సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవలకు(మెడికల్ ఎమర్జెన్సీ)కి సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్సులను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆంబులెన్సులు ప్రారంభించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఇప్పటివరకూ 656 మందికి కిడ్నీ డయాలసిస్ కోసం అంబులెన్సులను వినియోగిస్తున్నామన్నారు. ఎస్పీ, కానిస్టేబుళ్లు స్వయంగా డయాలసిస్ కోసం అప్లై చేసుకున్న పేషంట్ల ఇంటికి వెళ్లి పాసులను అందజేశారన్నారు.
మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు, గర్భిణిలు, వృద్ధులు అత్యవసర సేవల కోసం కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే covidcontrol@gmail.com ఈమెయిల్ చేయవచ్చని సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment