డ్రగ్‌ పార్టీ.. అరెస్ట్‌ | Manjira Group Director Gajjala Vivekanand arrested in Drugs Case | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ పార్టీ.. అరెస్ట్‌

Published Tue, Feb 27 2024 5:13 AM | Last Updated on Thu, Mar 28 2024 12:45 PM

Manjira Group Director Gajjala Vivekanand arrested in Drugs Case - Sakshi

గచ్చిబౌలి (హైదరాబాద్‌): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్‌ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు, మంజీరా గ్రూప్‌ చైర్మన్‌ గజ్జల యోగానంద్‌ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్‌ హోటల్‌ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్‌ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు.  

సొంత హోటల్‌లో 10 మందితో కలిసి..‘
శనివారం రాత్రి రాడిసన్‌ హోటల్‌లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్‌లో సోదాలు చేశారు. అయితే డ్రగ్‌ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్‌ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్‌.. ముగ్గురికీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చింది.

హోటల్‌లో కొకైన్‌ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్‌ కవర్లు 3, డ్రగ్‌ వినియోగానికి ఉపయోగించిన వైట్‌ పేపర్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీ డ్రగ్‌ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. 

వీఐపీలపై కేసు నమోదు 
రాడిసన్‌ హోటల్‌లోని 1200, 1204 గదుల్లో డ్రగ్‌ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్‌ ఏవియేషన్‌ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్‌ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం.  

డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా రాడిసన్‌! 
గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్‌లో కొంతకాలంగా డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్‌ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్‌ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్‌ పార్టీలలో డ్రగ్స్‌ వినియోగించవద్దని సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్‌ హోటల్‌ యధేచ్చగా డ్రగ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
 
గచ్చిబౌలి (హైదరాబాద్‌):  హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్‌ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు, మంజీరా గ్రూప్‌ చైర్మన్‌ గజ్జల యోగానంద్‌ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్‌ హోటల్‌ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్‌ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు.  

సొంత హోటల్‌లో 10 మందితో కలిసి..‘
శనివారం రాత్రి రాడిసన్‌ హోటల్‌లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్‌లో సోదాలు చేశారు. అయితే డ్రగ్‌ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్‌ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

వివేకానంద్, నిర్భయ్, కేదార్‌.. ముగ్గురికీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చింది. హోటల్‌లో కొకైన్‌ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్‌ కవర్లు 3, డ్రగ్‌ వినియోగానికి ఉపయోగించిన వైట్‌ పేపర్లు, మూడు సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీ డ్రగ్‌ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. 

వీఐపీలపై కేసు నమోదు 
రాడిసన్‌ హోటల్‌లోని 1200, 1204 గదుల్లో డ్రగ్‌ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్‌ ఏవియేషన్‌ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్‌ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం.  

డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా రాడిసన్‌! 
గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్‌లో కొంతకాలంగా డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్‌ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్‌ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్‌ పార్టీలలో డ్రగ్స్‌ వినియోగించవద్దని సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్‌ హోటల్‌ యధేచ్చగా డ్రగ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement