
సాక్షి, హైదరాబాద్: కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టగా అమలు చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో 36 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని.. అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 14వేల వాహనాలను సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నామని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment