Avinash Mohanty
-
గాంధీకి స్టేషన్ బెయిల్.. బీఆర్ఎస్ నేతలు అందుకే అరెస్ట్: సీపీ అవినాష్ మహంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిష్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ ఎపిసోడ్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాదనలు, ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, అరెస్ట్‌లపై తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాం. హరీష్‌రావుకు అరెస్ట్ చేసిన నోటీసు ఇచ్చి పంపించివేశాం. పోలీసుల విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని మరో కేసు నమోదైంది. కౌశిక్, గాంధీలపై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.ఇదిలా ఉండగా.. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని, గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి -
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
పట్టుబడ్డ రూ. 10 కోట్ల డ్రగ్స్ ఎవరికి అమ్మడానికంటే
-
హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు. ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. -
హెల్మెట్ ఉండాల్సిందే!
సైబరాబాద్ పరిధిలో ద్విచక్రవాహనదారులకు తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సైబరాబాద్ పరిధిలో రోడ్డెక్కాలంటే ద్విచక్ర వాహనదారులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇంతకుముందు ఈ నిబంధన ఉన్నా ఎక్కడా సరిగా అమలు కాలేదు. కానీ, ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ కావడం, నగర శివార్లటలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఘటనలో ఎక్కువగా ప్రమాదాల బారినపడడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట వాహనదారుల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి(బుధవారం) నుంచి 12వ తేదీ వరకు సైబరాబాద్ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించనున్నారు. ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ ఏసీపీలు, 12 ఠాణాల ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. వారోత్సవాల్లో భాగంగా శివార్లలోని కళాశాలల విద్యార్థులకు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తారు. ఇకపై కేసు నమోదు.. చలానాలు.. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను 300కు తగ్గించగలిగారు. ఇక హెల్మెట్లపై కూడా ఇదే రకమైన తనిఖీలు నిర్వహించి ఈసారి ప్రమాద మృతుల సంఖ్యను భారీగా తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకపక్క అవగాహన కల్పిస్తూనే మరో పక్క మోటారు వాహనాల చట్టం -1988 ప్రకారం చలానాలు విధించడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తే కేసులు నమోదు చేసి, చలానా విధించేవారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీని వల్ల నగర రోడ్లపై ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే కొనుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో చాలా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. - డీసీపీ మహంతి -
‘న్యూఇయర్’కు నిబంధనలు
* ఆంక్షలు విధించిన నగర పోలీసులు.. ఔటర్ రింగ్ రోడ్డుపై నిషేధాజ్ఞలు * డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే సంబరాలకు అనుమతి * మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. 200 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ప్రణాళికతో పాటు నిబంధనలను సైతం సిద్ధం చేశారు. గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు పక్కా ప్రణాళికతో బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోలేదు. ఈ ఏడాది కూ డా ఈ వేడుకలను ప్రశాంతంగా జరిపేందుకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు కసరత్తు చేపట్టారు. బుధవారం సైబరాబాద్ కమిషరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో స్టార్ హోటళ్లు, పబ్‌లు, ఫాంహౌజ్ నిర్వాహకులతో సీవీ ఆనంద్ ప్రత్యేక సమావేశం నిర్వహిం చి నూతన సంవత్సర వేడుకలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు. హద్దుమీరితే దండనే... న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వేడుకల్లో అపశ్రుతులు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మద్యం తాగి ఎవ్వరూ డ్రైవింగ్ చేయరాదు. త్రిబుల్ రైడింగ్‌కు పాల్పడినా దండన తప్పదు. పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు జరపాలి. సమయపాలన పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేస్తాం. - మహేందర్‌రెడ్డి, కమిషనర్ సైబరాబాద్‌లో 25 స్టార్ హోటళ్లు, 3 పబ్స్, 22 రిసార్ట్స్, 269 ఫాంహౌజ్‌లలో ఈ వేడుకలు జరుగనున్నాయి. నగరంలోని హోటళ్లు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వేడుకల్లో మద్యం సేవించిన తరువాత వాహనాలు నడపరాదని, అలా నడిపే వారిపై నిఘా పెట్టామని, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులపై సైబరాబాద్‌లోని మొత్తం సిబ్బంది 7,500 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నిర్వహిస్తారని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపారు. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ పేర్కొన్నారు. వేడుకల నిబంధనలివీ... - కార్యక్రమాల నిర్వహణకు రాత్రి 8 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి. - కార్యక్రమాన్నంతా సీడీలో నిక్షిప్తం చేసి కమిషనర్‌కు నిర్వాహకులు అందజేయాలి. - ఒంటిగంట తరువాత కూడా కార్యక్రమం కొనసాగితే కేసులు నమోదవుతాయి. - జంటలను మాత్రమే అనుమతించాలి. ఒంటరిగా అబ్బాయినిగాని, అమ్మాయినిగాని అనుమతించరాదు. ఆహ్వానం ఉన్నవారినే లోపలికి అనుమతించాలి. - అనుమతిలేనిదే బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు, హోర్డింగులు ప్రదర్శించరాదు. - 1974 గేమింగ్ చట్టం వర్తించే ఆటలు నిర్వహించరాదు. డీజే సౌండ్ నిషేధం. 45 డెసిబిల్స్ కంటే మించి శబ్దాలు రాకూడదు. - నగ్న ప్రదర్శనలు, అశ్లీల చిత్రాల ప్రదర్శనలు, నృత్యాలపై నిషేధం ఉంది. - ప్రచార పత్రాలు, హోర్డింగులలో అశ్లీలత ఉండరాదు. - ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం పంపిణీ చేయరాదు. మద ్యం సేవించి గొడవ చేసే వారిని అరికట్టాలి. - బాణాసంచా కాల్చరాదు. అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలు పాటించాలి. - ఆహ్వానితులకు పోలీసుల నిబంధనలు ముందుగానే వివరించాలి. - సీట్లకు మించి ఆహ్వానితులు ఉండరాదు. - తాగి వాహనాలు నడపకూడదు. ప్రతి రహదారిపై పోలీసు నిఘా - వేడుకల నిర్వాహకులే సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని ట్రాఫిక్‌ను సరి చేసుకోవాల్సి ఉంటుంది. - పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలు పార్క్ చేయాలి. ఎక్కడపడితే అక్కడ రోడ్డుపై పార్క్ చేస్తే సీజ్ చేస్తారు. - జంట పోలీసు కమిషనరేట్లలో 200 ప్రాంతాలలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. - డ్రంకెన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తె పోలీసులు చలానా విధిస్తారు. - నగరంలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. ఓఆర్ఆర్పై నిషేధాజ్ఞలు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నిషేధాజ్ఞ లు విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. సైబరాబా ద్ పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. - 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గం. వరకు ఓఆర్ఆర్తో పాటు ఇతర ప్రాంతాలలో ట్రాఫిక్‌పై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. - ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఓఆర్ఆర్పై అనుమతించరు. - విమాన ప్రయాణికులు కారులో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అయితే వారు విమాన ప్రయాణ టికెట్లు చూపించాల్సి ఉంటుంది. - సాధారణ ప్రయాణికులు కారులో ప్రయాణించడంపై ఆంక్షలు విధించారు. - కేవలం భారీ సరుకు రవాణా వాహనాలు, చిన్నపాటి గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. - పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేస్తారు. - ఫతేనగర్, హఫీజ్‌పేట ఫ్లైఓవర్లపై మాత్రం ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. - వేడుకలలో పాల్గొనే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.