11 దేశాలలో 'సంఘమిత్ర' షూటింగ్
బాహుబలి, కబాలి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. 11 దేశాలలో చిత్రీకరణకు సిద్ధమవుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీలోకం ఎదురుచూస్తోంది. గొప్ప చారిత్రాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి 'సంఘమిత్ర' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హీరోగా లీడింగ్ స్టార్లు మహేష్ బాబు, సూర్య, విజయ్ల పేర్లు లిస్ట్లో ఉన్నట్లు, వాళ్లను అప్రోచ్ అయినట్లు సుందర్ చెబుతున్నాడు. అయితే ఈ ముగ్గురిలో ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఇండియాతో పాటు అమెరికా, డెన్మార్క్, ఉక్రెయిన్, ఇరాన్ తదితర 11 దేశాలలో ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తారు. 11 దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా 'సంఘమిత్ర' నిలవనుంది.