గత అక్టోబర్‌లో సంచలనం సృష్టించిన ఇరానీ గ్యాంగ్ (డైవర్టింగ్ గ్యాంగ్) కేసును తమ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ఇరానీ గ్యాంగ్ లీడర్ వసీం అబ్బాస్ సిరాజ్, జై కుమార్ రాజక్, నియాజ్ మొహమ్మద్ ఖాన్, జావీద్ బాలీలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముంబై, వారణాసి, అలహాబాద్, పట్నాలలో ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.