cyberabad cp
-
హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
-
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
CV Anand- Stephen Raveendra: ఆ ఇద్దరిదీ తమదైన ముద్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు నేతృత్వం వహించే అరుదైన అవకాశం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలకు దక్కింది. ఆయా అంశాల్లో నిష్ణాతులుగా పేరున్న వీరికి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. నార్కొటిక్స్ బ్యూరో హైదరాబాద్ కేంద్రంగా, సైబర్ బ్యూరో సైబరాబాద్ కేంద్రంగా పని చేయనున్నాయి. హెచ్–న్యూ టు టీఎస్ బ్యూరో.. ►యువతను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలను రాష్ట్రం నుంచి పారదోలాలనే లక్ష్యంగా రాష్టస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతేడాది నిర్ణయించారు. అప్పటి నుంచి వివిధ అంశాలపై కసరత్తులు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు గత నెలలో 300 పోస్టులతో ఈ విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021 డిసెంబర్ 25న హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ తన తొలి ప్రాధాన్యం డ్రగ్స్ నిరోధానికే అని స్పష్టం చేశారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపారు. ►ఈ కారణంగానే ఫుడింగ్ అండ్ మింక్లో జరిగిన రేవ్ పార్టీ భగ్నం, అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోనీ అరెస్టు తదితర కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి కొనసాగింపుగా గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు (హెచ్–న్యూ) రూపమిచ్చారు. అతి తక్కువ సిబ్బంది, వనరులతో ఈ విభాగం ఇప్పటికే అద్భుత ఫలితాలు సాధించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను ప్రభుత్వం సీవీ ఆనంద్‌కు అప్పగించింది. ‘సైబర్’లో స్టీఫెన్ మార్క్.. ఆన్లైన్లో అందినకాడికి దోచుకునే సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం, వారి నుంచి సొత్తు రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు కొలిక్కితేవడంతో పాటు వీటిని నిరోధించడానికి పోలీసు విభాగం ప్రాధాన్యమిస్తోంది. నేరం చోటు చేసుకోవడానికి ముందే నేరగాళ్ల ఉనికిని కనిపెట్టి చెక్ చెప్పడంతో పాటు డార్క్ వెబ్ సహా దేని ద్వారా జరిగిన నేరాన్నైనా ఛేదించడం, ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యాలతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ‘తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’కి రూపమిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సర్కారు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించింది. ట్రాఫిక్‌పై మంచి పట్టున్న ‘చీఫ్’ తాజా బదిలీల్లో రాచకొండ అదనపు పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న జి.సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్ టాస్‌్కఫోర్స్‌తో పాటు నార్త్, వెస్ట్ జోన్లు, ట్రాఫిక్ డీసీపీతో పాటు కీలక పోస్టుల్లో పని చేసిన ఆయనకు నగరంపై మంచి పట్టుంది. రాచకొండ సంయుక్త సీపీగా సిటీ సీసీఎస్ నుంచి డాక్టర్ గజరావ్ భూపాల్ వెళ్లారు. కొన్నాళ్లుగా ఇన్చార్జి అదనపు సీపీగా (శాంతిభద్రతలు) ఉన్న విక్రమ్ సింగ్ మాన్ అదే స్థానంలో నియమితులయ్యారు. ఇన్చార్జి సంయుక్త సీపీగా (పరిపాలన) ఉన్న ఎం.రమేష్ డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా ఆయన స్థానంలోకి సీఐడీ నుంచి పరిమళ నూతన్ వచ్చారు. సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ నుంచి కార్తికేయ ట్రాన్స్ఫర్ కాగా అక్కడకు సీఐడీ నుంచి ఎం.శ్రీనివాసులు వస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ జేసీపీగా ఎస్పీ ర్యాంక్‌లో ఉన్న కె.నారాయణ నాయక్‌కు పోస్టింగ్ వచి్చంది. -
సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్ర
-
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని.. చివరికి జైలు పాలయ్యారు
హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్‌కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్‌లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్‌లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్‌తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్‌లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రాజాసింగ్ వర్సెస్ సజ్జనార్!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్ లోధా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జ నార్ మధ్య మంగళవారం మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజాసింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుద ల చేశారు. లోన్ యాప్స్ నిందితుల అరెస్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తన ‘స్వరం మార్చిన’రాజాసింగ్ రాత్రికి మరో వీడియో విడుదల చేశారు. వీరి మధ్య పేలిన మాటల తూటాలిలా.. పోలీసులు బ్రోకర్లుగా పని చేస్తున్నారు.. ‘మహారాష్ట్ర నుంచి ఒక బండిలో 45 ఆవులు, దూడలు బహదూర్‌పురలోని స్లాటర్ హౌస్‌కు తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలసి బహదూర్‌పురలో అక్రమ పశువధపై ప్రశ్నించినా సమాధానం లేదు. మీకు దొరకని బండి మాకు ఎందుకు దొరుకుతోందని సీపీ, డీజీపీలను ప్రశ్నిస్తున్నా.. మా కార్యకర్తలు ఇలాంటి బండ్లు ఆపితే లాఠీచార్జ్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. నువ్వు ఎవరు? ఏ అధికారముందని ప్రశ్నిస్తున్నారు. నేరాలు ఆపే అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. కొత్తూర్ ఎస్సై శ్రీధర్ ఒక బండిని డబ్బు తీసుకుని పంపిస్తున్నారు. తన లిమిట్స్ దాటడానికి డబ్బు తీసుకుని బ్రోకర్‌గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకుని పోలీసులకు డబ్బులిస్తాం. ఇలాంటి పాపం మాత్రం చేయకండి.. – ఉదయం సెల్ఫీ వీడియోలో రాజాసింగ్ పోలీసులపై నిందలు ఫ్యాషనైపోయింది.. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషనైపోయింది. దేశంలోనే తెలంగాణ పోలీసు నంబర్ వన్.. పోలీసులు ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపండి. ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డబ్బు తీసుకున్నారనే ఆధారాలుంటే బయటపెట్టండి. అయినా కూడా చర్యలు తీసుకోకుంటే అప్పుడు మాట్లాడండి.. అంతేకానీ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆ వ్యాఖ్యలపై న్యాయపర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసు నమోదు చేస్తాం – వీసీ సజ్జనార్ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టండి.. సైబరాబాద్ కమిషనర్‌కు చాలెంజ్ చేస్తున్నా. మీ పరిధిలో పోలీస్ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా? లేదా? ఈ నివేదిక మీరు తెచ్చుకోండి. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైనా లేదా పోలీసులపై చర్యలు తీసుకోండి. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. గతంలో మీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా? లేదా? వారిపై రౌడీషీట్ తెరుస్తామని వార్నింగ్ ఇవ్వడం నిజమా? కాదా? మీరు మంచి కమిషనర్.. మీ పరిధిలోని సరిహద్దు ఠాణాల్లో చెక్‌పోస్టులు పెడితే ఒక్క వాహనం నగరం లోపలకు రాదు. మేము కూడా రోడ్డు మీదకి రాము.. – రాత్రి విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ -
బీజేపీ ఎమ్మెల్యేకు సీపీ సజ్జనార్ కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు, డీజీపీపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సీపీ తప్పుబట్టారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) ఆర్బీఐ దృష్టికి ఇన్స్టంట్ లోన్ల వ్యవహారం.. ఇన్స్టంట్ లోన్లపై ఫిర్యాదులు వచ్చాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. క్యాష్ మామా, లోన్ జోన్, ధనాధన్ పేర్లతో లోన్లు ఇస్తున్నారని, ఇన్స్టంట్ లోన్లు వ్యవహారాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గంలో రెండు కంపెనీలను గుర్తించామని, రెండు కంపెనీల్లో 110 మందికి పైగా టెలీకాలర్స్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆరుగురు కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, 22 ఫోన్లు, 18 బ్యాంక్ అకౌంట్లలో 1.52 కోట్లు సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.(చదవండి: శభాష్.. తెలంగాణ పోలీస్!) -
సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘ మిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్‌బాబు,ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ సేవలందిస్తుంది. -
లాక్డౌన్ కట్టుదిట్టం..14వేల వాహనాలు సీజ్
సాక్షి, హైదరాబాద్: కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో 36 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని.. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 14వేల వాహనాలను సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నామని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. -
కరోనా: అత్యవసర సేవల కోసం కాల్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవలకు(మెడికల్ ఎమర్జెన్సీ)కి సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్సులను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆంబులెన్సులు ప్రారంభించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఇప్పటివరకూ 656 మందికి కిడ్నీ డయాలసిస్ కోసం అంబులెన్సులను వినియోగిస్తున్నామన్నారు. ఎస్పీ, కానిస్టేబుళ్లు స్వయంగా డయాలసిస్ కోసం అప్లై చేసుకున్న పేషంట్ల ఇంటికి వెళ్లి పాసులను అందజేశారన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు, గర్భిణిలు, వృద్ధులు అత్యవసర సేవల కోసం కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే covidcontrol@gmail.com ఈమెయిల్ చేయవచ్చని సజ్జనార్ తెలిపారు. -
సీపీ సజ్జనార్ నివాసంలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం రేపింది. శుక్రవారం ఓ ఐదు అడుగుల పాము సజ్జనార్ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఆయన పాములు పట్టడంలో నిష్ణాతుడైన కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్‌ను పిలిపించారు. పాములు పట్టడంలో అందెవేసిన చెయ్యని ఆ కానిస్టేబుల్‌కు డిపార్టు్‌మెంట్‌లో పేరుంది. సజ్జనార్ ఇంటికి చేరుకున్న వెంకటేశ్ పామును చాకచక్యంగా పట్టి బ్యాగులో వేసుకున్నాడు. దానికిఎలాంటి హానీ తలపెట్టకుండా నెహ్రూ జూలాజికల్ పార్కులో అప్పజెబుతానని చెప్పాడు. పామును పట్టి దానితో పాటు తమ ప్రాణాలను రక్షించినందుకు సీపీ సంతోషం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రతిభకు మెచ్చి నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా పామును చూడగానే భయపడిపోయి దాన్ని చంపటానికి ప్రయత్నించకూడదు. దానికి బదులుగా పాములను రక్షించే సిబ్బందికి సమాచారం అందించాలి. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. మనం వాటికి హాని చేయనంత వరకు అవి మనకు హాని చేయవ’ని అన్నారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ కీలక సమాచారంతో పరారైనట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్‌డిస్క్‌లతో అశోక్ ఉడాయించారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడం కోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు ఉన్న నేపథ్యంలో అశోక్ ఏపీలోనే తలదాచుకున్నాడని అనుమానిస్తున్నారు. అశోక్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్‌పోర్ట్ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. (డేటా చోర్.. బాబు సర్కార్) ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు... ఐటీ గ్రిడ్స్ సంస్థపై సోమవారం మరో కేసు నమోదైంది. హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా తయారు చేయించుకున్న ఈ యాప్‌లో ఇతర పార్టీలకు చెందిన వారిని అక్రమంగా ఓటర్ లిస్టు నుంచి తొలగించే కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఈ మేరకు ‘సేవామిత్ర’వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అశోక్, కమలేష్, అబ్దుల్ సమా మరికొందరు కలిసి టీడీపీ అనుకూలంగా లేని వారిని టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతోపాటు యాప్‌లో ఉంచి సర్వే చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) ఈ యాప్ ఉన్న ట్యాబ్‌లతో బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్తున్న టీడీపీ క్యాడర్... ఏపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని 10 నుంచి 15 రకాల ప్రశ్నలు అడుగుతున్నారని, ఇలా టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ పేరుతో బెదిరించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సదరు సంస్థ ప్రయత్నిస్తోందని దశరథరామిరెడ్డి ఆరోపించారు. టీడీపీని వ్యతిరేకించే వారి వివరాలను ఆయా కార్యకర్తలు టీడీపీలోని కీలక వ్యక్తికి పంపిస్తున్నారని, ఈ స్థాయిలో జరిగే కుట్రలో ఆయా వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఓట్లు తొలగించడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ప్రభుత్వ పథకాలు చేరకుండా కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) దీంతో ఐటీ గ్రిడ్స్‌కు చెందిన నిర్వాహకులపై ఐపీసీలోని 420, 419, 467, 468, 471, 120 (బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తాజా కేసు నేపథ్యంలో అశోక్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా వారు సేకరించిన సమాచారం ప్రకారం అశోక్ విజయవాడ చుట్టుపక్కల తలదాచుకున్నట్లు గుర్తించారు. అతని కోసం రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. అశోక్‌ను పట్టుకొని అన్ని కోణాల్లోనూ విచారిస్తే ఈ స్కాం వెనుక ఉన్న ఏపీ ప్రభుత్వ, టీడీపీ పెద్దల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) -
ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు
ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్ మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్లు, ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుంటున్నాం. – సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా కుంభకోణం విషయలో.. ఏపీ ప్రభుత్వం పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కేంద్రంగా జరిగిన ఈ భారీ డాటా కుంభకోణం వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైతే అక్కడి మంత్రులు, అధికారులకూ నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని, ఫిర్యాదుదారుడు లోకేశ్వర రెడ్డిపై వారి ప్రవర్తనకు సంబంధించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమికంగా డేటా చోరీ అయినట్లు కేసు నమోదు చేసినా.. ప్రభుత్వంతో ఉన్న అవగాహన ఒప్పందం నేపథ్యంలోనే ఈ సమాచారమంతా ఐటీ గ్రిడ్స్‌కు చేరిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు ఆయన పలు అంశాలు వెల్లడించారు. డేటా ఎనలిస్ట్ లోకేశ్వరరెడ్డి.. ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ తీరుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆఫీసులో ఉన్న ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ సమక్షంలో.. వారికి అవసరమైన నోటీసులు జారీ చేసే అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐబాల్, డెల్ సీపీయూ, జెబ్రానిక్స్ సీపీయూలు రెండు, ఎం–క్యాబ్ సర్వీసెస్‌లను సీజ్ చేశారు. ‘సేవా మిత్ర’ పేరుతో.. ప్రాథమికంగా విశ్లేషించిన అంశాల ప్రకారం ఏపీ ఓటర్లకు చెందిన డాటా కలర్ ఫొటోలతో ఐటీ గ్రిడ్ వద్ద అందుబాటులో ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం నిర్వహిస్తున్న ‘సేవా మిత్ర’యాప్ కోసం ఈ డాటా వినియోగించారు. దీంతో పాటు ఆధార్, ప్రభుత్వ లబ్ధిదారులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల వివరాలు అందులో పొందుపరిచారు. ఈ యాప్‌ను వినియోగిస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్, స్థానికులు ఏ పార్టీ సానుభూతిపరుల అనేది గుర్తిస్తున్నారు. ఆయా వ్యక్తులు ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే అంశాన్నీ తెలుసుకుంటున్నారు. ఏపీలో ఓటర్ల తొలగింపు అక్రమాలపై అక్కడ 40–50 కేసులు నమోదయ్యాయి. వీటి వెనక ఈ సేవామిత్ర యాప్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. అసలు రహస్య, వ్యక్తిగత డాటాలు ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా చేరాయి? వీరెందుకు ఆ వివరాలను తమ వద్ద ఉంచుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా అవసరమైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం, ఆధార్ వివరాలు నిర్వహించే యూఐడీఏఐ సంస్థలకూ లేఖలు రాయనున్నారు. ఐటీ గ్రిడ్‌కు సాంకేతిక సేవలు అందిస్తున్న అమేజాన్ వెబ్ సంస్థకూ నోటీసులు జారీ అయ్యాయి. అజ్ఞాతంలో అశోక్ ఐటీ గ్రిడ్ కేసులో పోలీసులు విచారణకు రావాలని కోరితో నిరాకరించిన ఆ సంస్థ డైరెక్టర్ అశోక్.. సైబరాబాద్ పోలీసులపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో అనేక అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అవసరమైతే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్రపై అనుమానాలు వచ్చినా విచారణకు పిలిపించాలని భావిస్తున్నారు. అవసరమైతే ఏపీ ప్రభుత్వానికి అక్కడి అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తమ కంప్యూటర్లు, సర్వర్ నుంచి కొంత డాటా తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏదైనా జరిగినా పూర్తి డాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ రిట్రీవ్ చేస్తామని సైబరాబాద్ అధికారులు చెప్తున్నారు. ఏపీ పోలీసుల అత్యుత్సాహం ఐటీ గ్రిడ్ ఉద్యోగి భాస్కర్‌కు సైబరాబాద్ పోలీసులు నిబంధనల ప్రకారం అవసరమైన నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన సమక్షంలో సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తును అడ్డుకోవడానికి, అడ్డంకులు సృష్టించడానికి ఏపీ పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. భాస్కర్ అదృశ్యమయ్యారంటూ శనివారం సాయంత్రం 5.30 గంటలకు పెదకాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తు కోసం ఏకంగా ఓ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో కూడిన బృందం రాత్రి 9 గంటలకల్లా హైదరాబాద్ చేరుకుంది. మాదాపూర్ పోలీసుస్టేషన్‌కు వచ్చి భాస్కర్ అప్పగించాలని ఒత్తిడి చేసింది. దీనికి సైబరాబాద్ పోలీసులు ససేమిరా అనడంతో వెనుతిరిగింది. భాస్కర్ ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయన కుటుంబీకులపై ఒత్తిడి తెస్తూ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని చూశారు. ఆదివారం ఉదయం ఏపీ పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటిపై దాడి చేశారు. అక్రమంగా ఆయన ఇంట్లో జోరపడటంతో పాటు ఫిర్యాదు చేయడంపై తీవ్రంగా బెదిరించారు. దీనిపై లోకేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్వరరెడ్డి ఫిర్యాదుతో సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులు.. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, బెదిరించడం ఆరోపణలపై ‘గుర్తుతెలియని నిందితులపై’కేసు నమోదు చేశారు. ‘ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తు కోసం కేవలం మూడున్నర గంటల్లో డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి’అని సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్‌మీడియా వేదికగా, మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్స్, ఆరోపణల్నీ పరిగణలోకి తీసుకుంటున్నామని, అవసమైతే వీటి పైనా చర్యలు ఉంటాయని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులోనూ ఐటీ గ్రిడ్ పాత్ర ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా తొలగింపు వెనుక ఐటీ గ్రిడ్ పాత్ర ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో అశోక్ వాంగ్మూలం కీలకం. ఆయన వచ్చి లొంగిపోయి, సమాచారం ఇవ్వకుంటే అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ డాటాను ఐటీ గ్రిడ్ చోరీ చేసిందా? లేక ఏపీ ప్రభుత్వం, అధికారులు ఇచ్చారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ డాటా మొత్తం ఆంధ్రా వాళ్లది అయినప్పటికీ దుర్వినియోగం జరిగింది సైబరాబాద్‌లో. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తామే దర్యాప్తు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును రెండు రోజులుగా అశోక్ అడ్డుకుంటున్నారు. కేసు దర్యాప్తు కోసం సైబరాబాద్ పోలీసులు నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఏసీపీ నేతృత్వంలో స్థానిక, సైబర్‌క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ నుంచి వివరాల సేకరణకు యత్నం ఐటీ గ్రిడ్‌లో సోదాల కోసం సైబరాబాద్ పోలీసులకు సహకరించిన ఆ సంస్థ ఉద్యోగి భాస్కర్‌ను ఏపీ పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడకు చేరుకున్న ఏపీ పోలీసులు.. సైబరాబాద్ అధికారుల దర్యాప్తు విధానం, అడిగిన ప్రశ్నలు, తెలుసుకున్న వివరాలు ఏంటని ఆరా తీశారు. భాస్కర్‌ను అడిగి కొన్ని ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మా దర్యాప్తులో వేలు పెట్టొద్దం’టూ సజ్జనార్ ఏపీ పోలీసులకు స్పష్టం చేశారు. ఈ విషయంపై అక్కడి డీజీపీకి లేఖ రాస్తామన్నారు. ఏపీ ప్రజలు, ఓటర్లకు చెందిన వ్యక్తిగత, సున్నిత డాటా ఐటీ గ్రిడ్‌కు చేరడంపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఐటీ గ్రిడ్‌కు వైజాగ్‌కు చెందిన బ్లూఫ్రాగ్ సంస్థకు ఉన్న సంబంధాలను సైతం ఆరా తీయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. అసలు ఐటీ గ్రిడ్ సంస్థ ఎలా ఏర్పాటైంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఎప్పటి నుంచి పని చేస్తోందనే తదితర వివరాలు కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సైబరాబాద్ పోలీసులు లేఖ రాయనున్నారు. చదవండి: తెలుగు ‘జోకర్‌బర్గ్’ డేటా చౌర్యం! డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్! -
ఐటీగ్రిడ్స్ స్కాం : కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేశాం
-
ఏపీ పోలీసులు ఎందుకు ఇలా చేశారో ...
సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో ఎంతటి వాళ్లనైనా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసును ఏపీ పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల పనితీరును సీపీ సజ్జనార్ తప్పుబట్టారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...’ మా పరిధిలో కేసు జరుగుతుంటే ఏపీ పోలీసులు ఇష్టారీతిలో కల్పించుకుంటున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. డేటా చోరీకి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు తమవద్దే ఉన్నారని చెప్పినా, వారి కుటుంబసభ్యులను బెదిరించి స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మేం విచారించిన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ పోలీసులు ఏం అడిగారని తెలుసుకున్నారు. ఒక మిస్సింగ్ కేసు కోసం ఏసీపీ స్థాయి అధికారి వస్తారా?. ఏపీ పోలీసులు ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు. అంతేకాకుండా డేటా చోరీపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని బెదిరించిన కేసులో ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశాం. అత్యంత సున్నితమైన డేటాను ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారు. ఆ అధికారం ఎవరిచ్చారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాం. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ దాకవరపు తనకు తానుగా లొంగిపోవాలి. చట్టపరంగా దోషులను శిక్షిస్తాం. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా కులాలపరంగా, పథకాల లబ్ధిదారుల పరంగా, ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అనే పూర్తి వివరాల డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉండే నిందితులనే పట్టుకుని స్వదేశానికి తీసుకొస్తున్నాం. అలాంటిది పక్క రాష్ట్రమైన ఏపీలో ఉన్న నిందితులను తెలంగాణకు తీసుకురాలేమా? ఇందుకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు’ అని స్పష్టం చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డ ఏపీ పోలీసులపై కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఐటీగ్రిడ్స్ స్కాం : కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ సంస్థ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులు సమక్షంలోనే సోదాలు జరిపామన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్ గౌడ్, చంద్ర శేఖర్, ఫణి కుమార్, భాస్కర్ల సమక్షంలోనే ఆదారాలు సేకరించామని తెలిపారు. కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!) ఐబాల్, డెల్ కంప్యూటర్, ట్యాబ్‌టాప్, డెల్ సీపీయూ, మొబైల్ ఫోన్స్, ఇతర పరికరాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఎంక్యాబ్ సిరీస్ ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశామని చెప్పారు. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా సోదాల్లో లభించాయన్నారు. ఐటీ గ్రిడ్ డేటా అమెజాన్ సర్విస్‌లో భద్రపరినట్లు విచారణలో తేలిందన్నారు. నియోజకవర్గాల వారిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ అక్రమంగా సేకరించిందన్నారు. అక్రమంగా డేటా సేకరించి, ఓట్లు తొలగిస్తున్నట్లు కొంతమంది చేసిన ఫిర్యాదుపై దర్యాప్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెజాన్ వెబ్ సర్వేసెస్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘ట్రాయ్’ నిబంధనలు పాటించాలి
సాక్షి, సిటీబ్యూరో: సిమ్ కార్డుల జారీ చేసే విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు దేశవ్యాప్తంగా సిమ్‌స్వాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో బుధవారం మొబైల్ సర్వీసు ప్రొవైడర్లతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. కోల్‌కతా కేంద్రంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని కంపెనీల పేరు మీద ఉన్న సిమ్ కార్డుల స్థానంలో సరైన పత్రాలు లేకుండానే డూప్లికేట్ సిమ్‌లు పొంది భారీగా టోకరా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులు సిమ్‌కార్డుల జారీలో లోపాలను వివరించారని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్‌లో సిమ్ కార్డుల జారీలో ట్రాయ్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మంగళ సూత్రాలు దోచేస్తారు ఇలా..
-
మంగళ సూత్రాలు దోచేస్తారిలా...
సాక్షి, సైబరాబాద్ : గత అక్టోబర్‌లో సంచలనం సృష్టించిన ఇరానీ గ్యాంగ్ (డైవర్టింగ్ గ్యాంగ్) కేసును తమ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ఇరానీ గ్యాంగ్ లీడర్ వసీం అబ్బాస్ సిరాజ్, జై కుమార్ రాజక్, నియాజ్ మొహమ్మద్ ఖాన్, జావీద్ బాలీలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముంబై, వారణాసి, అలహాబాద్, పట్నాలలో ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మొత్తం 11 లక్షల విలువ చేసే 32 తులాల మంగళ సూత్రాలను ఇరానీ ముఠా దోచుకెళ్లిందని.. వారి వద్ద నుంచి 100 శాతం ప్రాపర్టీని రికవరీ చేశామని పేర్కొన్నారు. ఇక ఇరానీ గ్యాంగ్ లీడర్ వసీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతడిపై 58 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. మంగళ సూత్రాలు దోచేస్తారు ఇలా.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న ఒంటరి మహిళలను గ్యాంగ్ టార్గెట్ చేసి ఇరానీ గ్యాంగ్ కొత్త తరహా మెసానికి పాల్పడిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ‘ మొదట పూజా సామగ్రిని దేవాలయంలో ఇవ్వాలని మహిళలను ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత మంగళసూత్రం పూజా సామాగ్రి పైన పెడితే మంచి జరుగుతుందని నమ్మిస్తారు. ఈ క్రమంలో మహిళలు మెడలో నుంచి మంగళసూత్రం తీసిన వెంటనే వెయ్యి రూపాయల నోటులో మడత పెట్టి పూజా బ్యాగులో పెడతారు. ఆ తర్వాత మహిళలను మాటల్లో పెట్టి వాటిని దోచుకెళ్తారు’ అని సీపీ వెల్లడించారు. -
సైబర్ నేరాలపై అవగాహన
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అందరిలో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో ఈ నెల 23న ‘సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ 3.0’ను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) నిర్వహిస్తోంది. మంగళవారం ఈ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సందీప్ శాండిల్య.. ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణికుమార్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఐటీ కంపెనీలే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్సియల్, హెల్త్ కేర్, రవాణా, ఆతిథ్య రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగిస్తారన్నారు. ఆధునిక కాలంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగా యని అభిప్రాయపడ్డారు. ట్రోజన్లు, ర్యాన్ సమ్ వేర్లు, మాల్వేర్స్, బగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలకు పెను ముప్పుగా మారి సవాల్ విసురుతున్నాయన్నారు. 23న జరగనున్న ‘సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 3.0’లో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు, ఇంగ్లండ్, అమెరికా, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ నుంచి దాదాపు 350 మంది డెలిగేట్స్ పాల్గొంటారన్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డెమో వీడియోలను చూపిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు www.cyberrecurity.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ.. అంతర్జాలంలో డార్క్ నెట్లో డ్రగ్స్, వెపన్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఐటీ సంస్థలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఫోరం లీడర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ పాల్గొన్నారు. -
ముగ్గురు చైన్స్నాచర్లపై పీడీ యాక్టు
హైదరాబాద్: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్ పొంది బయటకు రావడం...మళ్లీ అదే పంథా కొనసాగిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు కరుడుగట్టిన చైన్స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్భంధంలోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ ఆలీ, సల్మాన్ ఆలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఆలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంతమంది చైన్స్నాచర్లకు సారథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవింద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాడని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ తెలిపారు. -
విస్తృతంగా పోలీసుల తనిఖీలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ 46 పోలీస్స్టేషన్ల పరిధిలోని 12 ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 వరకు వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైన్ స్నాచర్లు, తీవ్రవాదుల కదిలికల నేపథ్యంలో ఈ మేరకు నాకాబందీ చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
మెట్రో భద్రతను పరిశీలించిన సీపీ
మెట్రో రైలు డిపోలు, స్టేషన్లలో భద్రతా పరిస్థితిని సైబరాబాద్ పోలీసు కమిషన్ సీవీ ఆనంద్ పరిశీలించారు. హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఇంజనీర్లతో కలిసి ఆయన ఉప్పల్ డిపో, ఓసీసీ, నాగోల్-మెట్టుగూడ మధ్య ఉన్న మెట్రో స్టేషన్లను పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. 2015 మార్చిలో మెట్రో మొదటిదశ ప్రారంభం కావాల్సిన విషయం తెలిసిందే. మెట్రో స్టేషన్లు, డిపో, ఓసీసీ తదితర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలో చూశారు. కాపలా లేనిచోట్ల సెన్సర్లు, అలారంల ఏర్పాటు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల వద్ద ప్రయాణికుల తనిఖీ, లగేజి స్కానర్లు, చొరబాటు నిరోధ వ్యవస్థలు.. ఇలా అన్నింటినీ పరిశీలించారు. స్టేషన్ల వద్ద రద్దీ నియంత్రణ వ్యవస్థలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలనూ సీవీ ఆనంద్ తదితరులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడి భద్రతపై తమ అంచనా వివరాలను త్వరలోనే అందిస్తామని ఆనంద్ తెలిపారు. అలాగే నాగోలు -మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లు ఏ స్టేషన్ పరిధిలోకి రావాలన్న అంశాలపై కూడా చర్చించారు.