
హైదరాబాద్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాడిసన్ హోటల్‌లో 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే కెమెరాలు మాయం చేసినట్లు తెలిసింది. కాగా డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో డైరెక్టర్ క్రిష్ ఉన్న సంగతి తెలిసిందే! ఈయన డ్రగ్స్ పార్టీ జరిగిన గదిలో అరగంట పాటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పార్టీ కోసం డ్రగ్ సరఫరా చేసిన (పెడ్లర్) సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment