Wife protests
-
నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్ ఎదుట ఎస్ భార్య నిరసన
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
భర్త ఇంటి ముందు పోరాటం
అన్నానగర్: తనతో కలిసి జీవించాలని కోరుతూ ఓ మహిళ రెండు నెలల బిడ్డతో మంగళవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. చెన్నై కొరుక్కుపేట, ఎలిల్‌నగర్ ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్ (28)కు తండయారుపేటకు చెందిన పవిత్ర (33)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన కొన్ని నెలల్లో రమేష్‌కుమార్ తండ్రి మృతి చెందాడు. భార్య తన ఇంటిలో అడుగుపెట్టడం వల్లే తన తండ్రి మృతిచెందాడని రమేష్‌కుమార్ ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలో పవిత్రని పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత తీసుకెళతానని తెలిపాడు. అయితే పవిత్రకు ఆడపిల్ల పుట్టి రెండు నెలలైనా రమేష్‌కుమార్ ఆమెను తీసుకెళ్లలేదు. ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రమేష్‌కుమార్ ఇంటి ముందు బిడ్డతో కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై తండయారుపేట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ముగ్గురిని పెళ్లాడి...మరో పెళ్లికి సిద్ధం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ఒకరికి తెలియకుండా ఒకరిని.. ముగ్గురిని పెళ్లాడాడు. మరో అమ్మాయిని కూడా పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ పెళ్లిళ్లకు పెద్దల సహకారం కూడా ఉండడంతో దర్జాగా పెళ్లాడేశాడు. నాలుగో పెళ్లికి వచ్చేసరికి విషయం తెలియడంతో తండ్రితో సహా జారుకున్నాడు. నగరంలోని ఐద్వా సంఘం సహకారంతో సదరు నిత్యపెళ్లికొడుకు ఇంటి ఎదుట ఆయన భార్యలు ధర్నాకు దిగారు. నగరంలో రాజీవ్‌నగర్(దుబ్బా)కు పవన్‌కుమార్ ఛత్రే బాగోతమిది. వివరాల్లోకి వెళ్తే.. ఈ పవన్‌కుమార్ ఛత్రే పెళ్లిళ్ల ప్రస్థానం మొదట మహారాష్ట్రలో ప్రారంభమైంది. 2010లో మహారాష్ట్రలోని టెంబర్ ప్రాంతానికి చెందిన ఐలాబాయితో జరిగింది. పెళ్లి తర్వాత నిజామాబాద్‌కు మకాం మార్చి రెండేళ్లు కాపురం చేసి అనంతరం నాందేడ్ వెళ్లిపోయారు. అనంతరం పవన్‌కుమార్ 2015లో నిర్మల్ జిల్లా గొల్లమాడ గ్రామానికి చెందిన దీపను పెళ్లి చేసుకున్న అతడు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాపురం పెట్టాడు. 2017లో విజయవాడ చెన్నూర్ గ్రామానికి చెందిన రాణిని పెండ్లి చేసుకుని, ఆమెను చెన్నూర్‌లో ఉంచాడు. ఇటీవలే కేరళకు చెందిన యువతిని నాలుగో వివాహం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. డొంక కదిలిందిలా.. అయితే ఐలాభాయిని పవన్‌కుమార్ వేధిస్తుంటే 3వ టౌన్లో ఫిర్యాదు చేసి అనంతరం విడాకుల కోసం కోర్టులో దావా వేసింది. అనంతరం అత్తగారింటికి వెళ్లగా భర్తకు మరో రెండు వివాహాలు జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుసుకుని షాక్‌కు గురైంది. తనకు జరిగిన అన్యాయంపై ఐలాభాయి ఐద్వా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లతను ఆశ్రయించింది. దీంతో ఆమె పవన్ గురించి ఆరా తీయగా, ఈ పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. దీంతో ఐలాబాయి, దీప మంగళవారం ఐద్వా ప్రతినిధులతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. బాధితులు ధర్నాకు దిగిన విషయాన్ని తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని, వివరాలు ఆరా తీశారు. కాగా, విజయవాడలో ఉంటున్న మూడవ భార్య రాణి నిజామాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్‌కుమార్, అతని తండ్రి చంద్రకాంత్ పరారీ కాగా, తల్లి పద్మావతి ఇంట్లోనే ఉంది. బాధితుల నుంచి సుమారు రూ.40లక్షల వరకు వసూలు చేశాడని, ఆ డబ్బు రాబడితే బాధితులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని సబ్బని లత పేర్కొన్నారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
హైదరాబాద్: నగరంలోని చంపాపేట్‌లో ఓ భార్య తన భర్త ఇంటి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగింది. స్థానిక మారుతీనగర్‌లో నివాసముంటున్న ట్రాన్స్‌కో ఏడీ వెంకటేశ్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఆయన భార్య మల్లేశ్వరి ఆరోపిస్తోంది. ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో ఇంట్లోని వారంతా తాళం వేసి వెళ్లిపోయారు. -
ఇంటికి తాళం వేసి పరారైన భర్త
నెల్లూరు : నెల్లూరు జిల్లా మూలాపేటలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యతోపాటు తొమ్మిది నెలల చిన్నారిని బయటపెట్టి ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో బాధితురాలు ఇంటి బయట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా ఆర్టీసీలో పని చేస్తోన్న కండెక్టర్ భార్యను కాన్పు కోసం పుట్టింటికి పంపాడు. అనంతరం మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కండెక్టర్ భార్య పాపకు జన్మ నిచ్చి... తొమ్మిది నెలలు గడిచిన ... ఆమెను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురాలేదు. దాంతో ఆమె కుమార్తెతో శనివారం మూలాపేటలోని ఇంటికి వచ్చింది. అయితే కుమార్తెకు అనార్యోగంతో ఉండటంతో పాపను తీసుకుని మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లింది. అదే అదనుగా భావించిన భర్త... ఇంటికి తాళం వేసి పరారైయ్యాడు. దాంతో అతడి భార్య ఇంటి ముందు చిన్న పాపతో నిరసనకు దిగింది.