మళ్లీ కత్తి పడుతుందా?
మహా అయితే ఓ పావుగంట కంటే ఎక్కువసేపు కూడా ఉండదేమో! కార్తీ ‘కాష్మోరా’లో రత్నమహాదేవిగా నయనతార క్యారెక్టర్! అయితే ఏంటి? యువరాణిగా నయనతార ఆహార్యం, కత్తి చేతపట్టి చేసిన యుద్ధ విన్యాసాలు కాసేపే అయినా కుర్రకారును బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడా సినిమా ప్రస్తావన ఎందుకంటే... నయనతారకు మళ్లీ అలాంటి సినిమా ఆఫర్ ఒకటి వచ్చింది.
‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్ బయటకు వెళ్లడంతో తెరచుకున్న తలుపులు ఇంకా అలా ఓపెన్‌గానే ఉన్నాయి. ‘సంఘమిత్ర’లో యువరాణిగా టైటిల్ రోల్‌లో నటించే కథానాయిక కోసం దర్శకుడు సుందర్ .సి, చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ స్టూడియోస్ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో నయన అయితే బాగుంటుందనే అభిప్రాయం చిత్రబృందానికి వచ్చిందట! వెంటనే ఆమెను సంప్రదించడం కూడా జరిగిందని కోడంబాక్కమ్ వర్గాల టాక్. నయనతార మళ్లీ కత్తి పడుతుందో? లేదో?