ఇంటికి తాళం వేసి పరారైన భర్త | Wife protests at infront of her house in nellore district | Sakshi
Sakshi News home page

ఇంటికి తాళం వేసి పరారైన భర్త

Published Sun, Aug 2 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

Wife protests at infront of her house in nellore district

నెల్లూరు : నెల్లూరు జిల్లా మూలాపేటలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యతోపాటు తొమ్మిది నెలల చిన్నారిని బయటపెట్టి ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో బాధితురాలు ఇంటి బయట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...  స్థానికంగా ఆర్టీసీలో పని చేస్తోన్న కండెక్టర్ భార్యను కాన్పు కోసం పుట్టింటికి పంపాడు.

అనంతరం మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కండెక్టర్ భార్య పాపకు జన్మ నిచ్చి... తొమ్మిది నెలలు గడిచిన ... ఆమెను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురాలేదు. దాంతో ఆమె కుమార్తెతో శనివారం మూలాపేటలోని ఇంటికి వచ్చింది. అయితే కుమార్తెకు అనార్యోగంతో ఉండటంతో పాపను తీసుకుని మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లింది. అదే అదనుగా భావించిన భర్త... ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు.  దాంతో అతడి భార్య ఇంటి ముందు చిన్న పాపతో నిరసనకు దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement