డ్రగ్‌ పార్టీలో డైరెక్టర్‌ క్రిష్‌  | Director Krish In Drug Party At Radisson Hotel In Gachibowli, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

Radisson Hotel Drugs Case: డ్రగ్‌ పార్టీలో డైరెక్టర్‌ క్రిష్‌ 

Published Wed, Feb 28 2024 5:14 AM | Last Updated on Wed, Feb 28 2024 1:39 PM

Director Krish in drug party Radisson Hotel in Gachibowli - Sakshi

మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ వెల్లడి 

కొకైన్‌ తీసుకున్నాడా లేదా? తేలాల్సి ఉంది 

ఆయన్ను విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం 

పెడ్లర్‌ సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీని అరెస్టు చేశాం 

గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్‌ పార్టీలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్‌ పాల్గొన్నట్లు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ కుమార్‌ తెలిపారు. అయితే కొకైన్‌ వాడారా? లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ పార్టీ కోసం డ్రగ్‌ సరఫరా చేసిన (పెడ్లర్‌) సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీని అరెస్టు చేశామని చెప్పారు. రాడిసన్‌ హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు మాదకద్రవ్యాలు సప్లయ్‌ చేసినట్లుగా అబ్బాస్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడని వివరించారు. చాలాసార్లు డ్రగ్‌ పార్టీలు చేసుకున్నట్లు చెప్పాడని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ డీసీపీ తెలిపారు.  

రెండురోజుల్లో క్రిష్‌ను విచారిస్తాం 
క్రిష్‌ రెండురోజుల్లో విచారణకు వస్తారని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. వివేకానంద్‌ను కలిసేందుకు మాత్రమే వచ్చినట్లు క్రిష్‌ చెబుతున్నాడని, వైద్య పరీక్షలు చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేదార్, నిర్భయ్‌ అనే కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా సినిమా వాళ్లు వివేకానంద్‌కు పరిచయం అయ్యి ఉండవచ్చని తెలిపారు.

డ్రగ్‌కు బానిస కావడంతోనే తరచుగా పార్టీలు నిర్వహించి ఉండవచ్చని అన్నారు. డ్రగ్‌ హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్లు అబ్బాస్‌ చెబుతున్నాడని, అయితే ఎక్కడి నుంచి సరఫరా అయ్యిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కొకైన్‌ సరఫరా చేసిన ప్రతిసారీ రెండు నుంచి నాలుగు గ్రాములు వివేకానంద్‌కు అందించాడన్నారు. వివేకానంద్‌ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాడో త్వరలో చెబుతామని చెప్పారు. 

పరారీలో శ్వేత, సందీప్‌ 
కేసులో అనుమానితులుగా ఉన్న శ్వేత, సందీప్‌లు పరారీలో ఉండగా బెంగళూరులో ఉన్న చరణ్‌ అక్కడే విచారణకు వస్తున్నట్లు తెలిపారు. డ్రగ్‌ పార్టీ నిర్వహించిన వారితో పాటు హోటల్‌ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. హోటల్‌లో కొన్ని సీసీ కెమెరాలు పని చేయడం లేదని, శనివారం రాత్రి 12.30 గంటలకు వెళ్లే సరికే అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారని వివరించారు. డ్రగ్‌ పార్టీలకు రెగ్యులర్‌గా ఎవరు వస్తున్నారు, డ్రగ్‌ సప్లయ్‌ చైన్‌ తదితర అంశాలపై విచారణ చేపడతామన్నారు.

ఇప్పటికి పార్టీలో 10 మంది ఉన్నట్లు గుర్తించగా ముగ్గురికి డ్రగ్‌ పాజిటివ్‌గా వచ్చిందని, మిగిలిన వారిని కూడా విచారించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. శ్వేత బెంగళూరు డ్రగ్‌ కేసులో కూడా నిందితురాలిగా ఉందంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ వివరాలు సేకరిస్తామని, గతంలో రాడిసన్‌ హోటల్‌ మేనేజర్‌ డ్రగ్‌తో పట్టుబడిన కేసు వివరాలు కూడా సేకరిస్తామని అన్నారు. సయ్యద్‌ అరెస్టుతో రాడిసన్‌ డ్రగ్‌ పార్టీ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లయ్యింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement