
హైదరాబాద్: అధిక ఎత్తు కారణంగా విధుల నిర్వహణకు అహ్మద్ అనే కండక్టర్ ఇబ్బంది పడుతున్నాడని ఇటీవల వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు.ఏడు అడుగుల ఎత్తు ఉన్న అహ్మద్ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. బస్సు 6.4 అడుగులు ఎత్తు మాత్రమే ఉండడటంతో మెడ వంచి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి ఆర్టీసీలో వేరే బాధ్యతలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సూచించారు.
కారుణ్య నియామకం..
అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్ గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం
- మీ పొన్నం ప్రభాకర్ https://t.co/zadYYAMYhM— Ponnam Prabhakar (@Ponnam_INC) April 6, 2025