కండక్టర్‌పై పోలీసుల దాడి | rtc conductor beaten by police men | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై పోలీసుల దాడి

Published Wed, Apr 1 2015 11:04 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

rtc conductor beaten by police men

టికెట్ విషయమై కండక్టర్‌తో వాదనకు దిగడంతోపాటు దాడికి పాల్పడ్డారు కానిస్టేబుళ్లు! ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగింది.

సత్తెనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మాదిపాడు నుంచి సత్తెనపల్లి వైపు వెళుతోంది. గింజపల్లి స్టేజ్ వద్ద 10 మంది స్పెషల్ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు బస్సు ఎక్కారు. టికెట్ తీసుకోవాలని కండక్టర్ రవికిరణ్‌కుమార్ రెడ్డి వారిని కోరాడు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, టికెట్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు. అయితే, వారంట్ చూపించాలని కండక్టర్ కోరాడు. కోపంతో ఊగిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్లు కండక్టర్‌పై దాడి చేశారు. దీంతో రవికుమార్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. బాధితుడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సత్తెనపల్లి డిపో విభాగం అధ్యక్షుడు శ్రీరాం అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement