే సంఘమిత్ర మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. -
మరో భారీ చిత్రంలో కట్టప్ప..!
బాహుబలి తరువాత అంతటి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దక్షిణాది చిత్రం సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేనాండల్ ఫిలింస్ సంస్థ 250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తమిళ హీరోలు జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్న ఈసినిమాకు హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. ముందుగా శృతిహాసన్ ను ఫైనల్ చేసినా తరువాత నిర్మాతలతో అభిప్రాయ భేదం రావటంతో ఆమె తప్పుకుంది. శృతిహాసన్ తరువాత సంఘమిత్ర పాత్రకు చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్, హన్సికను ఫైనల్ చేసే ఆలోచనలో ఉంది. సినిమాలో మరో కీలకమైన పాత్రకు కోలీవుడ్ సీనియర్ నటుడు సత్యరాజ్ ను తీసుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్, సంఘమిత్రలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
శ్రుతీపై కుష్బూ విమర్శలు
తమిళసినిమా: నటి శ్రుతీహాసన్పై నటి, రాజకీయనాయకురాలు కుష్భూ విమర్శల దాడి చేశారు. దర్శకుడు సుందర్.సీ నటి కుష్భూ భర్త అన్న విషయం తెలిసిందే. సుందర్.సీ తాజాగా సంఘమిత్ర అనే భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించనున్న ఇందులో నాయకిగా నటి శ్రుతీహాసన్న నటించడానికి అంగీకరించిన సంగతి, ఈ చిత్ర లోగోనూ గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించిన సంగతి విదితమే. ఆ వేడుకలో సంఘమిత్ర యూనిట్‌తో పాటు నటి శ్రుతీహాసన్ పాల్గొన్నారు. అనంతం తను అనూహ్యంగా సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ అందుకు కొన్ని ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించారు.అందుకు చిత్ర యూనిట్ ఆలస్యంగానైనా తగిన విధంగా స్పందించారనుకోండి. ఆ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా దర్శకుడు సుందర్.సీ భార్య, నటి కుష్బూ తన ట్విట్టర్లో పేర్కొంటూ నటి శ్రుతీహాసన్‌ను నర్మగర్భంగా విమర్శించడం టాక్ ఆఫ్ ది టాక్‌గా మరింది. ఇంతకీ కుష్బూ ఏమన్నారో చూద్దాం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న చిత్రం సంఘమిత్ర. అలాంటి చిత్రాన్ని సరైన ప్లానింగ్ లేకుండా ఎవరూ నిర్మించరు. అసలు స్క్రిప్టే లేదని కొందరు ఏవేమో సాకులు చెబుతున్నారు. నిజానికి సంఘమిత్ర చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. అందువల్ల వృత్తిపై అవగాహన లేని వారే అసత్యాలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే సంఘమిత్ర లాంటి చిత్రాలకు షూటింగ్ అన్నది 30 శాతమే ఉంటుంది. మిగిలిన 70 శాతం ప్రీ ప్రొడక్షన్లోనే జరుగుతుంది. మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం సమస్యం కాదు. పారంపర్య సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ల నుంచి వృత్తిలో పరిణితిని ఎదురు చూస్తారు. మీలోని తప్పులను గ్రహించి, లోపాలను సరిదిద్దుకున్నప్పుడే సుదీర్ఘ పయనం చేయగలరు. ఇది నటి కుష్బూ ట్విట్టర్లో పేర్కొన్న సారాంశం. మరి ఈమె విమర్శలకు శ్రుతీహాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
హన్సిక ఖాతాలో భారీ ఆఫర్..?
బాహుబలి తరువాత అంతటి భారీ చిత్రంగా తెరకెక్కుతున్న సౌత్ సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందుగా టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించిన చిత్రయూనిట్, అది కుదరకపోవటంతో జయం రవి, ఆర్యలతో సరిపెట్టుకున్నారు. టైటిల్లో రోల్లో శృతిహాసన్ నటిస్తుందంటూ ప్రకటించారు. శృతి కూడా సినిమా కోసం యుద్ధ విద్యలు నేర్చుకునే పని మొదలు పెట్టింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సినిమాను భారీగా లాంచ్ చేసిన తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు మరోసారి హీరోయిన్ కోసం వెతకటం ప్రారంభించారు. నయనతార, అనుష్కల పేర్లు ప్రముఖంగా వినిపించినా.. దర్శకుడు సుందర్.సి మాత్రం హన్సికకే ఓటు వేశాడట. ఇప్పటికే హన్సికతో చంద్రకళ, కళావతి సినిమాలు తెరకెక్కించిన సుందర్, మరోసారి ఆమెతోనే వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. త్వరలోనే సంఘమిత్ర హీరోయిన్‌పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. -
శ్రుతికి షాక్!
తమిళసినిమా: ఒక్కోసారి నిజాలు ఆలస్యంగా వెలుగు చూస్తాయంటారు. నటి శ్రుతీహాసన్ విషయంలోనూ ఇదే జరిగిందా? తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అధినేతలు అవుననే అంటున్నారు. నిజం చెప్పాలంటే సంఘమిత్ర చిత్ర వివాదం నటి శ్రుతీహాసన్‌ను వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంలో నాయకిగా నటించడానికి శ్రుతీహాసన్ అంగీకరించడంతో ప్రారంభానికి ముందే సంఘమిత్రకు బోలెడంత ఫ్రీ ప్రచారం వచ్చేసింది. శ్రుతీ కూడా కత్తిసాము లాంటి విద్యలో చాలా సీరియస్‌గా శిక్షణ పొందారు. అలాంటిది అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్ల డించడంతో పాటు. తనకు ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వలేదని, కాల్షీట్స్ డీటెయిల్స్ చెప్పలేదంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే చిత్ర వర్గాల తరఫు మాత్రం తమ చిత్రంలో శ్రుతీహాసన్ నటించడం లేదు అని మాత్రమే వెల్లడించారు. దీంతో నిజాలేమయి ఉంటాయన్న ఆసక్తి చిత్ర వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెరిగిపోయింది. కొందరైతే నిర్మాతల వైపే తప్పు ఉందేమో అనుకున్నారు. కాగా ఈ వ్యవహారం సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో తేనాండాళ్ ఫిలింస్ సంస్థ« శ్రుతికి షాక్ ఇచ్చింది. తాజాగా ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన హేమరుక్మిణి శ్రుతీహాసన్ వివాదంలో కుండబద్దలు కొట్టారు. శ్రుతీహాసన్ సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగలేదని, ఆమెతో కలిసి పని చేయలేని పరిస్థితుల్లో తామే తొలగించామని వెల్లడించారు. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. మరి ఈ అంశంపై శ్రుతీహాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
మళ్లీ కత్తి పడుతుందా?
మహా అయితే ఓ పావుగంట కంటే ఎక్కువసేపు కూడా ఉండదేమో! కార్తీ ‘కాష్మోరా’లో రత్నమహాదేవిగా నయనతార క్యారెక్టర్! అయితే ఏంటి? యువరాణిగా నయనతార ఆహార్యం, కత్తి చేతపట్టి చేసిన యుద్ధ విన్యాసాలు కాసేపే అయినా కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడా సినిమా ప్రస్తావన ఎందుకంటే... నయనతారకు మళ్లీ అలాంటి సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది. ‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్ బయటకు వెళ్లడంతో తెరచుకున్న తలుపులు ఇంకా అలా ఓపెన్‌గానే ఉన్నాయి. ‘సంఘమిత్ర’లో యువరాణిగా టైటిల్ రోల్లో నటించే కథానాయిక కోసం దర్శకుడు సుందర్ .సి, చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ స్టూడియోస్ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో నయన అయితే బాగుంటుందనే అభిప్రాయం చిత్రబృందానికి వచ్చిందట! వెంటనే ఆమెను సంప్రదించడం కూడా జరిగిందని కోడంబాక్కమ్ వర్గాల టాక్. నయనతార మళ్లీ కత్తి పడుతుందో? లేదో? -
సంఘమిత్ర నుంచి శ్రుతి తప్పుకొందా?
ప్రతిష్ఠాత్మకంగా రాబోతున్న సంఘమిత్ర ప్రాజెక్టు నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సుందర్ సి. దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో టాప్ టెక్నీషియన్లతో వస్తున్న ఈ సినిమాలో నటించడం అంటే చిన్న విషయం కాదు. తమిళ దర్శకుడు సుందర్ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. సోషియో ఫాంటసీ డ్రామాలలో శ్రుతి నటించి కూడా చాలా కాలమైపోయింది. ఇన్నాళ్లూ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో శ్రుతి చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది ఒక మంచి అవకాశమని, వారియర్ ప్రిన్సెస్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని, టైటిల్ రోల్‌కు శ్రుతి అయితేనే పెర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, ఆ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. దాంతో ఏమీ చేయలేని చిత్ర యూనిట్ మరో హీరోయిన్ను వెతుక్కునే పనిలో పడిందట. -
రాణి సంఘమిత్ర
చూడండి... శ్రుతీహాసన్లో రెండోవైపును చూడండి! ఇదైతే... జస్ట్ లుక్కే. కానీ, కత్తితో శ్రుతి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందోననే ఊహే ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది. ఇప్పటివరకు అయితే... స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్గా ఎక్కువ శాతం సినిమాల్లో నటించారు శ్రుతి. వారియర్ ప్రిన్సెస్‌గా ‘సంఘమిత్ర’లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు సుందర్ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’, తమిళంలో ‘పులి’.. శ్రుతి రెండు సోషియో ఫాంటసీ ఫిల్మ్స్ చేశారు. రెండిటిలోనూ ఆమెకు యుద్ధాలు చేసే ఛాన్స్ రాలేదు. ఈ ‘సంఘమిత్ర’లో ఆమె టైటిల్ రోల్లో కనిపించనున్నారు. లుక్ ఎలా ఉందో చూశారుగా? శత్రువుల లెక్కలు సరిచేయడంలో శ్రుతి ఏమాత్రం ఛాన్స్ తీసుకోరని అర్థమవుతోంది కదూ! ఈ సినిమా కోసం లండన్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఇతర యుద్ధ విద్యల్లో శ్రుతి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. శ్రుతితో పాటు ఇందులో హీరోగా నటిస్తున్న ఆర్య లుక్‌ను కూడా కేన్స్‌లో విడుదల చేశారు. -
సౌత్ నుంచి తొలి అడుగు శ్రుతిదే!
తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్. సి మూడు భాషల్లోనూ ‘సంఘమిత్ర’ అనే భారీ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రారంభం కానుంది. అదీ ఫ్రెంచ్ రివేరా తీరంలో జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఈ 17 నుంచి 28 వరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి ఏడాది కాన్స్‌కి పలువురు హిందీ హీరోయిన్లు హాజరవుతారు. అయితే... ఓ సినిమా ప్రారంభోత్సవం నిమిత్తం కాన్స్ వెళ్తున్నది మాత్రం శ్రుతీనే. కేన్స్ రెడ్ కార్పెట్ మీద మెరిసే ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా ఈమేనని సమాచారం. విద్యాబాలన్ సౌతిండియన్ అయినప్పటికీ హిందీ నటిగానే కాన్స్‌కి వెళ్లారు. సౌత్‌లో హీరోయిన్గా సెటిల్ అయిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ సైతం గతేడాది ఫారిన్ సంస్థ ప్రచారం నిమిత్తం కాన్స్ వెళ్లారు. ఈ ఏడాది ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్ సినిమా ప్రచారం కోసం వెళ్తారట! -
సమంత అలా...శృతి ఇలా..
-
సమంత అలా...శృతి ఇలా..
ముంబాయి: అందాల భామలు కర్ర సాము, కత్తి యుద్ధ విన్యాసాలతో అభిమానులను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సమంత కర్ర సాముతో ఆకట్టుకుంటే, శృతిహాసన్ కత్తి ఫైట్‌తో వార్తల్లోనిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెకకునున్న చారిత్రాత్మక సినిమా ‘సంఘమిత్ర’లో లీడ్ రోల్‌కు ఎంపికైన శృతి పూర్తిగా సినిమా మూడ్‌లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటివి బాగా ప్రాక్టీసు చేస్తోంది. దీనికి సంబంచిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకోసం కత్తి ఫైటింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సంఘమిత్ర సినిమా కోసం కత్తి పోరాటాలను నేర్చుకుంటూ మానసికంగా రడీ అవుతోంది. ఈ సినిమాలో యువరాణిగా అలరించనున్న శృతి ప్రత్యేకంగా లండన్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. లండన్ లో పేరొందిన యాక్షన కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్ కత్తి యుద్ధ ఎక్స్పర్ట్ ఈమెకు శిక్షణ ఇస్తున్నారట. హిస్టారికల్ మూవీ ‘సంఘమిత్ర’ కోసం ఈ కత్తి యుద్ధం నేర్చుకోవడంతో ఆనందంగా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అటు అభిమానులను, సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అయింది. మెగా బడ్జెట్ తో సుందర్ సి నిర్మాతగా రానున్న ఈ ట్రై-లింగ్వల్ మూవీలో శృతి యువరాణి పాత్ర పోషించనుంది. ఇంకా ఆర్య, జయం రవి హీరోలుగా నటించనున్న ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతుంది. శ్రీ తేన్నందర్ ఫిల్మ్స్ పతాకంపై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తం 11 దేశాల్లో సంఘమిత్ర చిత్రీకరణ జరగనుందని టాక్. -
ఇండియాలో డాడీ వెయిటింగ్
ప్రస్తుతం శ్రుతీహాసన్ ఎక్కడ ఉన్నారు? లండన్‌లో. ఏం చేస్తున్నారు? సుందర్ సి దర్శకత్వంలో నటించే భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిల్మ్ ‘సంఘమిత్ర’ కోసం కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటున్నారు. ‘సంఘమిత్ర’లో శ్రుతి వారియర్ ప్రిన్సెస్‌గా కనిపించనున్నారు. అయితే... ఇండియాలో ఉన్న కమల్ హాసన్ కూతురు ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అమ్మాయి ఎక్కడో దూరంగా ఉంది, ఎలా ఉందోననే బెంగ మాత్రం కాదు. శ్రుతి ఆయనకు టైమ్ ఇస్తే... ‘శభాష్ నాయుడు’ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. కమల్ కాలికి గాయం కావడం ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. అందువల్ల, ఆర్టిస్టులందరూ ఈ సినిమాకి కేటాయించిన డేట్స్ వేస్ట్ అయ్యాయి. ఇప్పుడు కమల్ పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ షూటింగ్ ప్రారంభించాలనుకుంటే శ్రుతి బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితి గురించి కమల్ మాట్లాడుతూ – ‘‘మా టీమ్ అందరిలో శ్రుతి బిజీ ఆర్టిస్ట్. అదృష్టవశాత్తూ నేను తండ్రిని కావడంతో నాకు (నా సినిమాకు) ప్రయారిటీ ఇస్తుందనుకుంటున్నా. కొన్ని వారాలు ఇండియాలో, కొన్ని వారాలు విదేశాల్లో చిత్రీకరణ చేయాలి. ఆగస్టు కల్లా చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నా’’ అన్నారు. -
సుకుమారి... వీరనారి
‘ఏం చక్కని మందారం.. ఇది ఎనిమిది దిక్కుల సింధూ రం’... అని హీరో పాడుతుంటే.. హీరోయిన్ శ్రుతీహాసన్ సుతి మెత్తగా అడుగులు వేస్తూ, తన సుకుమారాన్నంతా నడకలోనే ప్రదర్శించేసింది. అది పాట కాబట్టి అలా కనిపించింది. అదే ఫైట్ అయితే వీరనారిలా విజృంభిస్తుంది. ‘సంఘమిత్ర’ సినిమాలో అలాంటి పాత్రనే చేయనుంది శ్రుతి. నటి ఖుష్బూ భర్త సుందర్. సి దర్శకత్వంలో మూడు భాషల్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా నటించనున్న శ్రుతి ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకునే పని మీద ఉంది. టిమ్ క్లోజ్ క్లోజ్ అనే ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో లండన్‌లో ఆమె ఫైట్స్ నేర్చుకుంటోంది. అక్కడ సిన్సియర్‌గా శిక్షణ తీసుకుంటూ, ఖాళీ సమయాల్లో లండన్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తోంది. అలాగే, అక్కడి వంటకాలను కూడా ఓ పట్టు పడుతోందామె. ‘జయం’ రవి, ఆర్య హీరోలుగా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. మన ‘బాహుబలి’కి ప్రభాస్ మూడు నాలుగేళ్లు కేటాయించినట్లే ఈ చిత్రం కోసం ‘జయం’ రవి, ఆర్య ఏడాదిన్నరకు పైగా డేట్స్ ఇచ్చేశారట. శ్రుతీహాసన్ కూడా ఈ చిత్రానికి ఎక్కువ రోజులు ఇచ్చారని సమాచారం. -
చారిత్రాత్మక చిత్రంలో శ్రుతిహాసన్
బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ ఒక భాగం కానున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. శ్రుతి ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ–3 మంచి విజయం సాధించింది. తాజాగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా సంఘమిత్ర అనే హిస్టారికల్ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక కథానాయకిగా టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా?
సంఘమిత్ర చిత్రంలో నటించే హీరోల కోసం చాలా చర్చలే జరిగాయి. ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నుంచి చాలా మంది ప్రముఖ స్టార్ నటులను సంప్రదించారు. అందరూ కథ సూపర్ అన్నారే గానీ అందులో నటించడానికి సందేహించారు. కారణం ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే రూపొందించనంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవడమే. మొత్తానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక హీరోయిన్లు ఎవరన్న చర్చ మొదలైంది. ఆ పాత్రల కోసం చాలా మంది టాప్ స్టార్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న బ్రహ్మాండ చారిత్రక కథా చిత్రం కావడంతో అందుకు తగ్గట్టుగా కథానాయికలు ఉండాలని చిత్రయూనిట్ వర్గాలు భావిస్తున్నారు. అందుకు బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా కరెక్ట్‌గా ఉంటారని భావించిన దర్శక నిర్మాతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఇప్పటికే కోలీవుడ్‌లో రజనీకాంత్ సరసన ఒక్కో చిత్రంలో నటించిన అనుభవం ఉండడం కూడా వారిని సంఘమిత్ర చిత్రంలో నాయికలుగా ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ అందాల భామలు అంగీకరిస్తారా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించనున్నారు. సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, సబుసిరిల్ కళా దర్శకత్వాన్ని, కమల్ కన్నన్ గ్రాఫిక్స్, హిందీ చిత్రం భాజీరావ్ మస్తాని ఫేమ్ సందీప్ చటర్జీ ఛాయాగ్రహణం అందించనున్నారు. రచయిత ప్రభాకరన్, దర్శకుడు బద్రి సంఘమిత్రకు కథా సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సంఘమిత్ర కథానాయకులు ఖరారు
సంఘమిత్ర చిత్రానికి కథానాయకులు ఎట్టకేలకు ఖరారయ్యారు. దర్శకుడు సుందర్.సీ ఒక గొప్ప సృష్టికి నూతన సంవత్సరం ప్రారంభంలో శ్రీకారం చుడుతున్నారు. ఆయన సంఘమిత్ర పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 100వ చిత్రంగా నమోదు కానున్న చిత్రం సంఘమిత్ర. కాగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో సోషల్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఇందులో కథానాయకులుగా నటించేందుకు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ ప్రయత్నించారు. అందులో ఇళయదళపతి విజయ్, సూర్య, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కథ నచ్చినా ఈ భారీ చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవ్వడంతో ఆ స్టార్ నటులు అన్ని కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కావడంతో నటించేందుకు ముందుకు రాలేకపోయారు. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఎంపికయ్యారని సమాచారం. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం, సాబుశిరిల్ కళాదర్శకత్వం, కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచయిత ప్రభంజన్, దర్శకుడు బద్రిలతో కలిసి సుందర్.సీ కథను తయారు చేశారు. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సంఘమిత్రలో దీపిక నటిస్తుందా?
బాలీవుడ్ టాప్ కథానాయికల్లో దీపికాపడుకొనే ఒకరు. చాలా మంది ఉత్తరాది బ్యూటీస్‌లానే ఈ అమ్మడికి కోలీవుడ్‌పై ఓ కన్ను. తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆశను సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన మోషన్ ఫార్మాట్లో తెరకెక్కిన యానిమేషన్ త్రీడీ చిత్రంతో తీర్చుకున్నారు. అయితే ఆ ఒక్క చిత్రంతో ఒక్కడి దర్శక నిర్మాతలకు దీపికపై మోజు తీరలేదు. ఆ తరువాత చాలా మంది ఈ ముద్దుగుమ్మను కోలీవుడ్ తెరపై చూపించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ప్రస్తుతం ఆంగ్ల చిత్రంలో నటిస్తున్న దీపికాపడుకోనే హిందీ చిత్రాలకే కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో నటి కుష్భు భర్త, దర్శకుడు సుందర్.సీ ఈ అమ్మడిని తన చిత్రంలో నటింపజేసే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ఈయన సంఘమిత్ర అనే బ్రహ్మాండ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందుకు బాహుబలి చిత్రం స్థాయిలో చారిత్రక కథను ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీతెనాండాళ్ ఫిలింస్ సంస్థలో వందో చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో మొదట ఇళయదళపతిని హీరోగా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. కథ విన్న ఆయన చాలా బాగుందని కితాబిచ్చారు గానీ, ఈ చిత్రానికి అవసరం అయిన కాల్షీట్స్ కేటాయించలేనని చేతులెత్తేశారు. ఆ తరువాత సూర్య పేరు చర్చల్లోకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నట్లు సమాచారం. అందువల్ల మూడు భాషలకు తగ్గ నాయకిని సంఘమిత్ర కోసం ఎంపిక చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు, అందుకు నటి దీపికాపడుకొనే అయితే బాగుంటుందన్న భావనతో ఆమెతో సంప్రదిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ బ్యూటీ సంఘమిత్రలో భాగం అవుతారా?అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ చిత్రంలోని తారాగణం గురించి దర్శకుడు సుందర్.సీ నోరుమెదపడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు. -
సంఘమిత్రలో...
దక్షిణాది భామ దీపికా పదుకొనే ఉత్తరాదిన తిరుగు లేని కథానాయిక అనిపించుకున్నారు. ఈ బ్యూటీని సౌత్ నుంచి పలు ఆఫర్లు వరించినా, డేట్స్ ఖాళీ లేక అంగీకరించలేకపోయారు. ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు సుందర్.సి చారిత్రక నేపథ్యంలో ‘సంఘమిత్ర’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకా హీరోను ఖరారు చేయలేదు. దీపికా పదుకొనేని కథానాయికగా నటింపజేయాలనుకుంటున్నారట. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా పేరున్న సాంకేతిక నిపుణులను ఎంచుకుంటున్నారు సుందర్. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పడుతుందట. -
భారీ చిత్రానికి నో చెప్పాడు..!
ప్రస్తుతం సౌత్ సినిమా రేంజ్ కూడా భారీగా పెరిగిపోతోంది. కలెక్షన్ల రికార్డులతో పాటు బడ్జెట్ పరిదులు కూడా బాలీవుడ్ స్థాయికి వచ్చేస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే భారీ మొత్తాలతో రెడీ అవుతున్నాయి. రోబో, బాహుబలి, బాహుబలి 2, రోబో 2 ఇలా ఇప్పటికే వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్నారు మన మేకర్స్. ఇదే బాటలో మరో భారీ చిత్రం రెడీ అవుతోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్ సి దర్శకత్వంలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా సంఘమిత్ర పేరుతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇంత భారీగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటించేందుకు విజయ్‌ని సంప్రదించగా అతను, నో అన్నాడట. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించాల్సి ఉండటం, ఆ సమయంలో మరే సినిమా చేసే ఛాన్స్ లేకపోవటంతో విజయ్, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుసగా వందకోట్ల సినిమాలతో తమిళనాట సత్తా చాటిన విజయ్, హీరోగా నటిస్తే కలెక్షన్ల విషయంలో ప్లస్ అవుతుందని భావించిన నిర్మాతలకు, విజయ్ నిర్ణయం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. -
11 దేశాలలో 'సంఘమిత్ర' షూటింగ్
బాహుబలి, కబాలి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. 11 దేశాలలో చిత్రీకరణకు సిద్ధమవుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీలోకం ఎదురుచూస్తోంది. గొప్ప చారిత్రాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి 'సంఘమిత్ర' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోగా లీడింగ్ స్టార్లు మహేష్ బాబు, సూర్య, విజయ్‌ల పేర్లు లిస్ట్‌లో ఉన్నట్లు, వాళ్లను అప్రోచ్ అయినట్లు సుందర్ చెబుతున్నాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఇండియాతో పాటు అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాలలో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తారు. 11 దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా 'సంఘమిత్ర' నిలవనుంది.