కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్‌ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్‌ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.
తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్‌లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్‌ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment