
బాహుబలి సక్సెస్ తరువాత తమిళ చిత్ర వర్గాలు అదే స్థాయిలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర పేరుతో భారీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ముందుగా టాప్ స్టార్స్‌తో సినిమా రూపొందించాలని ప్రయత్నించిన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో జయం రవి, ఆర్య కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. టైటిల్ రోల్‌కు శృతి హాసన్‌ను ఎపింక చేసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గ్రాండ్‌గా పోస్టర్స్ రిలీజ్ చేశారు.
కానీ కొద్ది రోజులకే శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సంఘమిత్ర ఆగిపోయినట్టే భావించారు. కానీ తాజాగా సంఘమిత్ర చిత్రయూనిట్ షూటింగ్ ప్రారభించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోఫర్ ఫేం దిశా పటాని టైటిల్ రోల్‌లో సినిమాను తెరకెక్కించేందుకు సుందర్.సి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment