rtc conductor
-
TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి
‘‘కస్టమర్.. అంటే మీకు ప్రయాణికులు.. వారే దేవుళ్లు, జీతాలిచ్చే దేవుళ్లు’’ ‘‘అప్పట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూసే వారు. ఇప్పుడు ప్రయాణికుల కోసం బస్సులు వేచి చూస్తున్నాయి. మళ్లీ పాత పద్ధతి రావాలి.. బస్సుల కోసం ప్రయాణికులు పరుగున వచ్చేలా చేయాలి’’ ‘‘టికెట్ ఇవ్వడంతో నా పని ముగిసిందన్న భావనను దరి చేరనీయొద్దు. ప్రయాణికులకు ఆర్టీసీపరంగా ఇంకా ఏదైనా సమాచారం కావాలేమో గుర్తించి తెలియచెప్పాలి’’ ..ఇవన్నీ బస్సుల్లో రాసి ఉండే సూక్తులు/ సూచనలు కాదు.. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లకు నరనరాన జీర్ణింపజేసేందుకు సిద్ధం చేసిన మాటలు. ఈ మాటలు అధికారులు చెప్తే అంతతొందరగా ఎక్కవని, నిరంతరం ఖాతాదారులతో తలమునకలై ఉండే బ్యాంకు మేనేజర్లు, పాలసీదారులను వెతికి పట్టుకుని పాలసీలు చేయించే ఎల్ఐసీ మేనేజర్లతో చెప్పించబోతున్నారు. వెరసి కండక్టర్ తీరే మారేలా శిక్షణకు సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతుండటంతో డ్రైవర్లకు ఓ కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్లపై దృష్టి సారించింది. కొంతకాలంగా క్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోతోంది. దీంతో ఇటీవలి వరకు రోజుకు రూ.14 కోట్ల ఆదాయం ఉండగా, ఇప్పుడది రూ.11 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో.. బస్సులు మళ్లీ ప్రయాణికులతో కళకళలాడాలంటే వారిని ఆకట్టుకునేలా కండక్టర్ల ప్రవర్తన ఉండాలని ఆర్టీసీ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఇందుకోసం వారికి కార్పొరేట్ తరహాలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అది శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణాంశాలను రూపొందించిన ఆర్టీసీ, శిక్షణలో ప్రత్యేక తరగతులు తీసుకునేందుకు బ్యాంక్, ఎల్ఐసీ మేనేజర్లను గుర్తించింది. ఒక్కో అధికారికి ఒక్కో క్లాస్‌కు రూ.500 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. బ్యాంకు, ఎల్ఐసీ మేనేజర్లతో.. వీలైనన్ని సీట్లు నిండేలా చూడండి అంటూ ఇంతకాలం డిపో అధికారులు గేట్ మీటింగ్స్ పెట్టి కండక్టర్లకు చెప్పేవారు. ఈ క్రమంలోనే బస్టాపుల వద్ద కండక్టర్లు కిందకు దిగి ఊళ్లపేర్లు అరుస్తూ ప్రయాణికులు బస్సు ఎక్కేలా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తరహా మోటివేషన్ సరిపోదని ఆర్టీసీ ఎండీ భావిస్తున్నారు. దీంతో కండక్టర్లకు కూడా కార్పొరేట్ తరహా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో.. డ్రైవింగ్ నైపుణ్యం పెంచడంలో మేలైన శిక్షణ ఇస్తుందన్న పేరున్న చోలమండలం రిస్క్ సర్వీసెస్ అన్న సంస్థతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. సొంత శిక్షణ కాదని... ఖాతాదారులు, వినియోగదారులను ఆకట్టుకోవాలంటే బ్యాంకులు, ఎల్ఐసీ సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, తొలుత అయిష్టత చూపిన వారిని కూడా తమవైపు ఎలా తిప్పుకోవాలి, ఇందుకు ఆయా సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులేంటి.. తదితర వివరాలను అన్వయిస్తూ ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవాలనే కోణంలో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆయా డిపోల్లోనే నిత్యం 30 మంది కండక్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఓఆర్‌ను 75 శాతానికి చేర్చేందుకు చాలాకాలంగా ఆర్టీసీ యత్నించి విఫలమవుతోంది. దీంతో సొంత శిక్షణ బదులు కార్పొరేట్ స్టైల్‌ను అనుసరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏం చెబుతారంటే.. ► మనల్ని ఎదుటివారు ‘సర్/ మేడమ్’ అని అంటే క్షణకాలంపాటు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అందుకే ‘సర్/ మేడమ్’ అన్న పదంలో ప్రత్యేక మహత్తు ఉందంటారు మానసిక విశ్లేషకులు. ఇప్పుడు కండక్టర్లు కూడా ప్రయాణికులను సర్/మేడమ్ అంటూ సంబోధించాలని ఇందులో చెప్పనున్నారు. ►టికెట్ల జారీ పూర్తయ్యాక ప్రయాణికులకు ఆర్టీసీ పరిస్థితి వివరిస్తూ, బస్సులు ఎలా సురక్షితం, పెరిగిన ఇంధన ధరలతో వ్యక్తిగత వాహనాల వినియోగం జేబుకు భారం లాంటి విషయాలు చెప్పాలి. ఆరీ్టసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రయాణికులు, వారి సంబంధీకులకు అవగాహన కల్పించాలి. ►మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు.. ఇలాంటి వారి వద్ద ఎక్కువ లగేజీ ఉంటే.. ఎక్కేప్పుడు, దిగేప్పుడు సహకరించాలి. ► ప్రయాణికులు ఆర్టీసీకి సంబంధించి ఇతర వివరాలు అడిగినా, తదుపరి గమ్యానికి ఏ బస్కెక్కాలి, ఎక్కడ దిగాలి, బస్సు పాస్‌లు, ఒకరోజు పాస్ లాంటి వివరాలు చెప్పాలి. సమాచారం తెలియనప్పుడు ఎవరితో మాట్లాడితే తెలుస్తుందో వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలి. లేదా కనుక్కుని చెప్తానని ప్రయాణికుడి ఫోన్ నంబర్ తీసుకుని తర్వాత సమాచారమివ్వాలి. ► ఆ పూట డ్యూటీతో తన బాధ్యత ముగిసిందనే భావనలోంచి బయటికొచ్చి కండక్టర్ డ్యూటీ కూడా 24/7 అన్న భావనలోకి రావాలి. -
ఆర్టీసీ కండక్టర్ దారుణ హత్య
ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఓ ఆర్టీసీ కండక్టర్‌ను ఆమె భర్తే దాారుణంగా హత్య చేశాడు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వైరా మండలం స్టేజీ పినపాకకు చెందిన ఎక్కిరాల దేవమణి(36)కి తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బంధువు ఇనపనూరి రాంబాబుతో 2006లో వివాహమైంది. వీరికి పిల్లలు ప్రణవ్‌తేజ, అశ్విత ఉన్నారు. అయితే, వివాహమైన కొద్దికాలం నుంచే రాంబాబు మద్యానికి బానిపై తరచూ భార్యను వేధించేవాడు. ఇంతలోనే దేవమణికి ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం రావడంతో ఖమ్మం మామిళ్లగూడెంలో పిల్లలతో కలిసి ఉంటోంది. ఆ తర్వాత కూడా రాంబాబులో మార్పు రాకపోగా దేవమణిపై వేధింపులు మరింత పెరిగాయి. దీంతో ఈనెల 6వ తేదీన ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకోగా, విచారణకు కోర్టు గడువు ఇచ్చింది. కాగా, వీరి కుమారుడు ప్రణవ్ పదో తరగతి చదువుతూ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఉంటుండగా, ఆదివారం ఆయన వద్దకు వెళ్లిన దేవమణి సోమవారం నుంచి జరిగే పరీక్షలు బాగా రాయాలని చెప్పి పండ్లు, బిస్కట్లు ఇచ్చి వచ్చింది. నివాళులర్పించిన ఆర్టీసీ ఉద్యోగులు ఖమ్మం మామిళ్లగూడెం: మహిళా కండక్టర్ దేవమణి మృతిపై ఖమ్మం ఆర్టీసీ డీఎం బి.శ్రీనివాస్, సీఐ రామయ్య, ఉద్యోగులు సంతాపం తెలిపారు. డీఎం, సీఐతో పాటు ఉద్యోగులు, సంఘాల నాయకులు ఏఎస్.రావు, భాస్కర్, పాషా, గడ్డం లింగయ్య, వెంకటేశ్వర్లు, పిట్టల సుధాకర్, తోకల బాబు, పర్వీన్, మల్లికాంబ, సీతారామయ్య, గుండు మాధవరావు, లింగమూర్తి, రోశయ్య, సరిత, నాగేశ్వరావు, భాగ్యలక్ష్మి, మెరుగు రవీంద్రనాధ్, యాదగిరి, పిల్లి రమేష్, అనిత తదితరులు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. అలాగే, సంస్థ తరఫున దేవమణి అంత్యక్రియలకు రూ.20వేల నగదునుటీఐ రాయప్ప ఆమె కుటుంబీకులకు అందజేశారు. కాపు కాసి హత్య... తరచుగా దేవమణి ఉండే ఇంటి వద్దకు వచ్చి మద్యం మత్తులో రాంబాబు గొడవ చేసి ఇంటి ముందు పడుకుని వెళ్లేవాడు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి కూడా వచ్చాడు. అదే సమయాన బాత్రూం వెళ్లేందుకు దేవమణి బయటకు రాగా, ఆమెతో గొడవ పడిన రాంబాబు మొదట ఆమె చేతులు విరిచాడు. దీంతో ఆమె కేకలు వేయగా నిద్రలో ఉన్న కూతురు అశ్విత మేల్కొని అడ్డుకోబోగా గొంతు పట్టి గట్టిగా నెట్టేశాడు. ఆతర్వాత దేవమణిని ఇంట్లోకి లాక్కెళ్లిన రాంబాబు అక్కడే ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. ఆ వెంటనే రాంబాబు పారిపోగా.. అశ్విత తన తాతయ్య, అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పింది. అలాగే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్, సిబ్బంది చేరుకుని మృతదేహన్ని మార్చురీకి తరలించడంతో పాటు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తయ్యాక స్వగ్రామమైన పినపాకకు తరలించారు. కాగా, దైవమణి సోదరుడు వరంగల్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
బస్సులో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
తొర్రూరు: ఆర్టీసీ కండక్టర్ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోన్న మండల పరిధి కంటాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి(54) తొర్రూరు టీచర్స్‌కాలనీలో స్థిరపడ్డాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల మూడు రోజులు సెలవు పెట్టాడు. వాటిని రద్దు చేసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విధుల్లో చేరేందుకు డిపోకు వచ్చాడు. సెక్యూరిటీ కార్యాలయం రిజిస్టర్లో సంతకం పెట్టి బస్సులోకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులోని కడ్డీకి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు. -
స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల సంసారంలో నిప్పులు పోసుకున్నా
సాక్షి, ఖమ్మం: ‘స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల నేను ఇబ్బందులు పడ్డాను.. సాయి అమ్మను మంచిగా చూసుకో.. అమ్మ మాట విను..’అంటూ మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బింగి వెంకటేశ్వరరావు తన మృతికి కారణాలు వివరిస్తూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వరరావు మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే, మధిరలోని కొందరు ఫైనాన్సర్లతో పాటు పలువురి వద్ద నుంచి మరికొందరికి ఆయన డబ్బు అప్పు ఇప్పించాడు. అయితే, అప్పు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యాన కొంతకాలం ఆయన సొంతంగా వడ్డీ చెల్లించాడు. ఆతర్వాత చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అత్తగారిల్లయిన ఏపీలోని పెనుగంచిప్రోలు నుంచి మధిరకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోయాడు. ఈ విషయం పెనుగంచిప్రోలులో ఉన్న భార్యకు తెలియడంతో ఆమె రాత్రి చేరుకుని వచ్చి వెంకటేశ్వరరావు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈమేరకు బుధవారం ఉదయం ఆమె తన భర్త కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. వైరల్‌గా మారిన వీడియో.. వెంకటేశ్వరరావు మృతికి అనారోగ్యమే కారణమని ఆయన భార్య ఫిర్యాదు చేయగా, బుధవారం సాయంత్రానికి ఆయన తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ‘పలువురి వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇచ్చాను. ఇప్పుడు వారు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టినా.. ఇక కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించు స్వప్నా(భార్య).. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాను.. సాయి(కుమారుడు) అమ్మను మంచిగా చూసుకో’అని చెబుతూ పురుగుల మందు తాగి పడిపోయాడు. సాయంత్రానికి ఈ వీడియో వైరల్‌గా మారగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వెంకటేశ్వరరావు రికార్డ్ చేసిన వీడియోలో పలువురి పేర్లను ప్రస్తావించినప్పటికీ వారు అప్పు ఇచ్చిన వారా, తీసుకున్న వారా అనేది తెలియరావడం లేదు. -
దశాబ్దానికి దక్కిన న్యాయం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన ఓ కండక్టర్ తనకు రావాల్సిన వేతన బకాయిల కోసం దశాబ్దం కాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ కండక్టర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలను, ఇతర ఉద్యోగులు (కండక్టర్లు)తో సమానంగా అన్ని ఇంక్రిమెంట్లను కలిపి ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ తీర్పు చెప్పారు. వైకల్యం బారిన పడిన ఉద్యోగిని వదిలేయకుండా అతనికి గతంలో నిర్వహించిన పోస్టుకు సమానమైన ప్రత్యామ్నాయ పోస్టును, అదే జీతం, సర్వీసు ప్రయోజనాలతో సహా కల్పించాల్సిన బాధ్యత యజమానిగా ఆర్టీసీపై ఉందని స్పష్టంచేశారు. అధికారులు పట్టించుకోలేదు... కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన వెన్నెముకకు వైద్యులు శస్త్రచికిత్స చేసి రెండు డిస్క్‌లను తొలగించారు. వైకల్యం కారణంగా రాజేశ్వరరావును ఆర్టీసీ యాజమాన్యం 2001లో రిటైర్ చేసింది. దీంతో రాజేశ్వరరావు 2005లో డిజేబుల్డ్ కమిషనర్ వద్ద కేసు దాఖలు చేశారు. విచారణ చేసిన కమిషనర్, అంగవైకల్య చట్ట నిబంధనల ప్రకారం పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను 2006లో ఆదేశించారు. దీంతో 2007లో ఆర్టీసీ అధికారులు రాజేశ్వరరావును తిరిగి సర్వీస్‌లో చేర్చుకున్నారు. బస్‌స్టేషన్‌లో ఆయన సర్వీసులను ఉపయోగించున్నారు. తనను రిటైర్ చేసిన 2001 నుంచి 2007 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించడంతోపాటు కండక్టర్ కేడర్‌లో తనకు పే ఖరారు చేయాలని రాజేశ్వరరావు పలుమార్లు కోరారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఆయన 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ రవినాథ్ తిల్హరీ తుది విచారణ జరిపారు. ‘అంగవైకల్య చట్టంలోని సెక్షన్ 47(1) ప్రకారం సర్వీసులో ఉండగా ప్రమాదానికి గురైన ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, ర్యాంకును తగ్గించడం గానీ చేయకూడదు. ఆ ఉద్యోగి గతంలో నిర్వహించిన పోస్టుకు çసమానమైన పోస్టు లేకపోతే తగిన పోస్టు ఇచ్చేంత వరకు ఆ ఉద్యోగి కోసం సూపర్ న్యూమరరీ పోస్టు సృష్టించి అందులో కొనసాగించాలి. వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కేసులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తోంది. పిటిషనర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలు, ఇంక్రిమెంట్లతోపాటు ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీ కలిపి రెండు నెలల్లో చెల్లించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
విధి వంచితుడు..!
సాక్షి, నల్లగొండ: కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉపాధి కోసం వెళ్తే.. అతనికి శాశ్వత వైకల్యం మిగిలింది. తలరాతో.. లేక విధి వెక్కిరించిందో.. కానీ అతని కుటుంబంలో మాత్రం తీరని విషాదం నింపింది. తన పిల్లలను ఎత్తుకుని ఆడుతూ పాడుతూ వారిని లాలించాలి్సన తండ్రి ఇప్పుడు వాకర్ సాయం లేనిదే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి దాపురించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక కండక్టర్‌గా పనిచేస్తున్న అతడిని తాను డ్యూటీ చేస్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో కాలు నుజ్జునుజ్జయింది. మోకాలి కింది వరకు కాలు తొలగించారు. 23 రోజులు అతనితో పని చేయించుకున్న ఆర్టీసీ సంస్థ అతన్ని పట్టించుకున్న పాపానపోలేదు. బస్టాండ్‌లో ఘటన జరిగినా కనీసం మందలించిన వారు కూడా లేరు. దీంతో తనను ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్‌లో ఇన్చార్జ్ కలెక్టర్ ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామానికి చెందిన పురం జానయ్య. వైద్యానికి రూ.4.70 లక్షల ఖర్చు.. జానయ్య పొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం తాత్కాలిక కార్మికులు కావాలని పత్రికల్లో ప్రకటించడంతో మిర్యాలగూడ డిపోలో దరఖాస్తు చేసుకున్నాడు. కండక్టర్‌గా ఎంపికై 23 రోజుల పాటు విధులు నిర్వర్తించాడు. మిర్యాలగూడ బస్టాండ్‌లో బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తున్నాడు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో జానయ్య ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి మొదట పాదం వరకు పూర్తిగా తొలగించారు. తరువాత కూడా కాలుకు గాయాలు ఏ మాత్రం మానకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేసి మోకాలి కింది భాగం వరకు తొలగించారు. ఇలా రెండుసార్లు ఆపరేషన్ చేయడంతో రూ.4.70 లక్షల ఖర్చు అయింది. రెక్కాడితేగానీ డొక్క నిండని ఆ కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర అప్పు తెచ్చి.. వైద్యం చేయించారు. నయా పైసా ఇవ్వని ఆర్టీసీ... జానయ్య చేత 23 రోజులు పని చేయించుకుని ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నా.. ఆ సంస్థ అధికారులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. జానయ్య భార్య స్వాతి వీబీకేగా పని చేస్తే నెలకు రూ.3 వేలు మాత్రమే వస్తున్నాయి. ఆ మొత్తంతో కుటుంబ పోషణకు కూడా భారంగా మారిందని బాధితుడు కన్నీరుమన్నీరవుతున్నాడు. డిగ్రీ వరకు చదివిన తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉపాధి కల్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకున్నాడు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన పురం జానయ్య -
మరో ఆర్టీసీ కండక్టర్ మృతి
జోగిపేట(అందోల్) : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని గురువారం ఉదయం 5 గంటలకు అంబులెన్స్‌లో జోగిపేటకు తీసుకువచ్చారు. కాగా, స్థానిక ఆర్టీసీ జేఏసీ నేతలు నాగేశ్వర్ మృతదేహాన్ని నారాయణఖేడ్ డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మృతదేహాన్ని నారాయణఖేడ్ బస్‌డిపోకు ఎందుకు తీసుకువెళ్లకూడదని నిలదీశారు. అంబులెన్స్‌లోనే మృతదేహం.. ఇదిలా ఉండగా నాగేశ్వర్ మృతదేహాన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంబులెన్స్ నుంచి బయటకు తీయనీయకుండా ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయిస్తామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి కార్యదర్శి భిక్షపతి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తరఫున కార్మిక సంఘ నాయకులకు, మృతుడి భార్య సంగీతకు హమీ ఇచ్చారు. -
సురేందర్ మృతదేహానికి బీజేపీ నేతల నివాళి
-
సురేందర్ మృతదేహానికి లక్ష్మణ్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్‌గౌడ్ మృతదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నివాళులర్పించారు. సోమవారం సురేందర్ గౌడ్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేందర్‌గౌడ్ కుటుంబసభ్యులను బీజేపీ నేత లక్ష్మణ్ పరామర్శించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పోరాడి మన హక్కులు సాధించుకుందామని లక్ష్మణ్ సూచించారు. శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ మృతితో మరో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందన్నారు. -
ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం
-
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండవడిపోకు చెందిన ఏపీ 30 వై 5677 నంబరు బస్సులో కొత్తూరు నుంచి శ్రీకాకుళానికి బయలుదేరిన ప్రయాణికుడు తన బంగారు బ్రాస్లెట్(రెండు తులాలు)ను బస్సులో పోగొట్టుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ దిగిపోయాక కండక్టర్ ఒకసారి బస్సును పరిశీలించగా అందులో బ్రాస్లెట్ దొరికింది. వెంటనే బ్రాస్లెట్ను శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ నంబాళ్ళ అరుణకుమారికి అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళి తే...శ్రీకాకుళంనకు చెందిన పి.రమణ మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కొత్తూరులో బస్సు ఎక్కి శ్రీకా కుళం టికెట్ తీసుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్ చేరుకునేటప్పటికి సాయంత్రం 4.30 గంటలు అయ్యింది. బస్సు దిగే తొందరలో తన చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ బస్సులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత కండక్టర్ కె.ఎస్.చలం బస్సును పరిశీలించగా రెండు తులాల బంగారు బ్రాస్ లెట్ దొరికింది. దానిని రెండో డిపో మేనేజర్ అరుణకుమారి కి కండక్టర్ అప్పగించారు. రమణ ఇంటిదగ్గరకి వచ్చిన తర్వాత బ్రాస్లెట్ లేకపోవడంతో బస్సులో పడిపోయి ఉంటుందని భావించి డిపో మేనేజర్‌కు విషయం చెప్పారు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాత రమణకు బ్రాస్లెట్ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ టీఐ–3 కె.ఎస్.రాజు, సెక్యూరిటీ హెడ్ గార్డు ముకుందరావు, సెక్యూరిటీ గార్డు జనార్దన్ డీసీ రమేష్ తదితరులు ఉన్నారు. -
పోకిరీలకు ఆమె అంటే హడల్
రామవరప్పాడు (గన్నవరం) : ఖాకీ చొక్కాతో భుజాన క్యాష్ బ్యాగ్ తగిలించుకుని టికెట్.. టికెట్ అంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ ఓ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయ్యింది. తాను ఒక మహిళనంటూ ఏనాడు ఆధైర్య పడకుండా 20 వేలకుపైగా జనాభా కలిగిన గ్రామాన్ని సమర్థంగా పాలిస్తోంది. తన పాలన దక్షతతో అటు గ్రామ ప్రజలను.. ఇటు సీనియర్ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమే నగర శివారులోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పీకా లక్ష్మీకుమారి. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీకుమారికి చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువ. వీరిది పెద్ద కుటుంబమైనా ఆమె తల్లిదండ్రులు కష్టపడి లక్ష్మీకుమారిని చదివించారు. చదువులో ముందుండే ఆమె పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసుకుంది. మెరిట్‌పై 1998లో విజయవాడలో సిటీ సర్వీసులకు ఆర్టీసీ కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. సుమారు 15 ఏళ్లు విధులు నిర్వహించిన లక్ష్మీకుమారిని వెతుక్కుంటూ 2013లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూసుకోకుండా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. పోకిరీలకు ఆమె అంటే హడల్ లక్ష్మీకుమారి సర్పంచ్ కాకముందు కూడా తన కళ్లముందు తప్పు జరిగితే మిన్నకుండేది కాదు. ఆమె కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో బస్సులో పోకిరీలు మహిళలను వేధించడం, విద్యార్థినుల పట్ల ఈవ్‌టీజింగ్‌లకు పాల్ప డడం గమనిస్తే అందరి ముందు తగిన బుద్ధి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నాయి. భర్త చనిపోయినా అధైర్యపడకుండా.. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన లక్ష్మీకుమారి సర్పంచ్ హోదాలో ప్రజాసేవకు అంకితమయ్యారు. తన అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి తనవంతుగా పాటుపడుతున్నారు. 2016లో ఆమె భర్త నాగమల్లి కోటేశ్వరరావు ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సన్నిహితులు, బంధువులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మనోధైర్యం ఇవ్వడంతో తిరిగి గ్రామాభివృద్ధిపై దృష్టిసారించారు. ప్రధాన గ్రామంతో పాటు కాల్వ గట్టు ప్రాంతాల్లో పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రైవస్ కాలువపై డబుల్ లైన్ వంతెన ఏర్పాటుకు శంకుస్థాపన కూడా అతితర్వలో ఈమె హయాంలో జరగనుండటం విశేషం. -
బస్సులో ప్రయాణికుడిపై దాడి
-
200 మంది అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టి..
- అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ కండక్టర్ - భార్య స్నేహితురాళ్లనూ వదలని కీచకుడు - విజయవాడలో సంచలనం.. ఇద్దరి అరెస్ట్ విజయవాడ: యువతులు, మహిళలు కలుపుకొని దాదాపు 200 మందిని ఆడవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఆర్టీసీ కండక్టర్ కీచకవ్యవహారం విజయవాడలో సంచలనం రేపుతున్నది. మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి తడమటం లాంటి వికృతచేష్టలకుతోడు బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్లో ఉన్న మహిళల నెంబర్లుకు ఫోన్లుచేయడం, రోడ్లపై, పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి నరకం చూపించడం ఇతని నిత్యకృత్యం. ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కండక్టర్ పమిడిపాటి శ్రీనివాసరావును, అతని స్నేహితుడు మార్లపూడి శామ్యూల్‌ను సినీ ఫక్కీలో అరెస్టుచేశారు. విజయవాడ సిటీ లా అండ్ ఆర్డర్ డీసీపీ పాలరాజు సూర్యారావుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు వేర్వేరు ఫోన్ నెంబర్లనుండి చెప్పలేని విధంగా అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్నారని పటమట ఎన్.టీ.ఆర్.సర్కిల్ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి.. 21వ తేదీ రాత్రి గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమకందిన సమాచారం ప్రకారం 22వ తేదీన గవర్నర్‌పేట బస్ డిపో వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి నుంచి 5 సెల్ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 9 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నిందితులలో ఒకరిని పమిడిపాటి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు, అతను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో యనమలకుదురులో నివసిస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి వారిని తడమటం చేస్తుంటాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఫోన్ ద్వారా మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వికృతానందం పొందుతుంటాడన్నారు. బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్లో ఉన్న మహిళల నెంబర్లు తీసుకోవడం, రోడ్లపై పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నట్లుకూడా వెల్లడైందన్నారు. కండక్టర్ అనేక సిమ్ కార్డులు పొంది వాటి నుండి మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతుంటాడని చెప్పారు. బస్సులో తనకు పరిచయమైన సింగ్‌నగర్‌కు చెందిన మార్లపూడి శామ్యూల్‌కు ఇదే అలవాటు ఉండటంతో అతనితో కలిసి కండక్టర్ మెసేజ్‌లు పంపేవాడన్నారు. వీరిద్దరు కలిసి ఎక్కడైనా సిమ్ కార్డులు దొరికన వెంటనే వాటిని ఉపయోగించి మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి పైశాచికానందం పొందేవారని డీసీపీ చెప్పారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఏసీపీ శ్రీనివాస్, గవర్నర్‌పేట సీఐ పవన్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
ఆర్టీసీ కండక్టర్‌కు వడదెబ్బ
పెనుకొండ : పెనుకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేసే సువర్ణబాయి శనివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యారు. పెనుకొండ - కదిరి మధ్య తిరిగే బస్సులో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయమే పెనుకొండ నుంచి కదిరికి చేరుకున్న బస్సు తిరిగి పెనుకొండకు తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలోనే ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ బారిన పడి పడిపోయారు. తోటి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తరువాత అదే బస్సులో పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, సెలైన్ బాటిళ్లు ఎక్కించి చికిత్స ప్రారంభించారు. -
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
కదిరి టౌన్ : కదిరి డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ జానకీపతిరెడ్డి (47) శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందులకు వెళ్లే దారిలోని నామాల గుండు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలావున్నాయి. తలుపుల మండలం వేపమానిపేటకు చెందిన జానకీపతిరెడ్డికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదిరి పట్టణంలోని వాణీవీధిలో నివాసమున్న ఆయన మూడు మాసాల కిందట తన కుమార్తె అనుషాకు వివాహం చేశాడు. కుమారుడు నవీన్‌రెడ్డి తిరుపతిలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం డ్యూటీ లేనందున జానకీపతిరెడ్డి ఉదయాన్నే ఇంటిలో టిఫిన్ తిని బయటకు బయలుదేరాడు. మధ్యాహ్నమైనా తిరిగి రాకపోయేసరికి అతని సెల్‌కు భార్య పలుమార్లు ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆందోళన చెంది వెతకడం ప్రారంభించింది. ఈలోపు పులివెందులకు వెళ్లేదారిలోని నామాలగుండు వద్ద జానకీపతిరెడ్డి ముఖం, కాళ్లు, చేతులకు బలమైన రక్తగాయాలై కొండకింద రాళ్లమధ్య విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. జేబులోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారాలను బట్టి స్థానికులు ఈ విషయాన్ని భార్యకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన భార్య, కుటుంబ సభ్యులు పరుగున సంఘటనాస్థలికి వెళ్లారు. పులివెందుల పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎవరైనా ఇతన్ని హత్య చేశారా..? లేక కొండ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏదైనా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడా..? తెలియడం లేదు. జానకీపతిరెడ్డి మృదుస్వభావి అని, ఎవరితోనూ గొడవలు, కక్షలు లేవని కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు వారు కూడా చెబుతున్నారు. ఈయన కొంతమందికి అప్పులు ఇచ్చాడు. వారిలో ఎవరైనా డబ్బు ఎగ్గొట్టేందుకు ఏమైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
శభాష్ నీలిమ
సాక్షి, సిటీబ్యూరో: గుండెపోటుకు గురైన ఓ ప్రయాణికుడిని సత్వరమే ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ నీలిమకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె సమయస్ఫూర్తి పట్ల తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం బస్‌భవన్‌లో రూ.2 వేల నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. సికింద్రాబాద్–జియాగూడ (1జే) రూట్ బస్సుల్లో నీలిమ విధులు నిర్వహిస్తుండగా ఒక ప్రయాణికుడు హార్ట్ ఎటాక్‌తో బాధపడడం గమనించింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందేవిధంగా చొరవ చూపింది. దీంతో సదరు ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న చైర్మెన్ ఆమెను బస్‌భవన్‌లో అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు నాగరాజు, పురుషోత్తమ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
మీ సేవ ఉద్యోగిపై దాడి
నెల్లూరు(క్రైమ్): మీ సేవ ఉద్యోగిపై ఆర్టీసీ కండక్టర్ దాడి చేసి గాయపర్చిన ఘటన శోధన్నగర్లోని మీ సేవ కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన ధర్మవరపు ఉపేంద్ర ఆరేళ్లుగా శోధన్నగర్లోని మీ సేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ నరసింహరావు పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రానికి వచ్చారు. నేరుగా రావడంతో ఉపేంద్ర అతడ్ని క్యూలో రావాల్సిందిగా సూచించారు. తాను ఆర్టీసీ కండక్టర్‌నని క్యూలో రావడం కుదరదని ఉపేంద్రతో ఆయన గొడవకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో నరసింహరావు కౌంటర్ ముందున్న నంబర్ బోర్డుతో ఉపేంద్ర తలపై కొట్టారు. గాయపడిన ఉపేంద్రను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాలుగో నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి నెల్లూరు(పొగతోట): విధి నిర్వహణలో ఉన్న మీ సేవ కంప్యూటర్ ఆపరేటర్‌పై దాడి చేసిన వ్యక్తిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మీ – సేవ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సలీమ్ కోరారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగి నరసింహరావు చెక్కతో కొట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మీ సేవ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి
వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామం వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి వరంగల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని...
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): కూతురు పెళ్లికి అప్పుపుట్టలేదని మనస్తాపం చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా మంచాల రోడ్డులో నివాసముంటున్న నీళ్ల రాచకొండ(50) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూతురు వివాహం నిశ్ఛయం కావడంతో.. పెళ్లి ఖర్చుల అవసరార్థం అప్పు కోసం ప్రయత్నించాడు. కానీ ఎక్కడ ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో.. చివరకు మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటికి తాళం వేసి పరారైన భర్త
నెల్లూరు : నెల్లూరు జిల్లా మూలాపేటలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యతోపాటు తొమ్మిది నెలల చిన్నారిని బయటపెట్టి ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో బాధితురాలు ఇంటి బయట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా ఆర్టీసీలో పని చేస్తోన్న కండెక్టర్ భార్యను కాన్పు కోసం పుట్టింటికి పంపాడు. అనంతరం మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కండెక్టర్ భార్య పాపకు జన్మ నిచ్చి... తొమ్మిది నెలలు గడిచిన ... ఆమెను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురాలేదు. దాంతో ఆమె కుమార్తెతో శనివారం మూలాపేటలోని ఇంటికి వచ్చింది. అయితే కుమార్తెకు అనార్యోగంతో ఉండటంతో పాపను తీసుకుని మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లింది. అదే అదనుగా భావించిన భర్త... ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు. దాంతో అతడి భార్య ఇంటి ముందు చిన్న పాపతో నిరసనకు దిగింది. -
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కండెక్టర్ చంద్రయ్య(42) శుక్రవారం తెల్లవారుజామున ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి చంద్రయ్యను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో జహీరాబాద్ డిపో ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన డిపో వద్దకు చేరుకుని పహారా కాస్తున్నారు. -
కండక్టర్‌పై పోలీసుల దాడి
టికెట్ విషయమై కండక్టర్‌తో వాదనకు దిగడంతోపాటు దాడికి పాల్పడ్డారు కానిస్టేబుళ్లు! ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగింది. సత్తెనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మాదిపాడు నుంచి సత్తెనపల్లి వైపు వెళుతోంది. గింజపల్లి స్టేజ్ వద్ద 10 మంది స్పెషల్ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు బస్సు ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ రవికిరణ్‌కుమార్ రెడ్డి వారిని కోరాడు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, టికెట్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు. అయితే, వారంట్ చూపించాలని కండక్టర్ కోరాడు. కోపంతో ఊగిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్లు కండక్టర్‌పై దాడి చేశారు. దీంతో రవికుమార్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. బాధితుడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సత్తెనపల్లి డిపో విభాగం అధ్యక్షుడు శ్రీరాం అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.