సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..
వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్‌ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment