radisson hotel
-
రాడిసన్ డ్రగ్స్ కేసు: పరారీలో ఉన్న మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ‘వారి వద్ద నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో విక్రయిస్తున్నారు. హైదరబాద్‌లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయించారు. హైదరబాద్‌తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులు ఉన్నాయి. గచ్చిబౌలి, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, యాదగిరిగుట్ట పీఎస్‌లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు వెచ్చించాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్లో పనిచేస్తాడు. డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఫైజాల్‌ను పిటీ వారింట్‌పై హైదరాబాద్‌కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్‌తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారు’ అని డీసీపీ వినీత్ వెల్లడించారు. -
గజ్జల వివేకానంద గుట్టు విప్పుతున్న పోలీసులు
-
రాడిసన్ హోటల్: మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ పార్టీ కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. ఇక, ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మీర్జా వహీద్ వద్ద అబ్బాస్ తరుచుగా కొకైన్ కొనుగోలు చేస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన కొకైన్‌ను గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు అబ్బాస్ అప్పగిస్తున్నాడు. గ్రామ్ కొకైన్‌ను రూ.14వేలకు కొని గజ్జల వివేక్‌కు విక్రయించేవాడు. కొకైన్ సరఫరా చేసినందుకు గజ్జల వివేక్ వద్ద అబ్బాస్ కమీషన్ డబ్బులు తీసుకునేవాడు. సంవత్సర కాలంగా డ్రగ్స్ మత్తు పదార్థాలకు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద్ అలవాటుపడ్డాడు. ఈ కేసులో ఉన్న నిందితులంతా సంవత్సర కాలంగా రాడిసన్‌లో డ్రగ్స్ వాడుతున్నారు. ఈనెల 16, 18, 19, 24న సైతం గజ్జల వివేక్‌కు అబ్బాస్ కొకైన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు. ఇక, గజ్జల వివేక్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్స్, గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో గజ్జల వివేక్ స్నేహితులు, సహ నిందితులు దర్శకుడు క్రిష్, సెలగంసెట్టి కేదార్, నిర్భయ్ సింధి, రఘు చరణ్, సందీప్, స్వేత, లిషి, నేయిల్ సంవత్సర కాలంగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషి తదితరుల ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు.. రాడిసన్ హోటల్లో మొత్తం 200 కెమెరాలుండగా, 20 మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ పార్టీలకు ఎవరెవరు వస్తున్నారనే సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పార్టీలు నిర్వహించిన 1200, 1204 గదుల సమీపంలోని కెమెరాలు పనిచేయడం లేదని ఓ అధికారి తెలిపారు. -
Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్
గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. అయితే కొకైన్ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్ హోటల్లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్ చేసినట్లుగా అబ్బాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు. రెండురోజుల్లో క్రిష్‌ను విచారిస్తాం క్రిష్ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్‌ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్ అనే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్‌కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు. డ్రగ్‌కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్ హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్‌కు అందించాడన్నారు. వివేకానంద్ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. పరారీలో శ్వేత, సందీప్ కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్‌లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్ పార్టీలకు రెగ్యులర్‌గా ఎవరు వస్తున్నారు, డ్రగ్ సప్లయ్ చైన్ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్ పాజిటివ్‌గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్ హోటల్ మేనేజర్ డ్రగ్‌తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్ అరెస్టుతో రాడిసన్ డ్రగ్ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది. -
డ్రగ్ పార్టీ.. అరెస్ట్
గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది.హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాడిసన్ హోటల్ ఈ గ్రూప్‌దే కావడం గమనార్హం. కాగా ఇదే కేసులో నిర్భయ్, శెలగంశెట్టి కేదార్ అనే మరో ఇద్దరు ప్రముఖులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కేదార్‌కు పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో సీపీ మహంతి వివరాలు వెల్లడించారు. సొంత హోటల్లో 10 మందితో కలిసి..‘శనివారం రాత్రి రాడిసన్ హోటల్లో కొకైన్‌తో పార్టీ నిర్వహించినట్లు సమాచారం అందింది. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు హోటల్లో సోదాలు చేశారు. అయితే డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గజ్జల వివేకానంద్‌తో పాటు మరో 9 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో వివేకానంద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వివేకానంద్, నిర్భయ్, కేదార్.. ముగ్గురికీ మెడికల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మూత్ర పరీక్షలు చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. హోటల్లో కొకైన్ కోసం ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లు 3, డ్రగ్ వినియోగానికి ఉపయోగించిన వైట్ పేపర్లు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంజీరా గ్రూప్‌లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ డ్రగ్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు..’అని మహంతి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, గచ్చిబౌలి సీఐ జేమ్స్‌బాబు తదితరులు సోదాల్లో పాల్గొన్నారు. వీఐపీలపై కేసు నమోదు రాడిసన్ హోటల్లోని 1200, 1204 గదుల్లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబులు, వ్యాపారవేత్తల పిల్లలు, సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఘుచరణ్, సందీప్, క్రిష్, శ్వేత, లిషీ అనే వారిపై కూడా కేసు నమోదు అయ్యింది. కేదార్ ఏవియేషన్ కంపెనీ నిర్వాహకుడిగా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్, బఫెల్లో వింగ్స్ పబ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా రాడిసన్! గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ హోటల్లో కొంతకాలంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించినట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం రాడిసన్ హోటల్లో మేనేజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. స్టార్ హోటళ్ళు, పబ్‌లు, ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వినియోగించవద్దని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సూచనలను పట్టించుకోకుండా రాడిసన్ హోటల్ యధేచ్చగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉడ్తా షెహర్! హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న డ్రగ్స్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారుతోంది. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఆకులతో తయారు చేసే హష్ ఆయిల్ మొదలుకుని, కొకైన్, హెరాయిన్, బ్రౌన్‌షుగర్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ లాంటి ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు.. ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు.. వైద్యులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు సైతం వీటి బారిన పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిర్బంధం విధిస్తున్నా.. వాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో దాని యజమాని కుమారుడు సహా పలువురు ప్రముఖులపై కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటర్నెట్లో డార్క్ వెబ్ ద్వారా కావాల్సిన డ్రగ్‌ను ఎంచుకోవడం.. సోషల్ మీడియా యాప్ ద్వారా సరఫరాదారుడిని సంప్రదించడం.. బిట్ కాయిన్స్ రూపంలో నగదు చెల్లించడం.. డెడ్ డ్రాప్ లేదా కొరియర్ ద్వారా సరుకు తెప్పించుకోవడం..ఇలా పూర్తి వ్యవస్థీకృతంగా మాదకద్రవ్యాల దందా సాగిపోతోంది. వారాంతంలో హోటళ్లు, పబ్‌లు, రిసార్టుల్లో యథేచ్ఛగా డ్రగ్ పార్టీలు జరిగిపోతున్నాయి. దుమ్ము రేపుతున్న రేవ్ పార్టీలు ఒక్క రాడిసన్ హోటలే కాదు.. రాత్రి అయిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇందుకోసం కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా యాప్‌లు నిర్వహిస్తున్నారు. పార్టీలకు హాజరు కావాలని భావించే వారంతా వాటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. పార్టీ జరిగే ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని కూడా అక్కడి వారికి చెప్పాల్సి ఉంటుంది. పచ్చబొట్లలో డ్రగ్ గుట్టు కొందరు సొంతంగా యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం గ్రూపులు నిర్వహిస్తూ మూడో కంటికి తెలియకుండా కస్టమర్లకు రేవ్ పార్టీలపై సమాచారం అందిస్తున్నాన్నారు. పార్టీకి హాజరయ్యే కస్టమర్ చేతులపై తాత్కాలిక పచ్చబొట్లు ముద్రిస్తున్నారు. ఈ టాటూ ఆధారంగానే ఏ డ్రగ్ సరఫరా చేయాలన్నది సప్లై చేసే వారికి తెలుస్తుంది. కుడి చేయి మణికట్టు మీద టాటూ వేస్తే అతడికి గంజాయి, హష్ ఆయిల్ సరఫరా చేయాలని అర్థం. ఎడమ చేతిపై టాటూ ఉంటే కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి మాదకద్రవ్యాలు సరఫరా అవుతాయి. కొన్ని పబ్‌ల నిర్వాహకులు ‘స్పెషల్’, ‘ఆఫర్’, ‘స్కీమ్’, ‘లిమిటెడ్’పేరుతో ప్రత్యేక కోడ్ భాషను పార్టీల సందర్భంగా వాడుతున్నట్లు సమాచారం. రేవ్ తీరే వేరు అర్ధరాత్రి ప్రారంభమయ్యే రేవ్ పార్టీలు తెల్లవారే వరకు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు మద్యం, మాదకద్రవ్యాలు, మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ తప్పనిసరి. అడ్డూ అదుపు లేకుండా సాగే ఈ పార్టీల్లో హోరెత్తే మ్యూజిక్‌లో మత్తెక్కించే మద్యం, మగత పుట్టించే డ్రగ్స్‌తో రెచ్చిపోయి నాట్యం చేసే యువత.. ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ పై ‘పైట్రాన్స్’ఇమేజెస్‌గా పిలిచే ఓ రకమైన ఫొటోల్ని చూస్తుంటారు. అక్కడ సైకెడెలిక్గా పిలిచే ప్రత్యేక మ్యూజిక్ కూడా నడుస్తుంటుంది. ఇవి వారిని మరింత రెచ్చగొట్టడంతో పాటు ఉత్తేజాన్ని ఇస్తుంటాయి. ఈ రేవ్ పార్టీ తీరుతెన్నులు, అక్కడకు వచ్చే వారి వస్త్రధారణ ఫలితంగా టీనేజ్లోనే పెళ్లి కాకుండా ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’లు పెరిగిపోతుండటం ఆందోళనకర అంశమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వ్యవస్థీకృతంగా కాకుండా కొద్దిమంది స్నేహితులు కలిసి చేసుకునే రేవ్ పార్టీలకు హోటళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. దీనికోసం కనెక్టింగ్ రూమ్స్ వినియోగిస్తున్నారు. కొత్త ట్రెండ్.. డ్రగ్ టూర్స్ రాజధానిలో ఇటీవల కాలంలో డ్రగ్ టూర్స్ పెరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. టాస్‌్కఫోర్స్, ఎస్ఓటీ, హెచ్–న్యూ, టీఎస్–నాబ్ వంటి ప్రత్యేక వింగ్స్ రాజధానిలో జరుగుతున్న డ్రగ్స్ దందాపై నిఘా పెంచాయి. ఇది ఇక్కడ పెడ్లర్స్ కదలికలకు, మాదకద్రవ్యాల అందుబాటుకు కొంత సమస్యగా మారింది. మరోవైపు వీటి ఖరీదు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో డ్రగ్స్ వినియోగదారులు ప్రత్యేక టూర్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. వీకెండ్స్‌లో సిటీకి చెందిన అనేక మంది హైక్లాస్ యూత్ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల పైనా గంజాయి పంజా నగరంలో లభిస్తున్న మాదకద్రవ్యాల్లో గంజాయిది ప్రథమ స్థానం. ఒకప్పుడు కేవలం గంజాయి మొక్క ఆకుల్ని మాత్రమే ప్యాక్ చేసి సరఫరా చేసే వాళ్లు. అయితే భారీ స్థాయిలో దీన్ని సేకరించి, ప్యాక్ చేసి, వాహనాల్లో తరలించి విక్రయించడంలో రిస్క్ ఎక్కువ. దీంతో ఇటీవల కాలంలో గంజాయికి బదులుగా హష్ ఆయిల్ అక్రమ రవాణా పెరిగింది. గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు క్రీమ్ మాదిరిగా ఉండే చరస్‌ను సరఫరా చేస్తున్నారు. లీటర్ ఖరీదు అత్యంత లాభదాయకంగా రూ.లక్షల్లో ఉండటంతో పాటు రవాణా, విక్రయం, వినియోగం తేలిక కావడంతో స్మగ్లర్లు వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ హష్ ఆయిల్‌తో తయారవుతున్న చాక్లెట్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు సైతం ఇవి అందుబాటులోకి వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింథటిక్ డ్రగ్స్ కేరాఫ్ విదేశాలు సింథటిక్ డ్రగ్స్ సౌతాఫ్రికా, నైజీరియా లాంటి దేశాల నుంచి వస్తున్నాయి. సముద్ర, విమాన మార్గాల్లో వచ్చి తొలుత ముంబై, గోవాలకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉంటున్న డి్రస్టిబ్యూటర్లు వీటిని దేశ వ్యాప్తంగా ఉంటున్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి ఈ డ్రగ్స్ వినియోగదారులకు చేరుతున్నాయి. ఈ దందా కోసం పెడ్లర్స్ వివిధ రకాలైన సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారు. తమ ఐడీలను డార్క్‌వెబ్‌లోని డ్రగ్స్ ఫోరమ్స్‌లో తమ వద్ద లభించే డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ఉంచుతున్నారు. రేటు ఖరారైన తర్వాత బైనాన్స్ లేదా వజీరెక్స్ వంటి వాటి ద్వారా క్రిప్టో కరెన్సీగా మారిన నగదును స్వీకరిస్తూ కొరియర్ ద్వారా లేదా డెడ్ డ్రాప్ విధానంలో సరుకు పంపిస్తున్నారు. కొరియర్లో అయితే తమ అసలు చిరునామా రాయకుండా వస్తువులు, వ్రస్తాల మాదిరిగా ప్యాక్ చేసి లేదా కాగితాల మధ్యలో ఉంచి పంపిస్తున్నారు. ఎక్కువ సందర్భాల్లో ఎంపిక చేసిన ఓ ప్రాంతంలో డ్రగ్ పార్సిల్ ఉంచి ఆ వివరాలను మెసెంజర్ ద్వారా అందిస్తున్నారు. దీన్నే డెడ్ డ్రాప్ విధానం అంటారు. -
డిమాండ్‌ను మించి హోటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆతిథ్య రంగం ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడానికి తోడు డిమాండ్‌ను మించి హోటల్ గదులు అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణమని రాడిసన్ హోటల్ పేర్కొంది. నాలుగేళ్ళ క్రితం దేశంలో బ్రాండెడ్ హోటల్ గదుల సంఖ్య 45,000గా ఉంటే ఇప్పుడు అది 1,10,000 దాటిందని, వచ్చే ఐదేళ్ళలో ఈ సంఖ్య 1.60 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు కార్లిసన్ రెజిడర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) రాజ్ రాణా ‘సాక్షి’కి తెలిపారు. కాని దేశీయ పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్తు బాగుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోందని, ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్లిసన్ రెజిడర్ హోటల్స్ ప్రపంచవ్యాప్తంగా రాడిసన్, రాడిసన్ బ్లూ ఐదు రకాల బ్రాండెడ్ హోటల్స్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో హోటల్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. గతంలో దీన్ని ఆదిత్య సరోవర్ ప్రీమియం హోటల్‌గా వ్యవహరించేవారు. ఈ సందర్భంగా రాణా ‘సాక్షి’తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దేశీయ ఆతిథ్య రంగం ముఖ్యంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి రావడంతో కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయ హోటల్స్ సగటు ఆక్యుపెన్సీ రేషియా 60 శాతం వద్ద స్థిరంగా ఉందన్నారు. టారిఫ్‌లు, ఆక్యుపెన్సీ రేషియోలో ఇంకా ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు. కాని ఈ మధ్యనే విదేశీ నిధుల ప్రవాహంతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆశావహ వాతావరణం కనిపిస్తోందన్నారు. విశాఖలో రాడిసన్ దక్షిణ భారతదేశంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కార్ల్సన్ రెజిడర్ హోటల్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, కొచ్చి, మైసూర్ వంటి పట్టణాల్లో కొత్తగా హోటల్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66 హోటల్స్‌ను నిర్వహిస్తుండగా, 44 హోటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఏటా కొత్తగా 8-9 హోటల్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో బడ్జెట్ హోటల్స్‌కి డిమాండ్ బాగుండటంతో ఈ రంగంపై దృష్టి సారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.