
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘ మిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్‌బాబు,ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ సేవలందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment