sattenapalli
-
YSRCP టీ జెండా గద్దెలు ధ్వంసం
-
సత్తెనపల్లిలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
సత్తెనపల్లిలో సీఎం జగన్ బస్సు యాత్ర డ్రోన్ దృశ్యాలు
-
తెలుగు తమ్ముళ్లకు సత్తెనపల్లి ప్రజానీకం కౌంటర్
-
సింహపురి నుండి వచ్చిన సింహం రా..అంబటి ఊర మాస్ స్పీచ్
-
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ట్రిపుల్ మర్డర్
-
మేనిఫెస్టో అంటే జగన్.. ఉన్నది ఉన్నట్టుగా..: దేవులపల్లి అమర్
సాక్షి, సత్తెనపల్లి: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన "మేనిఫెస్టో అంటే జగన్" చర్చా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. "జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందట. కాంగ్రెస్ నినాదం గరీబీ హఠావో అమలు కాలేదు. సమాజమే దేవాలయం అన్న టీడీపీ 20 ఏళ్లు పాలించింది. అయినా రాష్ట్రంలో పేదరికం ఇంకా ఎందుకు ఉంది? జగన్ పేదవాడి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టో పెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి గెలుపు జగన్‌కే సాధ్యమైంది. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్. ప్రతీ గడపకు నాయకులు అధికారులు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కరించే వ్యవస్థను జగన్ క్రియేట్ చేసారు. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారు" రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థ ను రూపొందించిన వ్యక్తి జగన్ అని, దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదని అమర్ అన్నారు. ఒకప్పుడు సమాజంలో పత్రికలు విశ్వసనీయత కలిగి ఉన్నాయి అని, నేడు సోషల్ మీడియా ద్వారా సత్యం కనుమరుగు అవుతున్నది, వాస్తవాలు ప్రజలకు చేరడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని, ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అమర్ అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదు అని, పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుంది అని, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది కేవలం అపోహ మాత్రమే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వివిఆర్ కృష్ణంరాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక
సాక్షి, అమరావతి: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచీ యర్రం వెంకటేశ్వరరెడ్డి.. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఆయన్ను వాడుకుని వదిలేసిందని చెప్పారు. తనను ఓడించాలని కుట్ర పన్ని, కోడెల శివప్రసాద్, చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ ఆయనకు జనసేన బీఫాం ఇచ్చారన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరరెడ్డిని జనసేన కార్యక్రమాలకు పిలవకపోగా, అభాసుపాలు చేశారని తెలిపారు. ‘మనోహర్, పవన్, చంద్రబాబులు విడిపోయినట్లు నటించి, మళ్లీ కలిశారు. ఇప్పుడు మళ్లీ బేరాసారాలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలి. వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైఎస్సార్సీపీకి మరింత బలాన్నిస్తుందన్నారు. వారికి సరైన గౌరవం, సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వీరి సేవలను అన్ని విధాలా వినియోగించుకుంటామన్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు లేదని చెప్పారు. తనకు ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పేదల సంక్షేమాభివృద్ధి కోసం సీఎం పరితపిస్తుండటం చూసి, తాను వైఎస్సార్సీపీలో చేరానని పక్కాల సూరిబాబు తెలిపారు. చదవండి: త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా: ముద్రగడ -
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది?
పచ్చ పార్టీలో పల్నాటి యుద్ధం జరుగుతోందా? ఆ పార్టీ మాజీ స్పీకర్ నియోజకవర్గం పేరు చెబితే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయెందుకు? ఆ నియోజకవర్గంలో చంద్రబాబునే పట్టించుకోని నాయకులెవరు? రెండు వర్గాలకు తోడు ఇప్పుడు మూడో కృష్ణుడు తోడయ్యాడా? ఇంతకీ సత్తెనపల్లి టీడీపీలో ఏం జరుగుతోంది? పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి రాంబాబు ఘన విజయం సాధించారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని ప్రకటించలేదు. దీంతో కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మధ్య తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతి కార్యక్రమంలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకుంటున్నారు కోడెల, వైవీ వర్గీయులు. సాక్షాత్తూ చంద్రబాబు చెప్పినా ఎవరూ వినని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా ఎవరి వర్గాలతో వారు కమిటీలు కూడా వేసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ఒక దూతను నియమించారు. కానీ వచ్చిన చంద్రబాబు దూత ఈ ఇద్దరి టార్చర్ తట్టుకోలేక దండం పెట్టి పారిపోయారు. సత్తెనపల్లిలో పార్టీని గాడిలో పెడదామని చాలాసార్లు ప్రయత్నించిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికు ఆయన కూడా చేతులెత్తేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మాటకే విలువ ఇవ్వకపోగా.. రెండు వర్గాలు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ పార్టీని రోడ్డున పడేశారు. పార్టీ నాయకత్వం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లోనే విడి విడిగా రెండు వర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సత్తెనపల్లి పార్టీని ఎలా దారికి తేవాలో అర్థంకాని పరిస్థితుల్లో.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కన్నా కూడా ఇప్పుడు సత్తెనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నా తరచూ వెళ్ళి..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అటు కోడెల శివరాం, ఇటు వైవీ ఆంజనేయులు వర్గీయులకు మింగుడు పడడం లేదు. నాలుగేళ్ల నుంచి పార్టీకోసం కష్టపడుతున్నాం.. ఇప్పుడు కన్నా వచ్చి ఫోజులు కొడితే ఊరుకునేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారు. అదే సమయంలో రెండు వర్గాలు ఎక్కడా తగ్గడంలేదు. టికెట్ నేనే తెచ్చుకుంటా.. ఇక్కడ పోటీ చేసేది కూడా నేనే అని కోడెల శివరాం తేల్చిచెబుతున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు అయితే పార్టీ నాయకత్వం తనకు హామీ ఇచ్చిందని చెబుతున్నారు. రెండు వర్గాలనే దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణను తెచ్చుకుని మరో కొరివి నెత్తిన పెట్టుకున్నారు. మూడో కృష్ణుడు కన్నా రెండు పాత వర్గాలను దెబ్బ తీయడానికి తన వర్గం కేడర్‌తో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రిని కన్నా అవమానించారంటూ కోడెల శివరాం కొత్త రాగం అందుకున్నారు. మరోవైపు వైవీ ఆంజనేయులు కూడా కన్నాను దెబ్బ తీసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ ఈ మూడు ముక్కలాట వ్యవహారంతో చంద్రబాబు పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. కోడెల శివరాం మాత్రం.. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తానంటూ నాయకత్వానికే వార్నింగ్ లు ఇస్తున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేసేది మనమే అంటూ కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులకు సంకేతాలిస్తున్నారు. చంద్రబాబు స్వయంగానే ఈ విషయాన్ని చెబుతారంటూ సత్తెనపల్లిలో ప్రచారం చేయించుకుంటున్నారు. రెండు వర్గాలకు తోడుగా మరో వర్గాన్ని తెచ్చి పెట్టుకున్న చంద్రబాబు.. పల్నాటి యుద్ధాన్ని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి. మొత్తం మీద సత్తెనపల్లి నియోజకవర్గం చంద్రబాబుకు బీపీ పెంచుతోందని అక్కడి పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
చంద్రబాబు రోడ్ షోలకు జనం కరువు
-
మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు
సాక్షి, సత్తెనపల్లి: తెలుగు రాజకీయాల్లో పవన్ కామెడీ పీస్ అని ప్రజలకు అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు, మంత్రులను దూషిస్తాడు. పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. జగన్ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అని మండిపడ్డారు. 'సింగిల్‌గా వెళితే వీరమరణం అని నీకు అర్థమైంది. పిరికి సన్నాసుల్లారా మీకు దమ్ము, ధైర్యం లేదు. మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే. మీకు ఆరాటం తప్ప పోరాటమే లేదు. పవన్ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయే. తగిన ప్యాకేజీ అందితే పొత్తుకు సిద్ధమని పవన్ మరోసారి చెప్పాడు. చంద్రబాబు కోసం పెట్టిందే జనసేన పార్టీ. పవన్‌లాంటి చీడ పురుగులకు ప్రజలు ఓట్లు వేయరు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాడో మాకు తెలుసు. పవన్ వెళ్తున్న మార్గం మంచిది కాదని యువత గుర్తించాలి' అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చదవండి: (పవన్ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి: మంత్రి దాడిశెట్టి రాజా) -
టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి ఫైర్
-
ప్యాకేజీ తీసుకునే సన్యాసి రాజకీయాలు నేను చేయను : మంత్రి అంబటి రాంబాబు
-
పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యధాప్రకారం మరోసారి గందరగోళంగా మాట్లాడారు. ఆ ప్రసంగం చూస్తే.. పాపం ఆయనకు ముఖ్యమంత్రి కావాలానే ఆకాంక్ష బలంగా ఉన్నా, పరిస్థితి చూస్తే గెలవలేనేమోనన్న భయంతో ఉన్నట్లు అనిపిస్తోంది. వ్యతిరేక ఓటును చీలనివ్వనని అంటారు. మీరు బలంగా కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతారు. అధికారం కోసం లేనని కొన్నిసార్లు అంటారు. అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెబుతారు. జనసేనను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను తనకు వదలివేయమని సలహా ఇస్తారు.. ఇంతకీ ఏతావాతా ఆయనకు ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించాలన్నదే!. అంతే తప్ప, స్పష్టమైన ఎజెండా ఆయనకు లేదన్నది అడుగడుగునా తెలుస్తూనే ఉంది. సత్తెనపల్లి వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అన్ని పార్టీలను కలుపుతానని పవన్ కల్యాణ్ అన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? తెలుగుదేశం, జనసేన, బిజెపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నింటిని కలుపుతారా? అది ఎలా సాధ్యం ? ముందుగా తాను బిజెపితో పొత్తులో ఉన్నారా?లేదా?.. దాని సంగతేమిటి? మరో వైపు బిజెపికి, టిడిపికి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని ఆయన అంటారు. ఈ అమ్ముడుపోవడం గురించి ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇంతకీ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటి? అందని వర్గాలకు అధికారం అని ఇంకో పక్క చెబుతూ, టిడిపి పొత్తు పెట్టుకుని ఏ వర్గాన్ని అందలం ఎక్కించాలని అనుకుంటున్నారు. కులాల గురించి మాట్లాడను అంటూనే కాపుల ప్రస్తావనను తేవడం ద్వారా ఆయన ఏమి చెప్పదలిచారు? కాపులు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ఆ వర్గంలో బలంగా ఉన్నదని, ఇటీవలే సమావేశం అయిన కొందరు కాపు నేతలు చెప్పారు. మరి అలాంటప్పుడు.. పవన్ కళ్యాణ్ తానే సీఎం అభ్యర్దిని అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ పలానా బలహీనవర్గాల అభ్యర్ధిని ముఖ్యమంత్రిని చేస్తాం అని ఆయన అనగలరా? అసలు తెలుగుదేశంకు అత్యధిక సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకున్నాక, ఒకవేళ అధికారం వస్తే చంద్రబాబు లేదా లోకేష్ లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ కు ఉండదు కదా. అప్పుడు చంద్రబాబు, లోకేష్‌లను అణగారిన వర్గాలవారిగానే పవన్ చూస్తారా? వారికి అధికారం ఇస్తే పవన్ లక్ష్యం నెరవేరినట్లేనా? నిజానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను ఎదుర్కునే సత్తా లేకపోవడం వల్లే కదా? చంద్రబాబు కాని, పవన్ కాని ఎలా కలవాలా అని తహతహ లాడుతున్నారు. ఆ పార్టీతో కలుస్తా? ఈ పార్టీతో కలుస్తా? అందరిని కలుపుతా? అంటూ డైలాగులు చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి రానివ్వమని ఆయన చెబుతున్న తీరు.. ఉత్తితపిట్ట మాదిరిగా ఉంది. ఆదివారం నాడు మాత్రమే రావడాన్ని సమర్ధించుకుంటూ, ఒక్కరోజు వస్తేనే వైసీపీ వాళ్లు వణికిపోతున్నారట!. రోజూ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారట!. ఏమిటీ డైలాగులు. మాటలు మాత్రం కోటలు దాటుతాయన్నట్లుగా ఆయన స్పీచ్ లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసం వింటే ఆయన ఏమి చేయదలచుకున్నారో ఆయన సభకు హాజరైన వారికి గాని, టీవీలలో చూసినవారికిగాని, పత్రికలలో చదివినవారికి గాని అర్ధం అయితే ఒట్టు. తన సినిమా అభిమానులకు ఆయన ఏమి చేసినా బాగుండవచ్చు. కాని మిగిలిన ప్రజలకు ఇందులో ఏమి సబ్జెక్ట్ ఉందన్న ప్రశ్న వస్తుంది. బిజెపీ, టీడీపీ, జనసేన కూటమి 2019లో పోటీచేసి ఉంటే బాగుండని ఇప్పుడంటున్నారు. పేరుకు బిఎస్పీ, వామపక్షాలతో పొత్తు తప్ప, పరోక్షంగా టీడీపీ వారికి సాయం చేసే విధంగానే పవన్ రాజకీయం చేశారన్నది బహిరంగ రహస్యం. జనసేన అభ్యర్ధులను కూడా టీడీపీ అధినాయకత్వమే నిర్ణయించిన సంగతి జనం మర్చిపోలేదు. ఏదో చిత్తశుద్దితో రాజకీయం చేసినట్లు, వీక్లిస్టార్ మాట్లాడుతున్నారు. వైసిపి కి వ్యతిరేకంగా ఉన్న బిజెపిని, కాంగ్రెస్ ను కూడా కలపడం సాధ్యమేనా? బిజెపి, వామపక్షాలు ఉప్పు,నిప్పుగా ఉంటాయి. వాటిని కలపగలరా? అసలు బిజెపికి టిడిపితో జతకట్టడం ఇష్టం లేదు అన్న సంగతిని పవన్ కాదనగలరా? ప్రధాని మోడీ తనకు ఏమి చెప్పారో ఇంతవరకు ఎందుకు వెల్లడించలేకపోయారు? ఇలాంటి స్థితిలో ఆయన ఏమి చెప్పినా దానికి ఏమి విలువ ఉంటుంది? లేదూ.. చాలా నిర్దిష్టంగా తాను టీడీపీతో కలవబోతున్నానని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ముఖ్యమంత్రి అభ్యర్ధులు కారని, వారు తననే సీఎం అభ్యర్ధిగా అంగీకరిస్తారని పవన్ చెప్పగలిగితే, దానిని టీడీపీ ఎండార్స్ చేస్తే అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు. రౌడీయిజం తగ్గాలని అనడం బాగుంది. మరి విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు చేసిన రౌడీయిజం మాటేమిటి? మాచర్లలో వైసిపిశ్రేణులపై టీడీపీవాళ్లు ముందుగా దాడి చేసిన తర్వాత గొడవలు జరిగాయి. దానిని దాచిపుచ్చి ఈనాడు వంటి పత్రికలు మోసపూరితంగా రాస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. వీటి గురించి ప్రస్తావించలేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని బుజాన వేసుకుని ఎందుకు మోస్తున్నారు. ఎవరు రౌడీయిజం చేసినా తప్పే అని ఎందుకు అనలేకపోయారు. టీడీపీ భాషలో మాట్లాడమే కాకుండా, తనను , వైసిపి నేతలను గాడిదలని అంటే మంత్రి అంబటి రాంబాబు ఊరుకుంటారా? అందుకే చంద్రబాబును గాడిదలా మోస్తున్నది , కాపులను బానిసలుగా మార్చాలని చూస్తున్నది పవన్ కళ్యాణే అని తిప్పికొట్టారు. తన రాజకీయ వ్యూహం ఏమిటో తనకే తెలియనట్లుగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పటికైనా ఒక నిర్దిష్ట ఎజెండాతో, పొత్తులపై ఒక స్పష్టతతో రాకపోతే, ఆయనవన్నీ ఉబుసుపోక కబుర్లు అని, గాలికబుర్లు అని జనం అనుకుంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది? :::హితైషి పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పవన్ కు ఉన్నది చంద్రబాబు ఆలోచనే : మంత్రి అంబటి
-
సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. నగరంలోని ఎన్టీఆర్ భవన్లో వైవీ ఆంజనేయుల వ్యతిరేకవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్థానికులకే సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని వైవీ ఆంజనేయులు వ్యతిరేకవర్గం డిమాండ్ చేస్తోంది. చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) -
సత్తెనపల్లి టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
-
సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ పరువును నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం.. నేడు సత్తెనపల్లి వరుసగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో తెలుగుదేశం నేతలు ఘర్షణ పడ్డారు. కోడేల శివరాం, వైవీ ఆంజినేయులు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. కుర్చీలతో కూడా కొట్టుకున్నారు. దీంతో సంస్థాగత నియామకాల సమావేశం రసాభాసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజినేయుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దీంతో కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజినేయులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చదవండి: (అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు) -
ప్రేమ పెళ్లి.. భార్యపై అనుమానం.. చివరికి ఊహించని ఘటన
సత్తెనపల్లి(పల్నాడు జిల్లా): మూడుముళ్ల బంధం.. అనుమానపు కత్తులకు ముక్కలైంది. ఏడడుగుల అనుబంధం.. అపోహల అగాథంలో చిక్కి విచ్చిన్నమైంది. క్షణికావేశం.. ఓ బాలిక బంగారు భవిష్యత్తును బలిపీఠం ఎక్కించింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అతి కిరాతకంగా ఆమెను హతమార్చిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తెనపల్లి ఒకటో వార్డు అచ్చంపేట రోడ్డుకు చెందిన పసుపులేటి విజయలక్ష్మి (40), నాగరాజు దంపతులు. వీరి కులాలు వేరైనా 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా.. నాగరాజు అబ్బూరు రోడ్డులోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ముఠా పనికి వెళ్తుండగా, భార్య విజయలక్ష్మి ఇంటి వద్దే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. కొంతకాలం వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు జన్మిచారు. కుమారుడు ఐదేళ్ల వయస్సులోనే మరణించాడు. కుమార్తె మీనాక్షి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. నాగరాజుకు భార్య విజయక్ష్మిపై ఐదేళ్ళ నుంచి అనుమానం ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. విభేదాలు తారాస్థాయికి చేరడంతో గతంలో నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుమార్తెను పెట్టుకొని విజయలక్ష్మి జీవించింది. కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ కలిసి ఉండాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నాలుగునెలలుగా వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన నాగరాజు ఇంట్లో పనులు చేసుకుంటున్న భార్య తలపై ఇనుప బద్దెతో గట్టిగా మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. నాగరాజు పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్ సీఐ యు.శోభన్ బాబు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరి నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లి విజయలక్ష్మి మృతి చెంది రక్తపు మడుగులో పడి ఉండటం, తండ్రి నాగరాజు పరారీ కావడంతో అమ్మా నాకు దిక్కెవరమ్మా.. ఒక్కసారి లేమ్మా అంటూ కుమార్తె మీనాక్షి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేస్తోంది. నాగరాజు సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయినట్లు తెలిసింది. -
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు దుర్మరణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృత్యువాత పడ్డారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లికి చెందిన ఆవుల వెంకయ్య, శివలక్ష్మిల కుమారుడు ఆవుల తిరుమలరావు(17), గండికోటయ్య, ప్రభావతిల కుమారుడు గండి మహేష్‌బాబు(17), వావిలాల నగర్‌కు చెందిన శ్రీధర్, సత్యవాణిల కుమారుడు సత్యంశ్రీధర్(17) మిత్రులు. బెల్లంకొండ మండలం కందిపాడుకు వెళ్లేందుకు కంకణాలపల్లి నుంచి బైక్‌పై బయల్దేరారు. ధూళిపాళ్ల వద్ద ఆర్టీసీ బస్సును దాటేందుకు ప్రయత్నించగా.. ఎదురుగా మరో ఆర్టీసీ బస్సు రావడంతో బైక్ వేగాన్ని తగ్గించారు. కాగా, వీరిముందు ఉన్న బస్సుకు బైక్ హ్యాండిల్ తగలడంతో రోడ్డుకు కుడివైపున పడిపోయారు. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి మీదుగా వెళ్లడంతో తిరుమలరావు, సత్యంశ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన గండి మహేష్‌బాబును గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. ఆవుల తిరుమలరావు పదో తరగతి పూర్తి చేసి సిమెంటు పనులకు వెళుతుండగా, సత్యంశ్రీధర్ ఇంటర్, గండి మహేష్‌బాబు పదో తరగతి చదువుతున్నారు. మహేష్‌బాబు సోదరి మమతశ్రీకి త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కందిపాడులో నగదు ఇచ్చేందుకు మహేష్‌బాబుతో పాటు స్నేహితులు బైక్‌పై వెళుతుండగా దారుణం జరిగింది. ముగ్గురి మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
-
టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈనెల 29న(ఎల్లుండి)పార్టీ ఆవిర్భావదివ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం పడివేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. -
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి: సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయనకు ఇంతకుముందు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. చదవండి: చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు -
ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ నిర్వాకం 9 మంది ప్రాణాలకు ఎసరెట్టింది!
సత్తెనపల్లి: ఆటో డ్రైవరు సెల్‌ఫోన్ నిర్వాకం తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రి పాల్జేసింది. సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఆవుల బాలకృష్ణ కథనం మేరకు సోమవారం బెల్లంకొండ నుంచి పది మంది ప్రయాణీకుల తో సత్తెనపల్లి వస్తున్న ఆటో వెన్నాదేవి వద్దకు రాగానే ఆటోడ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. సదరు ఫోన్ మాట్లాడే క్రమంలో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌లోడు ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణీకుల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
బొమ్మ తుపాకీ అనుకున్నావా?.. నిజంగా తుపాకీనే!
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తుపాకీ కలకలం రేపింది. ఏకంగా ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను ఇంటి విషయంలో తుపాకీతో బెదిరించిన ఘటన సంచలనంగా మారింది. పట్టణానికి చెందిన వాకుమళ్ల చెంచిరెడ్డి ప్రభుత్వ నిర్మాణ పనులు చేస్తూ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో సత్తెనపల్లి మండలం కందులవారిపాలేనికి చెందిన కందుల వెంకట్రావమ్మకు పట్టణంలోని మూడు పోర్షన్ల ఇంటిని రూ.58 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం రూ.34 లక్షలు చెల్లించి మిగిలిన పైకం నెలలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని వెంకట్రావమ్మ చెప్పింది. అయితే నెలలోపు మిగతా మొత్తాన్ని చెల్లించకుండా రూ.3.20 లక్షలే చెల్లించింది. ఇల్లు శ్రీరామ్ చిట్స్‌లో తనఖాలో ఉందని, నగదు మొత్తం అనుకున్న గడువు ప్రకారం చెల్లిస్తే రుణం క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని చెంచిరెడ్డి చెప్పాడు. కానీ వెంకట్రావమ్మ నగదు చెల్లించకుండానే ఒప్పందం జరిగిన ఇంట్లో ఉంటూ మిగిలిన పోర్షన్లను అద్దెకిచ్చింది. ఇంటిని తన పేరిట రిజిష్టర్ చేయించాలంటూ ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 24న చెంచిరెడ్డి వావిలాల పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా వెంకట్రావమ్మ కుమారుడు కందుల మాధవరెడ్డి వచ్చి తుపాకీతో బెదిరించాడు. ఇంటిని తన తల్లి పేర్న రిజిస్టర్ చెయ్యకుంటే చంపుతానంటూ హెచ్చరించాడు. ఇది బొమ్మ తుపాకీ కాదని, నిజంగా తుపాకీయేనని దానిని చెంచిరెడ్డి చేతిలో పెట్టాడు. ఈ నేపథ్యంలో చెంచిరెడ్డి ఈ నెల 28న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆదివారం వెంకట్రావమ్మ ఇంట్లో సోదాలు నిర్వహించి తుపాకీని, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి, వెంకట్రావమ్మను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాధవరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు పట్టణ సీఐ విజయచంద్ర చెప్పారు. -
గుంటూరు: సత్తెనపల్లి 7వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ
-
రూ.50 కోసం గొడవ, షాపులోని గుమాస్తా మృతి
సాక్షి, సత్తెనపల్లి: యాభై రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. తమ షాపు యజమానితో వినియోగదారుడు గొడవ పడుతుండగా మధ్యలో సర్ది చెప్పటానికి వెళ్లిన గుమస్తా.. వారి దాడిలో గాయపడి చనిపోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగింది. వివరాలు.. సత్తెనపల్లిలోని పాత మార్కెట్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి మారుతి సంగం పార్లర్లో పల్లపు కోటి వీరయ్య 15 రోజుల క్రితం కొన్ని వస్తువులు తీసుకుని రూ.50 ఫోన్ పే చేశాడు. అయితే అది ఫెయిల్ కావడంతో.. రూ.50 తర్వాత ఇస్తానని వెళ్లిపోయాడు. షాపు యజమాని వైకుంఠవాసి మూడు, నాలుగుసార్లు అడిగినా వీరయ్య ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. రెండు రోజుల కిందట వీరయ్య సోదరుడు నాగేశ్వరరావు ఆ రూ.50 చెల్లించాడు. ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురైన వీరయ్య.. తన మరో సోదరుడు తిరుమలేశ్వరరావుతో కలసి బుధవారం రాత్రి 10.30 సమయంలో సంగం పార్లర్ వద్దకు వచ్చి వైకుంఠవాసి, ఆయన భార్యతో గొడవకు దిగాడు. షాపులో గుమస్తాగా పనిచేస్తున్న షేక్ బాజీ(27) సర్దిచెప్పేందుకని.. వారి మధ్యకు వెళ్లాడు. ఆ గొడవలో దెబ్బలు తగలడంతో బాజీ కింద పడి స్పృహ కోల్పోయాడు. బాజీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి చేదోడుగా ఉన్న బాజీ చిన్న వయసులోనే మృతి చెందడంతో.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ రఘుపతి తెలిపారు. -
‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్‌కుమార్ అలియాస్ సాయి కిరణ్‌కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్‌ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్‌లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ : రూ. 60 లక్షలతో ప్రారంభించి.. రూ.10 వేలకు
సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్ ఘటన మంగళవారం కలకలం సృష్టించింది. నిర్మాలా నగర్ రైల్వే గేట్ వద్ద నివాసం ఉంటున్న తుమ్మా వెంకటేశ్వర్లు, లీలావతి దంపతులకు వినయ్‌కుమార్, దేవిప్రియ సంతానం. వెంకటేశ్వర్లు వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వినయ్ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. 10 గంటల ప్రాంతంలో “మేము మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం’ అంటూ వినయ్ తాత సాంబశివరావు సెల్ నంబర్ నుంచి వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. “మేము నీ కుమారున్ని కిడ్నాప్ చేశాం. పోలీసులకు సమాచారం ఇస్తే వాడిని ముక్కలుగా నరికి అవయవాలు ఇంటికి పంపుతాం. మేం చెప్పినట్టు నువ్వు చెయ్. రూ.60 లక్షలు ఇస్తే నీ కుమారుడిని వదిలేస్తాం. లేదంటే ముక్కలుగా నరికి అవయవాలు ఒక్కొక్కటిగా మీ ఇంటికి పంపుతాం’ అంటూ విజయవాడ పటమటకు చెందిన మున్నా గ్యాంగ్ పేరుతో బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడు కనిపించడంలేదని, కిడ్నాప్ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పారు. తన తండ్రి సాంబశివరావు ఫోన్లోని సిమ్‌ను సోమవారం వినయ్ అడిగి తీసుకున్నాడని, ఆ సిమ్‌కు చెందిన నంబరు నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని వివరించారు. ఇది కిడ్నాపా? లేక బెదిరించడం కోసం ఎవరైనా ఈ పనిచేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్ టవర్ లొకేషన్ పరిశీలించగా సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్ ప్రాంతంలో చూపించింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు రెక్కీ చేపట్టారు. మంగళవారం ఉదయం సత్తెనపల్లి పట్టణంలోకి వచ్చి, పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రూ.60 లక్షలతో ప్రారంభించి.. రూ.10 వేలకు తొలుత బాలున్ని వదిలిపెట్టడానికి రూ.60 లక్షలు డిమాండ్ చేసిన అవతలి వ్యక్తులు, వెంకటేశ్వర్లు తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పడంతో రూ.10 లక్షలు, రూ.2 లక్షలు, రూ.50 వేలు ఇస్తే వదిలేస్తామని బేరమాడుతూ వచ్చారు. చివరికి రూ.10 వేలు తీసుకొచ్చి సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని వెంకటపతి కాలనీ దగ్గరకు వచ్చి అక్కడున్న ఓ కారు వద్ద డబ్బు పెడితే బాలుడిని వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లు మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన చోటకు వచ్చి కారుపై డబ్బు ఉంచి దూరంగా వేచి ఉన్నారు. సుమారు ఐదు గంటల సమయంలో పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లోంచి బాలుడిని తీసుకు వచ్చి రోడ్డుపై వదిలేసి పక్కనున్న వ్యక్తి పారిపోయాడు. బాలుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ విజయచంద్ర ఆ బాలుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాలుడి మాటలు ఇలా.. తన స్నేహితుడితో కలిసి నడిచి వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని బాలుడు తుమ్మా వినయ్ పోలీసులు విచారణలో తొలుత తెలిపాడు. ఈ నేపథ్యంలో వినయ్ చెప్పిన బాలుడిని విచారణలో భాగంగా పిలిపించగా అతను సోమవారం సత్తెనపల్లి పట్టణంలోనే లేడని తేలింది. దీంతో బాలుడు వినయ్, తల్లిదండ్రులను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. సైకిల్, టీవీఎస్ మోపెడ్ కొనిపెట్టాలని తరచూ ఇంటిలో మారం చేస్తుండేవాడని పోలీస్ విచారణలో తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తన కోర్కెలు తీర్చడం లేదని తన స్నేహితులతో కలిసి బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, వినయ్ తాత సిమ్ కాల్ డేటా సేకరించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి ఏడు బృందాలు నిర్విరామంగా కృషి చేశాయని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి విచారించామన్నారు. గంటల వ్యవధిలోనే బాలుడి కేసును ఛేదించామన్నారు. ఏం జరిగింది? ఎవరు బాలున్ని కిడ్నాప్ చేశారు? అనే వివరాలు ఇంకా తెలియలేదు, విచారణ కొనసాగుతోందన్నారు. -
భారీ వర్షం: వాగులో చిక్కుకున్నఆర్టీసీ బస్సు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెద్దవడగూరులో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పందుల వాగు పొంగి పొర్లుతోంది. భారీ నీటితో ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో వాగులో నుంచి బస్సును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. భారీ వర్షాలకు పెద్దవడగూరులో వందల ఎకరాల్లో పంటులు దెబ్బతిన్నాయి. పామిడి, పెద్దవడుగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో సాగుచేసిన పత్తి, వేరుశనగ పంట పొలాలు నీటమునిగాయి. పెద్దవడుగూరు సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెన్నాదేవి దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి-పిడుగురాళ్ల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మూడు గంటలు నడిరోడ్డుపైనే మృతదేహం
-
అమానుషం: నడిరోడ్డుపై కరోనా బాధితుడు మృతి
సాక్షి, గుంటూరు : రానురాను మానవత్వం మంటగలుస్తోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా. .ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని తాకడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుమీదకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్వాస ఆడటంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలి కన్నుమూశారు. సమీపంలో చాలామంది ఉన్నా.. కరోనా సోకుతుందేమోనని అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే ఇరుగుపొరుగు వారు బాధితుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తే కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకుతుందని భావించి ఓ ఒక్కరూ కూడా బయటకు రాలేదు. సుమారు మూడు గంటల పాటు నడిరోడ్డుపైనే మృతదేహం అలాగే ఉండిపోయింది. తరువాత సమచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని తరలించారు. -
భయంతో కింద పడిపోయాడు: ఐజీ ప్రభాకర్‌రావు
-
సత్తెనపల్లి విషాద ఘటనపై విచారణకు ఆదేశం
సాక్షి, గుంటూరు : లాక్డౌన్ నేపథ్యంలో సత్తెనపల్లిలో జరిగిన విషాద ఘటనపై గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద గౌస్ అనే యువకుడు ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించడంతో గౌస్ భయంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం వల్లే గౌస్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. బయటకు ఎందుకు వచ్చావని పోలీసులు అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పోలీసులు ఆడటంతో అతడికి చెమటలు పట్టి కిందపడిపోయాడు. వెంటనే గౌస్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నాం. ఎస్ఐ తప్పు ఉందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే గౌస్ మృతదేహానికి పోస్ట్‌మార్టం వీడియో తీయిస్తాం. పోలీసులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. పోలీసులపై ప్రత్యేకంగా ఒత్తిడేమీ లేదు.’ అని తెలిపారు. -
గుంటూరు.. పెట్రోల్ బంక్‌లో మంటలు
సాక్షి, సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి శ్యాంసుందర్ పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగాయి. ఇద్దరు వ్యక్తులు బైకులో పెట్రోలు నింపుకోవడానికి గుంటూరు రోడ్డులోని ఈ బంక్ వద్దకు వచ్చారు. బంక్ సిబ్బంది పెట్రోలు పోస్తున్నసమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేసింది. -
గుంటూరు.. పెట్రోల్ బంక్‌లో మంటలు
-
ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో..
సాక్షి, రాజుపాలెం(సత్తెనపల్లి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తొమ్మిదేళ్ల కన్న కొడుకుని ప్రియుడితో కలసి కిరాతకంగా హత్య చేసిన తల్లి ఉదంతం ఇది. తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన షేక్ జాన్వలి, సైదాబీ దంపతులకు కుమారుడు విజ్వాన్ (9), ఓ కుమార్తె ఉన్నారు. జాన్వలి కరెంటు పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకున్న భార్య సైదాబీ అదే గ్రామానికి చెందిన అవివాహితుడు వడ్లమాను శ్రీకాంత్‌రెడ్డితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజూ శ్రీకాంత్‌రెడ్డి సైదాబీ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. ఇది గమనించిన కుమారుడు తల్లిని మన ఇంటికి అతను ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించాడు. విషయాన్ని నాన్నకు చెబుతానని అన్నాడు. దీంతో భయపడిన జాన్‌బీ తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పన్నాగం పన్నింది. పథకం ప్రకారమే హత్య... తల్లి, ప్రియుడు కలసి విజ్వాన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2018 డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకునే విజ్వాన్‌ను శ్రీకాంత్‌రెడ్డి మీ అమ్మ నిన్ను తీసుకురమ్మన్నదని బైకుపై ఎక్కించుకొని బీరవల్లిపాయ అడవి సమీపంలోకి చేరాడు. అప్పటికే అక్కడ సైదాబీ వేచి ఉంది. ద్విచక్ర వాహనంపై సైదాబీని కూడా ఎక్కించుకుని దట్టమైన బీరవల్లిపాయ కొండల సమీపంలోకి తీసుకెళ్లారు. విజ్వాన్‌ను తల్లి రెండు కాళ్లు పట్టుకోగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి బాలుడి తలపై అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపారు. తరువాత మృతదేహాన్ని ఇద్దరూ కలసి ఈడ్చుకుంటూ గుట్టల్లోకి విసిరి పడేశారు. ఆ తరువాత వారిద్దరూ ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా... ఇటీవల రూరల్ ఎస్పీ జయలక్ష్మి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల రూరల్ సీఐ ఎం.రత్తయ్య, ఎస్ఐలు అనంతకృష్ణ, రాజశేఖర్‌బాబు, ట్రైనింగ్ ఎస్ఐ వెంకటరవి దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లి సైదాబీ ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రమేయం ఉందని భావించారు. తల్లిని, ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారే బాలుడిని హత్య చేశారని తేల్చారు. దీంతో నిందితులిద్దరినీ గురువారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. చదవండి : అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు -
కేసులు పెట్టింది టీడీపీ వాళ్లే
సాక్షి, గుంటూరు: కోడెలను ప్రభుత్వం వేధించిందని, వైఎస్సార్సీపీ నాయకులు కేసులు పెట్టించారని టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో సత్తెనపల్లి, నరసరావు పేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కే–ట్యాక్స్, ఉద్యోగాలిప్పిస్తామని, ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో అమాయకులను నమ్మించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారని చాలా మంది టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు, ప్రైవేట్ వ్యక్తులు ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారు. కోడెల తన కుమారుడి షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచారని అధికారులు గుర్తించాకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వాస్తవాలను టీడీపీ పెద్దలు విస్మరించి ఇష్టానుసారం మాట్లాడుతుండటం శవ రాజకీయమేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కోడెల మరణించాక రాద్ధాంతం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నాయకులు.. కోడెల, కోడెల కుమారుడు, కుమార్తెలపై వరుస కేసులు నమోదవుతున్నన్ని రోజులు పెదవి కూడా విప్పలేదు. వాటిపై స్పందిస్తే ఎక్కడ పార్టీ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయోనని భయపడ్డారు. అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ పార్టీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ కోడెల పార్టీ పరువును బజారుకీడ్చాడని వ్యాఖ్యానించారు. కోడెల తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సైతం అప్పట్లో ప్రకటించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు.. రూ.2 లక్షల ఫర్నిచర్ తీసుకెళ్తే తప్పా అని రాద్దాంతం చేస్తుండటం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కోడెలపై రెండు కేసులే.. కోడెలపై 19 కేసులు పెట్టారని, ఆయన్ను వేధింపులకు గురిచేశారని టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి కోడెలపై నమోదైంది రెండు కేసులు మాత్రమే. మిగిలిన కేసులన్నీ కోడెల కుమార్తె, కుమారుడిపై నమోదయ్యాయి. వీరు కె–ట్యాక్స్ పేరుతో సొంత పార్టీ నాయకులను సైతం దోచుకున్నారు. వారి ఆస్తులను ఆక్రమించారు. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలోని వివాదాస్పదంగా ఉన్న 17 ఎకరాల భూమిని కాజేశారు. ఈ క్రమంలో ఎంతో కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్న టీడీపీ నాయకుడు గొడుగుల సుబ్బారావుతో పాటు మరికొందరి వద్ద నుంచి ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారు. పొలంలో గొడుగుల సుబ్బారావు ఏర్పాటు చేసుకున్న గృహం, కోళ్ల ఫారాలను అర్ధరాత్రి ఖాళీ చేయాలంటూ కోడెల తనకు చెందిన గుండాల ద్వారా అప్పట్లో బెదిరించాడు. అప్పట్లో కోడెల స్పీకర్ హోదాలో ఉండటంతో ఆయన చేస్తున్న దుశ్చర్యకు కొందరు పోలీసులు అధికారులు అండగా నిలిచారు. ఆ భూమిని కోడెల వ్యక్తిగత అంగరక్షకుడు ప్రతాప్‌కు చెందిన శశి ఇన్ఫ్రా పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. గొడుగుల టీడీపీ నాయకుడే. కోడెల 2014 సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వచ్చినప్పుడు సుబ్బారావు ఇంటిని సందర్శించారు. అప్పుడు సుబ్బారావు టీడీపీ తీర్థం తీసుకోవడంతో పాటు, రూ.లక్ష పార్టీ ఫండ్ కూడా ఇచ్చాడు. ఆ విషయాన్ని మరచి, పార్టీ నాయకుడనే సానుభూతి కూడా లేకుండా కోడెల, కోడెల కుమారుడు.. సుబ్బారావు స్థలాన్ని ఆక్రమించారు. ఈ ఘటనపై సుబ్బారావు తల్లి గొడుగుల శ్రీరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఓ కాంట్రాక్టు వ్యవహారంలో తనతో కోడెల శివరామ్ రూ.5 లక్షలు తీసుకున్నాడని నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన టీడీపీ నాయకుడు వడ్లమూడి శివరామయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను గతంలో టీడీపీలో పలు పార్టీ పదవుల్లో సైతం పని చేశాడు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా పని చేస్తున్నాడు. -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో ఏ-2 నిందితుడు అజేష్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన నిందితుడు స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లు మాయం అవ్వడంతో ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డీఆర్డీఏ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు. -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజయ్ చౌదరి అరెస్ట్
-
కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు నిరసన గళం వినిపిస్తున్నారు. కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు స్వీపర్లు సోమవారం ధర్నా చేపట్టారు. కోడెల బినామీలైన విజయలక్ష్మి సహా, శ్రీనివాసరావు, సురేంద్రలు తమ పీఎఫ్ సోమ్మును కాజేశారని స్వీపర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
మలుపు తిరుగుతున్న శ్రీనివాస్ మృతి కేసు
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : ఖమ్మంలోని సీసీఎస్ పోలీసులు విచారణ పేరుతో సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ (18) అలియాస్ బన్ను అనే పాతనేరస్తుడిని ధర్డ్ డీగ్రీ పేరుతో చిత్రహింసలకు గురిచేయడంతోనే మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు గురువారం ఆరోపించిన విషయం విదితమే. అయితే ఇప్పటివరకు శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన ఆ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్య తీసుకోకపోవటంపై పలు విమర్శలు వినపడుతున్నాయి. శ్రీనివాస్ మృతిచెందిన రోజు కొంతమంది పోలీస్ సిబ్బంది దగ్గరుండి హడావుడి చేసి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించేవరకు తమపై ఒత్తిడి తెచ్చారని శ్రీనివాస్ తల్లి ఆరోపించింది. పెళ్లి కాని యువకుడు కాబట్టి తమ సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని మట్టిలో పూడ్చిపెడతామని అయితే తమపై పోలీసులు ఒత్తిడి చేసి ఖననం చేయించారని ఆమె ఆరోపించింది. శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాస్‌పై కొంతకాలంగా క్షక్ష్య కట్టాడని ఎందుకంటే శ్రీనివాస్ ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ఓ దొంగతనం కేసులో పోలీస్ అధికారులకు చెప్పటం వల్లే దానిని మనసులో పెట్టుకొని ఈవిధంగా తమ కొడుకును పొట్టన పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. వాస్తవానికి శ్రీనివాస్ దొంగతనాలు మానివేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఆ ఆటోను కూడా గతంలో మంచిగా బతకాలని ఓ సీఐ ఇప్పించారని శ్రీనివాస్ కుటంబ సభ్యులు తెలిపారు. తమపై పోలీసుల ఒత్తిడి ఉందని కూడా వారు పేర్కొన్నారు. -
రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ!
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలోని టీడీపీ నాయకుల్లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచరులు ఒక వర్గంగా, రాయపాటి రంగబాబు అనుచరులు మరో వర్గంగా చీలిపోయి ఆందోళనలు చేపడుతున్నారు. రంగబాబు ఆధ్వర్యంలోని వర్గం అన్నా క్యాంటీన్ వద్ద ధర్నాకి దిగిన కాసేపటికి.. కోడెల వర్గం ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. కాగా కే ట్యాక్స్ పేరిట కోడెల కుటుంబం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివప్రసాదరావు సహా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై పలు కేసులు నమోదైన విషయం విదితమే. -
సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి
గుంటూరు : సత్తెనపల్లి టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి టీడీపీ అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కోడెల అసమ్మతి నేతలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సమావేశమయ్యారు. కోడెల వ్యతిరేకులను ఏకతాటి మీదకు తెచ్చి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన అనుచరులతో కోడెల శివప్రసాదరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీకి చెందిన రెండు కార్యాలయాల్లో వీరి సమావేశాలు జరిగాయి. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా తొలగించేందుకు అసమ్మతి నేతలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి.. కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి రాయపాటి రంగారావు రావడం.. ఆయన కోడెల అసమ్మతి వర్గంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి కోడెల పంచాయతీ.. ‘డోంట్ వర్రీ’ అన్న బాబు! -
క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి
సత్తెనపల్లి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై సొంతపార్టీ టీడీపీలోనే అసమ్మతి ఎగసిపడింది. కోడెల కుటుంబం గత ఐదేళ్లపాటు సాగించిన అరాచకాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలే గొంతెత్తారు. ఆయన కుటుంబం అరాచకాలపై విసిగి వేసారిపోయామని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలంటూ గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. ముప్పాళ్ళ మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు తదితరుల నాయకత్వంలో అసమ్మతి వర్గీయులు బుధవారం తొలుత సత్తెనపల్లి పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద కోడెలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం 200 మందికిపైగా అసమ్మతి నాయకులు, కార్యకర్తలు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నూతన ఇన్చార్జిని నియమించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు కోడెల శివప్రసాదరావు సైతం రాష్ట్ర కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. తర్వాత చంద్రబాబు కార్యాలయం నుంచి వెళ్లిపోయే సమయంలో కాన్వాయ్ వద్ద అసమ్మతి నాయకులు ఆయన్ను కలవగా.. ‘నాకు అన్నీ తెలుసు. నేను చూసుకుంటా’ అంటూ వెళ్లిపోయారు. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని నిర్జన ప్రదేశంలో వారిని దోచుకోవడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని రూరల్ జిల్లా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు అనే వివరాలను సేకరిస్తున్నారు. నేరాలకు పాల్పడుతుందిలా... సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం గ్రామానికి చెందిన రమేష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మహిళల్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతని భార్య దుర్గ, స్నేహితులు పట్టి ఖాశీం, గోపీలతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. రాత్రిపూట సత్తెనపల్లి నుంచి సమీప గ్రామాలకు వెళ్లేందుకు వేచిఉన్న మహిళల్ని ఎంపిక చేసుకుంటారు. ఆమె వద్ద బంగారం వస్తువులు ఉన్నట్లయితే ఇక ఆటోలో ఎక్కించుకునేందుకు వారి పథకం అమలు చేస్తారు. ఆటోను రమేష్ నడుపుతూ అందులో ప్రయాణికుల మాదిరిగా దుర్గ, ఖాశీంలు ఎక్కి కూర్చుం టారు. నుంచున్న ఆమె చెప్పిన గ్రామానికి తమ ఆటో వెళుతుందని నమ్మించి ఎక్కించుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక గోపీ కూడా ఆటు వైపు వెళుతున్నట్లుగా ఆటోలో ఎక్కుతాడు. తర్వాత గ్రామ శివారుకు తీసుకువెళ్లి నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి మూకుమ్మడిగా మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం,డబ్బు దోచుకుంటారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అమరావతి నుంచి ఆటోలో గుంటూరుకు వస్తున్న నలుగురు నిందితులు ఈనెల 2వ తేదీ రాత్రి 14వ మైలు వద్ద వేచిఉన్న ఓ మహిళను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఆటోను నిలిపి ఆమె వద్ద ఉన్న 4 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.400 లాక్కొని, రమేష్ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ సమీపంలోని ఓ మిల్లు వద్దకు పరుగులు తీయడంతో వారు ఆటోలో పరారయ్యారు. ఈ మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో రమేష్ రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్బన్, రూరల్ ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీఎస్ పోలీసులతో కలసి మొత్తం ఏడు ప్రత్యేక బృందాల్ని కేటాయించారు. ఈ క్రమంలో ఈనెల 10న రమేష్, మరో ఇద్దరు యువకులు సత్తెనపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో రమేష్ మినహా మిగిలిన ఇద్దరి ప్రమేయం లేదని తేలడంతో వారిని విచారించి వదిలేసినట్లు తెలిసింది. భర్తకు దోపిడీలు, అత్యాచారాల్లో సహకరిస్తున్న దుర్గ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. రమేష్‌ను పోలీసులు వారిదైన శైలిలో విచారిస్తున్నారు. విచారణలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు ? ఫిర్యాదులు చేసేందుకు ధైర్యం చేయలేని మహిళలను ఎంతమందిని అత్యాచారం చేశారు ? జిల్లాలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. -
టీడీపీలో లుకలుకలు!
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, పార్టీ నాయకులు, కార్యకర్తలను గౌరవించకుండా కుటుంబ సభ్యులతో దోపిడీ పాలన సాగించారనే విమర్శలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి, అత్యధిక మెజార్టీతో విజయం అందించగా, టీడీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజం. అయితే పల్నాడు ముఖ ద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ టీడీపీ పద్ధతి ప్రకారం ఐదేళ్లుగా పతనమవుతూ వస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించి అత్యున్నతమైన స్పీకర్ పదవిని పొందగలిగారు. ఆ పదవిలో ఆయన మంచి పనులు చేసి ఉంటే మరొకరికి నియోజకవర్గంలో అవకాశం ఉండేది కాదనేది పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కాకుండా కుటుంబ పాలన, అవినీతి, ప్రతి పనికి వసూళ్లు చేపట్టడంతో టీడీపీని 25 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా నైరాశ్యంలో మునిగిన పార్టీ కేడర్‌లో తిరిగి ఉత్తేజాన్ని నింపడం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సమావేశంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, స్థానిక సంస్థలలో పోటీ తదితర వాటిపై చర్చిస్తామని తెలిపారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నాయకుల్లో ఎప్పటి నుంచో ఉన్న లుకలుకలు బహిర్గతం అయ్యాయి. సమావేశమైన అసమ్మతి వర్గం కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అసమ్మతి వర్గ నాయకులు గురువారం సమావేశం అయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కోడెల నాయకత్వాన్ని వ్యతిరేకించారు. శుక్రవారం నిర్వహించే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కోడెల కార్యాలయంలో ఏర్పాటు చేయడాన్ని స్థానిక టీడీపీ నాయకులు విభేదిస్తున్నారు. కోడెల జరిపే సమావేశానికి హాజరు కావద్దంటూ నాయకులు తీర్మానించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని పాత బస్టాండ్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో కోడెలకు నియోజకవర్గంలోని ఓటర్లతో గాని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో గాని సరైన సత్సంబంధాలు లేవనేది తేటతెల్లమైంది. బలం, బలగం ఉన్నా వాటిని నడిపించే సరైన నాయకుడు లేరని, ఇది టీడీపీకి ప్రధాన లోపంగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, గత ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు పడిన ఇబ్బందులుఅన్నింటిని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి నియోజకవర్గ బాధ్యతలను పార్టీకోసం శ్రమించేవారికి అప్పగించేలాచూడాలని కోరనున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఏర్పాటు చేసినసమావేశంతో టీడీపీలోని లుకలుకలపై నియోజకవర్గం అంతటా చర్చ నడుస్తుంది. -
దేవుడికీ తప్పని ‘కే ట్యాక్స్’
నరసరావుపేట ఈస్ట్ (గుంటూరు): లోక కల్యాణార్థం తలపెట్టిన మహా రుద్రాభిషేకానికీ టీడీపీ నాయకుల గ్రహణం తప్పలేదు. ప్రతి పనికి ‘కే ట్యాక్స్’ వసూలు చేస్తున్న నేతలు దేవుడినీ వదిలి పెట్టలేదు. కాసులిస్తేనే రుద్రాభిషేకానికి అనుమతి అంటూ మోకాలడ్డటంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహా రుద్రాభిషేకం వాయిదా పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియంలో శివభక్తుల ఆధ్వర్యంలో ఆదివారం మహా రుద్రాభిషేకం తలపెట్టారు. మహా శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకునేలా రుద్రాభిషేకం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకోసం రెండు నెలల నుంచి నరసరావుపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉన్నట్టుండి రుద్రాభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. కాగా.. రుద్రాభిషేకం నిర్వహించేందుకు సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియం సరైందని నిర్ణయించి, సంబంధిత కమిటీ ప్రతినిధులతో అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు కొంత రుసుం కూడా చెల్లించారు. నెలన్నర తరువాత స్టేడియం కమిటీలో కీలక వ్యక్తి రంగంలోకి దిగి ముందుగా అనుకున్న రుసుం కంటే అదనంగా చెల్లిస్తేనే కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని చెప్పటంతో నిర్వాహకులు కంగుతిన్నారు. కార్యక్రమం జరిగే ఆదివారంతో పాటు ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు స్టేడియంకు ఫీజు చెల్లించాలని చెప్పటంతో అందుకు కూడా నిర్వాహకులు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఆ మొత్తంతోపాటు మరికొంత ముట్టజెప్పనిదే కార్యక్రమం జరగనిచ్చేది లేదని కీలక వ్యక్తి అడ్డం తిరగటంతో నిర్వాహకులలో ఆందోళన మొదలైంది. సదరు వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్న కీలక నేతకు అనుంగు శిష్యుడు కావటంతో మిగిలిన నాయకులు సైతం నోరు మెదపటం లేదు. కాగా, రుద్రాభిషేకం నిర్వాహకుడు టీడీపీ నేత వేధింపులు భరించలేక అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేందుకు విరాళాలు ఇచ్చిన దాతలు మధ్యవర్తిత్వం నెరిపేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు తెలుస్తోంది. మహా రుద్రాభిషేకాన్ని తిరిగి ఎప్పుడు జరిపేది త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
స్పీకర్ కోడెల నివాసం ఎక్కడ?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసం ఎక్కడ? రాష్ట్ర రాజధాని అమరావతిలోనా? తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనా? ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలోనా? మరెక్కడైనానా? ఇదే విషయాన్ని అధికారులను అడిగితే కొందరు గుంటూరులో అని, మరికొందరు నరసరావుపేటలో కోట (కోడెల భవనాన్ని నరసరావుపేట వాసులు కోట అని అంటారు)లో అని, ఇంకొందరు సత్తెనపల్లిలో అని చెబుతున్నారు. ‘కోడెల ఎక్కువగా గుంటూరులో ఉంటూ తరచూ నరసరావుపేటలోని కోటకు, సత్తెనపల్లిలోని ఇంటికి వెళ్లి వస్తుంటారు. సెటిల్మెంట్లు ఉంటే మాత్రం కోటకే పిలిచి ‘సెటిల్’ చేస్తుంటారు. ‘మా నాయకుని కోట సెటిల్మెంట్లకూ కోటే’ అని కోడెల అనుచరులు, టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ –7లో ఇరాన్ కాన్సులేట్ సమీపంలోని ఇంటి నెంబర్ 8–2–503ను కోడెల శివప్రసాదరావు అధికారిక నివాసం, కమ్ క్యాంపు ఆఫీసుగా ప్రకటించినట్లు సాధారణ పరిపాలన శాఖ 2017, మే 4న జీవో నెంబర్ 994 జారీ చేసింది. స్పీకర్ అధికారిక నివాసం నిమిత్తం ఈ ప్రైవేటు భవనానికి ప్రతి నెలా రూ.లక్ష అద్దె చెల్లిస్తున్నట్లు ఉత్తర్వుల్లోనూ పేర్కొంది. కోడెలకే ఎరుక స్పీకర్ అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ పేరుతో కోడెల శివప్రసాదరావు ప్రతి నెలా అద్దె బిల్లు తీసుకుంటున్న చిరునామాలోని భవనంలోనే శ్రీ వెంకటేశ్వర మల్టీఫ్లెక్సెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ కార్యాలయం ఉన్నట్లు రికార్డుల్లోనూ, ఆ సంస్థ వెబ్సైట్లోనూ ఉంది. ఆ సంస్థ రిజిస్ట్రేషన్ కూడా ఇదే చిరునామాతో ఉండటం గమనార్హం. 2007 సెప్టెంబర్ 21న అన్‌లిస్టెడ్ ప్రైవేటు కంపెనీగా నమోదైంది. 2018, సెప్టెంబర్ 29న వార్షిక సర్వసభ్య సమావేశం జరిగినట్లు కూడా ఈ సంస్థ తన వెబ్సైట్ లో పేర్కొంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా వినయేందర్ గౌడ్ తూళ్ల, విజయేందర్ గౌడ్ తూళ్ల వ్యవహరిస్తున్నారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంమంత్రిగా పనిచేసిన టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ తనయులు కావడం గమనార్హం. దీంతో ఈ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర మల్టీఫ్లెక్సెస్ అద్దెకు తీసుకుందా? ఒకే భవనానికి ఇటు ఈ సంస్థ, అటు ఏపీ ప్రభుత్వం అద్దెలు చెల్లిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైతే మాత్రం తీవ్ర నేరమవుతుంది. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ఈ వ్యవహారం తమకు తెలియదని, స్పీకర్ కోడెల అధికారిక నివాసంగా దీన్ని ప్రకటించి అద్దె పొందుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందులో నిజనిజాలేమిటో కోడెల స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని ఒక సీనియర్ రాజకీయ నేత వ్యాఖ్యానించారు. -
‘కోడెల’ కోసం రూటు మారిన బైపాస్!
సత్తెనపల్లి : పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి గుంటూరు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికి మూడు సర్వేలు చేపట్టిన అధికారులు సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవి వద్ద స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యక్తిగత అంగరక్షకుని పేరుతో ఉన్న భూమిని బైపాస్ నుంచి తప్పించేందుకే ఇళ్లు, పచ్చని పంట పొలాల మీదుగా బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లి పంచాయతీ శివారు గ్రామమైన వెన్నాదేవిలో గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారి పక్కన షేడ్నెట్లు ఏర్పాటుచేసుకుని ఆకు కూరలు, కాయగూరలు, వివిధ రకాల పంటలు పండిస్తూ పలువురు రైతులు జీవిస్తున్నారు. బైపాస్ పేరుతో విలువైన మూడు పంటలు పండే సుమారు 30 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు కొలతలు వేసి పుల్లలు పాతారు. బైపాస్‌లో తమ భూములు పోతున్నాయని తెలుసుకున్న రైతులంతా శుక్రవారం తమ పంట భూముల వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరం రూ.2 కోట్ల విలువైన భూముల మీదుగా బైపాస్ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం దారుణమన్నారు. 60 మీటర్ల పొడవునా 200 మీటర్ల విలువైన పంట భూమి తీసుకుంటే ఇక మిగిలేది ఏమిటంటూ ఆవేదన చెందారు. ఈ భూమికి కొద్ది దూరంలో ప్రభుత్వ డొంక ఉందని, ఆ భూమిని సేకరించకుండా రాజకీయ కుట్ర చేస్తూ కేవలం కోడెల శివప్రసాదరావు భూములకు నష్టం జరగకుండా చూసేందుకు రైతులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. సాగర్ కాలువపై ఆధారపడకుండా బోరు బావుల ద్వారానే ఏడాదిలో మూడు పంటలను పండించుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. భూ యజమానులమైన తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా సర్వేచేసి ఉన్న పళంగా పుల్లలు పాతారని, ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకుని ప్రభుత్వ భూమిని సేకరించాలని.. లేకుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి ఉంటుందని భూయజమానులు, నివాస గృహాల యజమానులు హెచ్చరించారు. భూసేకరణ చేపట్టని ప్రభుత్వ డొంక రాజకీయ కుట్రతోనే భూసేకరణ నాకు ఇక్కడ ఐదెకరాల భూమి ఉంది. బైపాస్ కోసం చేపట్టిన భూసేకరణలో రెండెకరాలు కోల్పోతా. మాకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఏడాది పొడవునా పంటలు పండే భూముల మీదుగా రోడ్లు వేయడం రాజకీయ కుట్రే. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – గొడుగుల సుబ్బారావు, రైతు, వెన్నాదేవి సాగర్ జలాలతో పనిలేకుండా పంటలు సాగర్ కాలువల నీటితో పనిలేకుండా బావుల్లో నీటిని వినియోగించుకుని ఏడాది పొడవునా పంటలు పండించుకుంటున్నాం. కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం. బైపాస్ పేరుతో మాపై కక్ష సాధింపు చర్యలకు దిగడం తక్షణమే మానుకోవాలి. – శ్రీకాంత్, రైతు, వెన్నాదేవి డొంకను తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది 3 పంటలు పండే భూములను బైపాస్ కింద తీసుకుంటే ఆధారం కోల్పోతాం. మా భూమిని కౌలుకిస్తే ఏడాదికి రూ.50వేలు ఇస్తారు. అంతటి విలువైన భూములను రోడ్డు పేరుతో తీసుకోవటం దారుణం. వృథాగా ఉన్న ప్రభుత్వ డొంకను తీసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది. – సాంబశివరావు, రైతు, వెన్నాదేవి జీవనాధారం కోల్పోతాం షేడ్‌నెట్‌లో మిరప మొక్కల పెంపకం చేపడతాను. నాకు 4.70 ఎకరాల భూమి ఉంది. దీనిలో 0.70 ఎకరాలు బైపాస్ పేరుతో కొలతలు వేసి పుల్లలు పాతారు. ఈ భూమిని రోడ్డు కింద తీసుకుంటే జీవనాధారం కోల్పోతాం. ప్రభుత్వ భూమి వినియోగించుకుని మాకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – తోటకూర అనిల్‌కుమార్, రైతు, వెన్నాదేవి -
కోడెల అరాచకం.. వెలుగులోకి వీడియోలు!
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ సందర్భంగా తాను పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన కోడెల శివప్రసాదరావు.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరంచడమే కాకుండా.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి వేసుకొని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ రోజున ఇనుమెట్ల పోలింగ్ బూత్‌లో ఏం జరిగింది? కోడెల ఎలా అరాచకంగా ప్రవర్తించారో తెలియజేస్తూ.. తాజాగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే కాకుండా.. అక్కడి వైఎస్సార్సీపీ ఏజంట్లను కోడెల వేలు చూపిస్తూ బెదిరించడం.. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో ప్రవేశించిన కోడెల వైఎస్సార్సీపీ ఏజెంట్లు, పోలింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో కోడెల గన్‌మెన్ ఏకంగా పోలింగ్ కేంద్రం తలుపులు మూసివేశాడు. దాదాపు గంటపాటు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు వేసుకోవడంతో ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగుచూసిన వీడియోల సాక్షిగా కోడెల అరాచకం బయటపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. పోలింగ్ జరుగుతున్న సమయంలో కోడెల రాజుపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో 160 నెంబర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓటర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. స్వయంగా ఒక అభ్యర్థి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులేసుకొని ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల.. సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. ఈ క్రమంలో కోడెలపై దాడి పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. చదవండి: కోడెల సహా 22 మందిపై కేసు నమోదు -
పోలింగ్ బూత్‌లో కోడెల శివప్రసాదరావు అరాచకాల వీడియో
-
సత్తెనపల్లి ప్రచార సభలో వైఎస్ జగన్
-
ఎల్లో మీడియా.. ఎందుకంత ప్రేమ : వైఎస్ జగన్
సాక్షి, సత్తెనపల్లి (గుంటూరు) : ‘ఎల్లో మీడియా నడుపుతున్న పత్రికా అధినేతలు.. జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబంటే మీకెందుకంత ప్రేమ? రైతురుణాలను మాఫీ చేస్తానని తొలి సంతకం చేసి.. ఈ ఐదేళ్లలో వారిని దారుణంగా మోసం చేసిన ఈ వ్యక్తంటే ఎందుకంత ప్రేమ? డ్వాక్రా రుణాలు మాఫీ చేయని ఈ వ్యక్తి మీద ఎందుకంత ప్రేమ? జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. జాబు రాకుంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఇంటికి రూ. లక్షా 60 వేలు ఎగ్గొట్టాడు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకులను వలస బాట పట్టించాడు. ప్రత్యేక హోదాను భ్రష్టుపట్టించాడు.. ఇలాంటి వ్యక్తి మీద ఎందుకింత ప్రేమ? అక్షరాల 650 హామీలను నేరవేర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేసిన ఈ వ్యక్తిపై ఎందుకింత ప్రేమ? రాజధాని, విశాఖ, దళితుల భూములు, ఇసుక, బొగ్గు ఏది వదలకుండా దోచుకున్న చంద్రబాబంటే ఎందుకింత ప్రేమ?’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ప్రతి రోజు ఓ పుకారు పుట్టించి ఈ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని, ఈ ఎల్లోమీడియా మాయలో పడొద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ఎక్కడా లేని కోడెల ట్యాక్స్.. రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశానని గర్వంగా చెబుతున్నా. ఆ పాదయాత్ర ఇదే సత్తెనపల్లి మీదుగా కూడా సాగింది. ఆ పాదయాత్రలో గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన రైతన్న మాట గుర్తుకుంది. కోడెల అవినీతి గురించి చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఉందని, కానీ సత్తేనపల్లి, నరసరావుపేటలో మాత్రం ఎక్కడా లేని విధంగా కేఎస్టీ కూడా ఉందని, కోడెల సర్వీస్ ట్యాక్స్ అంటూ మీరు చెప్పిన మాటలు మరిచిపోలేదు. అపార్ట్మెంట్ కట్టాలన్నా.. వ్యాపారం చేయలన్నా.. మాముళ్లు ఇయ్యాల్సిందేనని మీరు చెప్పిన ఆ మాటలు ఇంకా గుర్తుకున్నాయి. కోడెల విత్తన కంపెనీ నాసిరకం విత్తనాలు తయారు చేస్తుందని.. కానీ ప్రభుత్వం మాత్రం రైతులు కొనేలా ఉత్తర్వులు జారీచేస్తుందని మీరన్న మాటలు మర్చిపోలేదు. ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన కోడెల.. స్పీకర్ పదవి చేపట్టి ఆ పదవిని భ్రష్టు పట్టించారు. బాబూ.. ఆ నవ్వు అందుకే.. చంద్రబాబు పాలనలో మోసం తప్పా మరేదైనా చూశామా? తాను ఎక్కడికి వెళ్లినా.. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల్లో చిరునవ్వు కనిపిస్తుందని ఈ మధ్య చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. నిజమే చంద్రబాబు.. చిరునవ్వు కనిపించింది వాస్తవమే.. కానీ అది నీ పాలనను చూసి కాదు.. మరో వారంలో నీ ప్రభుత్వం దిగిపోతుందనే ఆనందం అది. ఐదేళ్ల చంద్రబాబు దుష్టపాలనను గుర్తుచేసుకుని బాబును దించబోతున్నామని.. నిరుద్యోగులు.. వ్యాపారులు, కార్మికుల, రైతులు, ఉద్యోగుల ముఖంలో ఆనందం కనిపిస్తోంది. కానీ కొందరి ముఖాల్లో మాత్రం భయం కనిపిస్తోంది. రోజుకు నాలుగు దుష్ర్పచారాలు చేసినా కూడా జనాలు నమ్మడం లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ట, చంద్రబాబు ముఖాల్లో భయం కనిపిస్తోంది. ఛీకొట్టి ఉమ్మేసినా.. చంద్రబాబుకు అధికారం వచ్చేస్తుందని, లోక్‌నీతి-సీఎస్డీ సర్వేనని ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్‌గా ప్రచురించింది. అలాంటి సర్వే తాము చేయలేదని అదే లోక్‌నీతి సీఎస్డీ సంస్థ చీకొట్టి రాధాకృష్ణ ముఖంపై ఉమ్మేసింది. అయినా తుడుచుకుని సిగ్గులేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఓ గర్భిణిపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారంటూ ఓ అసత్య కథనాన్ని ప్రచురించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అసలు ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని అక్కడి పోలీసులు చెప్పినా కూడా సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9, అమ్ముడుపోయిన ఎల్లో మీడియా చానళ్లు.. బంగారం కన్నాబొగ్గే అందంగా ఉంటుందని, నెమలి కంటే కాకియే అందంగా ఉందని, ప్రపంచంలో అందరికంటే అందగాడు.. పరిపాలన యోగ్యుడు చంద్రబాబేనని నమ్మిస్తారు. ఈనాడు రోజు నాలుగు పేపర్లు రాస్తుంది. కాకి పిల్ల కాకికే ముద్దన్నట్లు వార్తా కథనాలను వడ్డిస్తోంది. ఇటువంటి పేపర్లు, చానళ్లు మళ్లీ నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఇంత కన్నా సిగ్గుమాలిన పని ఉంటుందా? జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా? మీ ప్రయోజనమా? లేక ప్రజల ప్రయోజనమా? జరగని సంఘటనలను.. చంద్రబాబు చేయించిన పనులను కూడా మాపై నెట్టేసి జర్నలిజాన్ని తూట్లు పొడిచే మీరు మనష్యులేనా? నిజాలకు పాతర వేస్తూ.. ఎస్సీల్లో పుట్టాలా? అన్న చంద్రబాబు వ్యాఖ్యలు బాగుంటే.. వనజాక్షిపై దాడి, రాజధాని భూకుంభకోణం, ఓటుకు కోట్లకు అడ్డంగా దొరికినా.. ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టినా ఏ ఒక్కరోజైనా ఈ ప్రతికలు రాసాయా? ఈ చానళ్లు చూపించాయా? చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే ఎక్కడ డిపాజిట్లు రావోనని, ప్రతి రోజు ఓ పుకారు పుట్టించి అసత్యప్రచారానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి చానళ్ల గురించి ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. అన్న ఉన్నాడని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
వైఎస్ఆర్సీపీ తరుపున అంబటి సతీమణి ప్రచారం
-
అసెంబ్లీ స్పీకర్‌ను నిలదీసిన మహిళలు..!
సాక్షి, ముప్పాళ్ళ (సత్తెనపల్లి): ‘గత ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశాం. మాకు ఏం చేశారు. నలభై ఇళ్లు కట్టామన్నారు. కాలనీలో ఇంకా పూరిగుడిసెలే ఉన్నాయి.. మాకు కనీసం లోన్లు కూడా ఇవ్వకుండా అవతలి వాళ్లకు ఇచ్చారు. ఈ సారి మీకు ఓటెయ్యం.. ఎలా గెలుస్తావో చూస్తాం’ అంటూ ఎస్సీ కాలనీ వాసులు స్పీకర్ కోడెల శివప్రసాదరావును నిలదీశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో స్పీకర్ కోడెల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ కాలనీలో చాలా అభివృద్ధి చేశాం. రోడ్లు వేశాం. అందరికీ పింఛన్లు ఇచ్చాం’ అని చెబుతుండగా ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు మీ సొమ్మేం కాదు కదా? ప్రభుత్వం ఇచ్చిన సొమ్మే కదా? అని నిలదీశారు. మీ సొమ్ము ఇచ్చినట్టు ఎలా చెబుతారు. మీకెందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. చేసేదిలేక కోడెల, టీడీపీ నాయకులు ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. జరిగినవి మర్చిపోండి.. మీకు పట్టాలు ఇప్పిస్తా ‘మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాను. నన్ను నమ్మండి. మళ్లీ నాకు మద్దతివ్వండి’ అంటూ కోడెల శివప్రసాదరావు ఎస్టీ కాలనీ వాసులను కోరారు. ప్రచారంలో భాగంగా గోళ్లపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీవాసులతో ఇళ్లస్థలాల సమస్యపై ఆయన మాట్లాడారు. ఎన్నికలు పూర్తి కాగానే అందరికీ ఇళ్ల పట్టాలిప్పిస్తామని చెప్పారు. కొంకావారిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులతోనూ కోడెల సమావేశమయ్యారు. ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి.. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఫైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాటేటి రవిచంద్రకుమార్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ సూర్య ప్రకాష్‌కు సత్తెనపల్లికి చెందిన బీవీ విఘ్నేశ్వర స్వామి మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో ఈ నెల 22న టీడీపీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు నామినేషన్ ఊరేగింపు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన మాటేటి రవిచంద్రకుమార్ పాల్గొన్నాడని పేర్కొన్నారు. దీనిపై విచారించి ప్రభుత్వ ఉద్యోగి మాటేటి రవిచంద్రకుమార్పై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముప్పాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామంలో చేపట్టిన టీడీపీ ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారని తెలిపారు. ఫిర్యాదుతో పాటు రవిచంద్రకుమార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లుగా ఫోటో కాపీలను జతపరిచి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఇలా ప్రభుత్వ అధికారులు విధులకు హాజరుకాకుండా అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలకు వెళ్తూ ప్రతి నెలా వేతనం తీసుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి రవిచంద్రకుమార్ (వృత్తంలో) -
కాక రేపుతోన్న కోడెల వ్యతిరేకవర్గం
గుంటూరు: సత్తెనపల్లిలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు వ్యతిరేక వర్గం కాక రేపుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన పీడ పోవాలంటూ టీడీపీ కార్యకర్తలు పసుపునీటితో శుద్ధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లు ఊడుస్తూ పసుపు నీళ్లు చల్లి కోడెల మాకొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. గోబ్యాక్ కోడెల, కోడెల డౌన్ డౌన్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సీటు తన కుమారుడికి ఇప్పించుకోవాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు నుంచి సత్తెనపల్లి అసెంబ్లీ, నరసరావుపేట ఎంపీ సీట్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో రాయపాటి సాంబశివరావు అగ్గిమీద గుగ్గిలం అవుతోన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు రాయపాటి సాంబశివరావు అడగటం భావ్యం కాదని ఆయన సీటు ఏదో ఆయన చూసుకోవాలి గానీ తన సీటు అడగటం ఏంటని కోడెల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కుక్కనైనా నిలబెట్టండి.. కోడెల మాత్రం వద్దు
-
కుక్కనైనా నిలబెట్టండి.. కోడెల మాత్రం వద్దు
సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి: ‘‘ఐదేళ్ల నుంచి ఇదే బతుకు. తోపుడు బండి నుంచి పరిశ్రమల వరకూ ప్రతి దానికీ ‘కె’ ట్యాక్స్ వేస్తున్నారు. ఈ అక్రమ ట్యాక్స్‌లు కట్టడం మా వల్ల కాదు. కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో మా పరిస్థితి దారుణంగా మారింది. కుక్కను నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తాం గానీ కోడెలకు మాత్రం ఓటేయలేం’’ అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు. సత్తెనపల్లి టికెట్ కోడెలకు ఇవ్వొద్దంటూ పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు బుధవారం ఆందోళనకు దిగారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత గోగినేని కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు పెద్దింటి వెంకటేశ్వర్లు, కోమటినేని శ్రీనివాసరావు, సంగం డెయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు తదితరులు ఈ నిరసనలో పాల్గొని కోడెల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొంత పార్టీ వారని కూడా చూడలేదు.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల గెలుపొందినప్పటి నుంచి ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి నియోజకవర్గంలో ఎవరినీ వదలకుండా ‘కె’ ట్యాక్స్ వసూలు చేశారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారని కూడా చూడకుండా లంచాలు వసూలు చేశారని మండిపడ్డారు. కోడెల కుటుంబం తీరుతో ఈ ఐదేళ్లలో బాగా విసిగిపోయాం. మళ్లీ వారికే సత్తెనపల్లి టికెట్ ఇస్తే నియోజకవర్గంలో ఎవరినీ బతకనీయరని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల కొడుకు, కుమార్తె ఇద్దరూ కలిసి నరసరావుపేట, సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలను తమ గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు, దౌర్జన్యకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఇంకా కోడెలకు ఎక్కడా సీటు ఖరారు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కోడెలకు మళ్లీ సత్తెనపల్లి టికెట్ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తుండటంతో.. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలంతా రోడ్డెక్కారు. కుక్కనైనా నిలబెట్టండి గానీ.. కోడెల వద్దని స్పష్టం చేస్తున్నారు. బుజ్జగింపులూ ఫలించ లేదు.. టీడీపీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న నాయకులను బుజ్జగించడానికి కోడెల శివప్రసాదరావు.. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ఏఎంసీ చైర్మన్ సయ్యద్ పెదకరీముల్లా, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు, సత్తెనపల్లి టీడీపీ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి, న్యాయవాది రాజు తదితరులను పంపారు. అయినా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గలేదు. కోడెలకు మద్దతుగా వచ్చిన నాయకులను దూషించి వెనక్కి పంపించేశారు. బుధవారం రాత్రి సైతం ‘క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి’ అంటూ టీడీపీ కార్యాలయంపై క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలియజేశారు. అంబటి గెలుపు ఖాయం.. తమ మాట కాదని కోడెలకు టికెట్ ఇస్తే ఆయన ఓటమిపాలవ్వడం ఖాయమని.. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు 20 వేల మెజారిటీతో గెలుపొంది తీరుతారని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని కార్యకర్తల మనోభావాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. మరోవైపు తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు చేస్తున్న నిరసనలు ప్రసారం కాకుండా నియోజకవర్గంలో కేబుల్ టీవీ ప్రసారాలను కోడెల నిలిపివేయించారు. -
పార్టీకి కొమ్ముకాస్తే ఇదేనా మర్యాద!
సాక్షి, అమరావతి: శాసనసభాపతి స్థానంలో ఉండి అనేక అంశాల్లో రాజ్యాంగబద్ధంగా చేపట్టాల్సిన చర్యలు తీసుకోకుండా పార్టీకి మేలు చేస్తే చివరకు మా నాయకుడికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్గీయులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కోడెలకు టిక్కెట్ విషయంలో ఎటూ తేల్చకుండా సందిగ్ధంలో పడేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు వేర్వేరు ప్రతిపాదనలను తెరపైకి తెస్తుండడంతో స్పీకర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ నేతకు పార్టీ టిక్కెట్ వస్తుందో రాదోనని స్పీకర్ అనుచరవర్గం ఆందోళన చెందుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఆయన గతంలో ఏ సభాపతి వ్యవహరించని రీతిలో పలు వివాదాస్పద నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివాదాస్పద స్పీకర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఒక స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా ఉండాల్సిన కోడెల తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగానే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే సభను నడిపించారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి, రూ.కోట్ల కొద్దీ డబ్బులు వెదజల్లి తమ పార్టీలోకి ఫిరాయించేలా చేసినా స్పీకర్ పట్టించుకోలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినా కోడెల లెక్కచేయలేదు. ఫిరాయింపుదార్లపై స్పీకర్ త్వరితంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా ఆయన లక్ష్యపెట్టలేదు. పైగా వారికి సభలో టీడీపీ వైపు స్థానాలను కేటాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే, ఉప ఎన్నికలు వచ్చి తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న చంద్రబాబు సూచనలతోనే స్పీకర్ వారి జోలికి వెళ్లలేదు. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న విమర్శలు కోడెలపై వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసేలా అధికార పార్టీ సభ్యులను లేపి మాట్లాడించేవారన్న విమర్శలున్నాయి. ఇంత మేలు చేసిన కోడెలకు టిక్కెట్ విషయంలో మీనమేషాలు లెక్కించడం ఎంతవరకు సబబని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ స్పీకరూ చేయని విధంగా పార్టీ సమావేశాల్లో పాల్గొన్న కోడెలకు అన్యాయం చేస్తే సహించబోమటున్నారు. సత్తెనపల్లా.. నరసారావుపేట.. ఎంపీ సీటా? కోడెల టిక్కెట్ విషయంలో టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కోడెలతోపాటు ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో టిక్కెట్ విషయంలో పార్టీ నాయకత్వం తేల్చలేకపోతున్నట్లు టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సత్తెనపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తానని కోడెల ప్రకటించారు. తన కుమారుడికి నరసరావుపేట టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ రెండింటిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెరపైకి కొత్తకొత్త పేర్లను తెస్తుండడంతో కోడెల వర్గం విస్తుపోతోంది. నరసరావుపేట ఎంపీగా కోడెలను పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం కసరత్తు చేపట్టింది. -
మోగింది భేరి.. ఓటు హక్కుందా మరి!
సాక్షి, సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో తొలి విడతలోనే (ఏప్రిల్ 11న) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ నాయకులతో పాటు అధికార యంత్రాంగంలోనూ హడావుడి మొదలైంది. జిల్లాలో ఓటు తొలగింపుల కోసం గత నెల 28 నాటికి 1,09,079 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పరిశీలన ప్రక్రియలో నిమగ్న మయ్యారు. దీనిని వీలైనంత త్వరగా ముగించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లంతా జాబితాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. జాబితాలో పేర్లులేని వారితోపాటు ఇప్పటి వరకు ఓటు పొందని అర్హులంతా ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఇంకా సమయం మూడు రోజులు మాత్రమే ఉండటంతో త్వరితగతిన ఓటు హక్కు నమోదుకు తరలాల్సి ఉంది. జిల్లాలో ఓటర్లు.. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 37,51,071 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 18,43,098 మంది, మహిళలు 19,07,552 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 64,501 మంది అధికంగా ఉన్నారు. ఈ సంఖ్యలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు 421 మంది ఇతరులు కూడా ఉన్నారు. అత్యధికం.. అత్యల్పం మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గంలో 2,54,001 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,24,263 మంది, మహిళలు 1,29,709 మంది, ఇతరులు 29 మంది ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 1,75,012 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 86,356 మంది, మహిళలు 88,650 మంది, ఇతరులు ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆన్లైన్లో ఇలా.. ఓటరుగా నమోదు చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో చేసుకోవచ్చు. వెబ్సైట్లో సెర్చ్ యువర్ నేమ్ చోట క్లిక్ చేసి మీ నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, నమోదు చేసుకోవాలి. వెంటనే మీకు ఓటు ఉందా, లేదా, ఉంటే ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో తెలుస్తుంది. ఈ వెబ్సైట్ నుంచి ఓటు హక్కు కోసం కూడా నమోదు చేసుకోవచ్చు. దీనితో పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో, పురపాలక సంఘాల పరిధిలో, పోలింగ్ బూత్ స్థాయి అధికారి వద్ద ఫారం–6 పూర్తి చేసి ఓటు హక్కు పొందవచ్చు. -
మంచి నాయకుల కోసం ఓ డాక్టర్ సైకిల్ సవారీ..!
సాక్షి, సత్తెనపల్లి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థమైన సేవలు అందించే పాలకులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు సైకిల్ యాత్ర చేయాలని ఓ డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం పాలకులు కల్పించిన భ్రమలతో ప్రజలు ఓట్లు వేస్తే ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపించారన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ సవారీ చేసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ యేరువ నరసింహరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకిల్ సవారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల వద్ద ముగియనుంది. 74 నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రాధాన్యతను వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే యోచనతో ఎన్నికల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రాబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు జగన్ సమక్షంలో యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. -
తెలుగుదేశం పార్టీ చందాల దందా
సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత తనయుడు అడ్డదారులు తొక్కుతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీపడేందుకు అవసరమైన ఖర్చు భరించాలంటూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, భూస్వాములు, కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఆ ముఖ్యనేత తనయుడు వారికి హుకుం కూడా జారీచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా గుంటూరులోని ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌లో రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భారీ మొత్తంలో చందాలు వసూలు చేసే కార్యక్రమానికి ఆయన తెరతీశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని చిన్నస్థాయి వ్యాపారుల నుంచి బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, భూస్వాములు ఇలా అన్ని వర్గాలకు చెందిన ముఖ్యులను గుంటూరుకు పిలిపించి వారి సామర్థ్యాన్ని బట్టి ఎంత చందా ఇవ్వాలనేది నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు చందాల జాబితాను తయారుచేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అందరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుండటంతో అంతా విస్తుపోతున్నారు. సమావేశంలో ముఖ్యనేత తనయునికి ఎదురు చెప్పలేక వారంతా సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో ఓ ముఖ్యనేత తనయుని దెబ్బకు గత నాలుగున్నరేళ్లుగా రెండు నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల వారు అల్లాడిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బిల్డింగ్ కట్టాలన్నా.. ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా.. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా.. దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణం ఏర్పాటు చేసుకోవాలన్నా.. బార్ లైసెన్సు పొందాలన్నా.. ఆయనకు ‘కే’ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఓ రైల్వే కాంట్రాక్టర్ పర్సంటేజీ ఇవ్వలేదనే కారణంతో పనులు నిర్వహించే ప్రాంతంలో రేకుల షెడ్డును కూల్చివేసి నిర్మాణ సంస్థ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులపై సైతం దాడులకు పాల్పడిన సంఘటన రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. రైల్వే కాంట్రాక్టర్లు సాక్షాత్తు సీఎం, కేంద్ర రైల్వే శాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లినా సదరు నేత ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ‘కే’ ట్యాక్స్‌లు కట్టకుండా ఎదురుతిరిగే వారిపై అక్రమ కేసులు బనాయించడం, దాడులకు సైతం తెగబడ్డ ఘటనలు అనేకం. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగున్నరేళ్లలో సదరు ముఖ్య నేత తనయుని అరాచకాలకు అంతేలేదు. దీంతో వీరికి ఎదురుతిరిగే అధికారిగానీ, వ్యాపారస్తులుగానీ లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లతో గుంటూరు నగరంలోని ఓ ద్విచక్రవాహన షోరూమ్‌లో రహస్య సమావేశం నిర్వహించి ఎన్నికల ఖర్చు కోసం చందాలు ఇవ్వాలంటూ హుకుం జారీచేశారు. దీంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన చెప్పిన దానికి తలాడించి అక్కడ నుంచి బయటపడ్డారు. ఈ సమావేశంలో చిన్న వ్యాపారుల మొదలు బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.లక్షల్లో నిర్ణయించి చందాల జాబితా తయారుచేసినట్లు సమాచారం. జాబితా ప్రకారం డబ్బులు సిద్ధంచేసి పెట్టుకోవాలని తాము చెప్పిన సమయానికి, చెప్పిన వారికి ఆ డబ్బు అందించాల్సి ఉంటుందని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎలా ఉన్నా, ఎన్నికల సమయంలోనైనా తమ జోలికి రాకుండా ఉంటారని భావించిన వ్యాపారులకు చందాలంటూ ముఖ్యనేత తనయుడు ఊహించని షాక్ ఇవ్వడంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ సన్నిహితుల వద్ద వారు వాపోతున్నట్లు సమాచారం. ఇవ్వలేమని చెబితే వారి స్పందన ఎలా ఉంటుందో తమకు తెలుసని, అందుకే ఏం మాట్లాడకుండా వచ్చేశామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలోనూ హడల్ మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ వ్యాపారులు కూడా హడలిపోతున్నారు. ముఖ్యనేత తనయుడు సత్తెనపల్లి నియోజకవర్గానికే పరిమితమవుతారా.. తమను కూడా పిలిచి చందాలు అడుగుతారా అంటూ భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.వేల కోట్లు దోచేసిన ఆయన అందులో నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయకుండా చందాల ద్వారా వసూలుచేసి ఆ మొత్తాన్ని ఎన్నికలకు ఖర్చుపెట్టడం ఏమిటని బాధితులు వాపోతున్నారు. -
కోడెల ఆటవిక పాలనను తరిమి కొట్టాలి
సత్తెనపల్లి: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆటవిక పరిపాలనను సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి తరిమి కొట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె చేస్తోన్న అవినీతి, అక్రమాలపై గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని ప్రజా, పౌర సంఘాల ప్రతినిధులు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న సత్తెనపల్లి తాలూకా సెంటర్లో ‘క్విట్ కోడెల – సేవ్ సత్తెనపల్లి’ పేరుతో నిరసన నిర్వహించాలని నిర్ణయించారు. కోడెల హయాంలో పనిచేసి పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు అధికారులందరిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోడెలపై ఇప్పుడు పెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశం ఆయన ఎన్నికైన మూడు నెలలకే నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత పదేళ్ల కాలంలో నమోదు కాని కేసులు, కోడెల స్పీకర్ అయ్యాక మూడు నెలలకే ప్రత్యర్థులపై నమోదు చేయించారని తెలిపారు. లక్కరాజుగార్లపాడులో తనకు ఓటు వేయలేదని ఇళ్లు ధ్వంసం చేసి అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. పార్కు ఏరియాలో అపార్టుమెంట్ నిర్మాణం చేపడుతుంటే అధికారుల ద్వారా పనులు ఆపించి ముడుపులు సెటిల్ చేయించుకున్నారని వివరించారు. దాదాపు 67 ఎకరాలు కబ్జా చేశారని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలను కూడా తీవ్ర వేధింపులకు గురి చేశారని తెలిపారు. కోడెలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కోడెలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్నారు. ప్రజలను, వ్యవస్థలను భయపెట్టడం, కులాలను, వర్గాలను, ముఠాలను, ప్రాంతాలను, రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం గల వ్యక్తి అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లి రూరల్ టీడీపీ గెలుచుకోగా, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్నా దౌర్జన్యంగా పీఠం దక్కించుకున్నారని గుర్తుచేశారు. కోడెలకు ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర ఉండేదని, ఇప్పుడు తీవ్ర అవినీతి పరుడిగానూ పేరొచ్చిందని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేట మున్సిపల్ కార్మికులతో గుంటూరులో తమ మాల్ నిర్మాణ పనులు చేయించిన నీచ సంస్కృతి ఆయన కుటుంబానిదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కోడెల దుర్మార్గ పరిపాలనను తరిమి కొట్టాలనే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు రావడం శుభ పరిణామమన్నారు. కోడెల అరాచకాలపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతి చెవికీ కోడెల దౌర్జన్యం చేరాలి కోడెల దౌర్జన్యాలు, అవినీతిని ప్రతి చెవికీ చేరవేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. ఇసుక, మట్టి, భూములు దోచుకోవడమే కాక, అధికారుల నుంచి ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. సీపీఐ ఏరియా కార్యదర్శి నరిశేటి వేణుగోపాల్ మాట్లాడుతూ నెలకు రూ. 1.50 లక్షలు స్పీకర్ కార్యాలయానికి అలవెన్సుల రూపంలో డ్రా చేసుకుంటున్నారని, కానీ అక్కడ పనిచేసే స్వీపర్‌కు జీతం, పేపర్ బిల్లులు, మంచినీరు, కరెంటు బిల్లులు చెల్లించని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. పీసీసీ కార్యదర్శి మాదంశెట్టి వేదాద్రి మాట్లాడుతూ ప్రశ్నించేవారిని ప్రస్తుత పాలకులు నిర్భందిస్తున్నారని, పేదల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన స్పీకర్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినా నోరు మెదపలేదని అంబేడ్కర్ ప్రజాసంఘం జిల్లా అధ్యక్షుడు దావులూరి కోటేశ్వరరావు మండిపడ్డారు. ప్రతి నెలా అన్నా క్యాంటిన్ ద్వారా రూ. 2.25 లక్షల కోడెల కుమార్తె సేఫ్ కంపెనీకి మిగులుతున్నాయన్నారు. బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.. సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మంచినీరు సక్రమంగా అందని సత్తెనపల్లికి రూ. 4 కోట్లతో గెస్ట్ హౌస్‌లు నిర్మించి కమీషన్లు దండుకున్నారన్నారు. దేవదాయ భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని భవనం నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గంజిమాల రవిబాబు మాట్లాడుతూ దేవరంపాడులో 50 ఎకరాల దళితుల భూములను టీడీపీకి చెందిన జానకి రామయ్య అక్రమంగా కొనుగోలు చేశాడని, అప్పట్లో తాము ఉద్యమించి కేసులు పెడితే వాటిని తొలగించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. న్యాయవాది కొమ్మిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం కోడెల కుమారుడు శివరామ్ అన్నారు. కోడెల తన కొడుకుని అచ్చోసి వదిలేశాడన్నారు. భీమవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత బలుసుపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కోడెల వంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వెయ్యి గేదెలకు నీరు దొరికే ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తున్న దుర్మార్గుడన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగరాణి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుర్ మీరాన్, సీపీఎం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, సీపీఐ పట్టణ మాజీ కార్యదర్శి మూసాబోయిన శ్రీనివాసరావు, న్యాయవాది కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, దివ్వెల శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడారు. వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ ఆద్వర్యంలో వావిలాల జయంతి వేడుకలు
-
సత్తెనపల్లిలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
-
మీ అవమానాల వల్లే రైతుల ఆత్మహత్యలు!
సత్తెనపల్లి: ‘పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అడిగితే.. రైతులను అవమానిస్తారా? మీ అవమానాలకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అంటూ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో రైతులు అధికారులపై ధ్వజమెత్తారు. తాము పండించిన మినుములు కొనుగోలు చేయాలని అడిగినపుడు.. మీరే పండించారా! కొనుగోలు చేసి నిల్వలు పెట్టారా! అంటూ అధికారులు ప్రశ్నించడంపై మండిపడ్డారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కొమెరపూడి గ్రామంలో అధికారులు ‘సాగుకు సమాయత్తం’ కార్యక్రమం నిర్వహించడానికి శుక్రవారం వచ్చినపుడు ఈ సంఘటన జరిగింది. కార్యక్రమానికి ఏర్పాట్లు చేయబోతుండగా రైతులు అడ్డుకుని.. ఎప్పుడో చేయబోయే సాగుకు సలహాలు ఇచ్చేకంటే, ఇప్పటికే పండించిన మినుములను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐకి ఫోన్ చేయాలని ఏఈవో సుభానీని మండల వ్యవసాయాధికారి వి.నరేంద్రబాబు ఆదేశించడంతో రైతులు మరింత కోపోద్రిక్తులయ్యారు. పోలీసుల పేరు చెప్పి రైతులను బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. కష్టపడి చెమటోడ్చి పంటలు పండించింది జైలుకు వెళ్లడానికా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్పీకర్ నియోజకవర్గంలో ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. రెండేళ్లుగా సాగర్ కాలువలకు నీరు రాక అపరాల సాగుకే పరిమితమయ్యామని, నవంబర్‌లో మినుము సాగు చేస్తే ఫిబ్రవరిలో పంట చేతికి వచ్చిందన్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో సత్తెనపల్లిలో ఏర్పాటైన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి శాంపిల్స్ తీసుకొని వెళితే, రబీలో సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని చెప్పారని, వ్యవసాయ శాఖ అధికారులు వద్దకు వెళితే పొలాలు పరిశీలించి రాస్తామని చెప్పారన్నారు. వీఆర్వోలు, ఎంపీఈవోలు, ఏఎస్వో ఎవరూ క్షేత్రస్థాయికి వచ్చి పంటను పరిశీలించకుండా తప్పుడు లెక్కలు ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేసి తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మండలంలో కేవలం 16 ఎకరాల్లో సాగు నమోదైంది కనుక లాటరీ వేసి కొనుగోళ్లు జరపుతామంటున్నారని, తమ చావులకు లాటరీలు వేయాలంటూ ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం సాగుకు సమాయత్తం సభను బహిష్కరించి అధికారులను ముట్టడించారు. దీంతో రైతుల వారీగా మినుము పంట సాగు చేసిన వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళతామని హమీ ఇచ్చి వేరే గ్రామానికి వెళ్లారు. మాజీ సర్పంచ్, రైతు లంకిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీటీసీ కళ్లం విజయ భాస్కరరెడ్డితో పాటు పలువురు రైతులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
123వ రోజు జగన్ పాదయాత్ర షెడ్యూల్
-
దూదేకుల ఫెడరేషన్‌కు ఏటా రూ.40 కోట్లు
సాక్షి, అమరావతి బ్యూరో: మనందరి ప్రభుత్వం రాగానే దూదేకుల ఫెడరేషన్‌కు ఏటా రూ.40 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి శివారులో బుధవారం ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా/దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దూదేకుల ముస్లింలకు ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేసి, నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత రాజశేఖరరెడ్డిదే అని అన్నారు. 2014లో దూదేకుల ముస్లిం ఫెడరేషన్ ఏర్పాటు అయినప్పటికి ప్రభుత్వం ఇప్పటివరకు కార్యవర్గాన్ని రూపొందించలేదని, నాలుగేళ్లుగా నామమాత్రపు నిధులు కేటాయించిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దూదేకుల కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సదస్సులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి ఏఎమ్ రఫీ, జాయింట్ సెక్రటరీ ఖాజా, అబ్బాస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
123వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గుంటూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 123వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన గుడిపూడి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ముగిసిన 122వ రోజు పాదయాత్ర వైఎస్ జగన్ 122వ రోజు పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి వద్ద ముగిసింది. ఇవాళ 11కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. రామకృష్ణాపురం, నందిగామ్, గుడిపూడి కాలనీ మీదగా ...గుడిపూడి వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1623.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
ప్రజాసంకల్పయాత్ర 122వ రోజు షెడ్యూల్
సాక్షి, గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 122వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. బుధవారం ఉదయం ఆయన సత్తెనపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి రామకృష్ణాపురం మీదగా నందిగామ్ చేరుకున్నారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గుడిపూడి కాలనీ మీదగా గుడిపుడి చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. -
సత్తెనపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ
-
వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నాయకులు
సాక్షి, సత్తెనపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...వారిద్దరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం విదితమే. -
‘ఎంపీలు రాజీనామా చేస్తారు.. మీరు చేయించండి’
సాక్షి, సత్తెనపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుదాటాక తెప్పతగలేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చంద్రబాబు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని? రైతులు అడుగుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఉన్నదేంటి? చంద్రబాబుకు లేనిదేంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌కు ఉన్నది రోషం. మన చంద్రానికి రోషం లేదు. అవినీతి సొమ్ము మాత్రం విచ్చలవిడిగా ఉంది. ఆ డబ్బుతో ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎంపీలను కొంటున్నారు. లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన చంద్రబాబు ఏపీకి నీటి విడుదలపై కేసీఆర్‌తో మాట్లాడలేక భయపడుతున్నారు. ఏమైనా మాట్లాడితే టేపులను బయటకు తీసి కేసీఆర్ జైల్లో వేయిస్తాడని చంద్రబాబు వణికిపోతున్నాడు. నాలుగేళ్లుగా రైతులు కష్టపడాల్సిన పరిస్థితి చంద్రబాబు వల్లే వచ్చింది. ఇవాళ నీళ్లు లేని కారణంగా బంగారం పండే భూముల్లో మెట్టపంటలు వేసుకున్నారు రైతన్నలు. పంట దిగుబడులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కనీస గిట్టుబాటు ధర అందడం లేదు. ఈ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క పంటకైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చిందా? మిర్చి, మినుము, పెసలు, మొక్కజొన్న ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. పత్తి పంటనుని తెలుగుదేశం మంత్రులు పందికొక్కుల్లా మేశారు. ప్రతి రైతన్న ముఖ్యమంత్రి హోదాలోని చంద్రబాబును పెద్ద దళారి అంటున్నారు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటలను కొని.. ఆయన హెరిటేజ్ కంపెనీ నుంచి నాలుగింతలకు వస్తువులను చంద్రబాబు అమ్ముతున్నాడని అంటున్నారు. ఒకవైపు జీఎస్టీ మోతతో షాపుల వాళ్లు తలలు పట్టుకుంటుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టీఎస్టీ(తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్) కూడా విధిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం మొదలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థతో ముడిపడిన ఏ పని జరగాలన్నా ఈ టీఎస్టీని చెల్లించాల్సిందే. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ప్రత్యేకంగా మరో ట్యాక్స్ వేస్తున్నారు. అదే కోడెల సర్వీస్ ట్యాక్స్(కేఎస్టీ). తోపుడు బండ్లు మొదలు అపార్ట్మెంట్ల వరకూ కేఎస్‌టీని వసూలు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సత్తెనపల్లిలో అవినీతి జరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నిలబెట్టుకోలేదు. ఏ కులాన్ని, వర్గాన్ని వదలకుండా చంద్రబాబు మోసగించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనంతా మోసం.. మోసం.. అబద్దాలు.. అబద్దాలు. ఆయన ఘనకార్యాలను ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి వణకు రావడం ప్రారంభమైంది. దీంతో ఎన్నికల రాజకీయ సూత్రాన్ని బయటకు తీశాడు చంద్రబాబు. ప్రజలను నమ్మించు.. వంచించు అనేదే చంద్రబాబు రాజకీయ సూత్రం. వారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ నెపాన్ని వేరే వారిపై నెట్టేయ్. అక్కడితో ఆగదా సూత్రం.. ఇందుకోసం తన అనుకూల మీడియాను వాడుకో. బాబు అంటాడు.. ఆయన్ను బలహీనపరచడం అంటే.. రాష్ట్రాన్ని, ప్రజలను బలహీనపరచడం అట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నైజానికి సంబంధించి ఒక సామెత ఉంది. ఒక దొంగ ఉన్నాడు. తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దొరికిన ఆ దొంగను, ప్రజలు, వ్యవస్థ ప్రశ్నించాయి. నన్ను అరెస్టు చేస్తే మన ఊరికే చెడ్డపేరు అని అన్నాడట ఆ దొంగ. నన్ను బలహీనపరిస్తే ఊరే బలహీనపడుతుందని అన్నాడట ఆ దొంగ. ఇదే కార్యక్రమాన్ని బాబు చేస్తున్నారు. రాజకీయాల్లో పాతాళానికి దిగజారారు చంద్రబాబు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అంటున్న మాటలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రత్యేక హోదా పోరాటానికి ఈయన దిశానిర్దేశం చేస్తాడట. అందుకు అఖిలపక్షాన్ని పిలుస్తాడట. దొంగోడే చివరికి దొంగా.. దొంగా.. అని అరవడం మొదలుపెట్టినట్లుంది. ఇదే పెద్ద మనిషిని మీ ద్వారా అడుగుతున్నా.. మార్చి 2, 2014న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అప్పటి కేబినేట్ ఆమోదించింది. దాన్ని ప్రణాళిక సంఘానికి పంపింది. జూన్‌లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల పాటు ఆదేశాలు అలానే బల్లపై ఉన్నాయి. ఆ కాలంలో ఆదేశాలను అమలు చేయమని కోరకుండా గాడిదలు కాస్తున్నావా?. 2016 సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాపై ఇవ్వమని చెబితే కృతజ్ఞతలు చెప్పాడు చంద్రబాబు. మరుసటి రోజు అసెంబ్లీలో జైట్లీ ప్రకటనను స్వాగతిస్తూ.. కోడులు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అంటాడు. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించాడు?. జైట్లీ ప్రకటన అనంతరం టీడీపీ మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకుని ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేది. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ పోరాటాలు చేస్తే ఈ పెద్ద మనిషి అడ్డుకోలేదా?. మోదీ వస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేయించారు. బంద్‌లు చేస్తే.. బలవంతంగా బస్సులు నడిపించారు. యువభేరీలు ఏర్పాటు చేస్తే పిల్లలపై పీడీ యాక్టు పెడతానని బెదిరించారు? ప్రత్యక హోదాపై టీడీపీ నాలుగేళ్లుగా చేసింది ఇది కాదా?. ఈ నెల 16న వైఎస్ఆర్ సీపీ అవిశ్వాసం పెట్టకపోతే నువ్వు పెట్టి ఉండే వాడివా బాబు?. అవిశ్వాసానికి మద్దుతు ఇవ్వాలని ప్రతి పార్టీని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కలిశారు. మద్దుతు కూడగట్టారు. ఇది చూసిన బాబు 15న తాను చెప్పిన మాట మార్చుకుని ప్రత్యేకంగా తాము కూడా అవిశ్వాసం పెడతామన్నారు. మేం అవిశ్వాసం పెట్టడం వల్లే ఇతర పార్టీలు మద్దుతు ఇచ్చాయని సిగ్గులేకుండా అబద్దాలు చెప్పారు. ఇటువంటి చిత్తశుద్ది లేని పెద్దమనిషి ఈ చంద్రబాబు. ఇవాళ అఖిలపక్షాన్ని మేం ఎలా నమ్మాలి?. అయ్యా నిన్ను మేం నమ్మం. నీకు చిత్తశుద్ది లేదు. వెన్నుపోటు పొడవడం నీ రక్తం లోనే ఉంది. మేం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం. ప్రజలలో ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదాపై నువ్వు తలొగ్గావు. ఇవాళ రాష్ట్రం గురించి దేశం మాట్లాడుకుంటోంది. చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే పార్లమెంటు సమావేశాల చివరి రోజున మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించు. అదే రోజున వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి. మీకు ఎలాంటి నాయకుడు కావాలని మీరందరూ ఆలోచన చేయండని చెబుతున్నాను. మోసాలు చేసే వారిని పొరబాటునైనా క్షమించొద్దు. అలా చేస్తే రేపొద్దున ఏం జరగుతుందో తెలుసా? చంద్రబాబు మీ దగ్గరికి వచ్చి మైకు పట్టుకుని ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. బోనస్‌గా ఇంటికో బెంజ్ కారు ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి మూడు వేలు ఇస్తాడు. మూడు వేలు ఇస్తే ఐదు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి దోచేసినదే. కానీ ఓటు వేసేప్పుడు మనస్సాక్షిని నమ్మి వేయండి. అబద్దాలు చెప్పే వాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం వస్తుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా నవరత్నాలను ప్రకటించాం. వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాం. ఆ నవరత్నాల్లో ఈ రోజు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీల గురించి చెబుతున్నా. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. పూర్తిగా రుణ మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేశాడు. బ్యాంకులకు రుణాలు కట్టొద్దని పిలుపు ఇచ్చాడు. దీంతో అక్కచెల్లెమ్మలు రుణాలు చెల్లించలేదు. ఇవాళ ఆ అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏంటి?. వారి వస్తువులను వేలం వేస్తున్నామంటూ బ్యాంకులు నోటిసులు పంపుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ డబ్బులను బ్యాంకులకు కట్టడం లేదు. దీంతో ఎవరికీ బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వరకూ ఏంతైతే అప్పులు ఉంటాయో వాటన్నింటిని నాలుగు దఫాలు నేరుగా వారి చేతికే ఇస్తాం. పొదుపు సంఘాలకు బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. దీనివల్ల ప్రతి అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలనే వైఎస్ఆర్ స్వప్నం సాకారం అవుతుంది. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు చెప్పాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కరికైనా ఇల్లు కట్టించాడా?. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 48 లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర వైఎస్ఆర్ది. ఆయన మరణించిన తర్వాత కథ మొదటికి వచ్చింది. ప్రతి అక్కాచెల్లెమ్మకు హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించితీరుతాం. ఇల్లు కట్టించి ఆ ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తాం. వాటిని అవసరం నిమిత్తం తాకట్టుపెడితే పావలా వడ్డీనే పడేలా చేస్తామని చెబుతున్నా.’ -
121వ రోజువైఎస్ జగన్ పాదయాత్ర షెడ్యూల్
-
121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గుంటూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్, తంబళ్లపాడు క్రాస్, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. -
ఐదుగురికి జీవిత ఖైదు..ముద్దాయి పరారీ
గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభాల కోటేశ్వరరావు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి తీర్పివ్వగానే కోర్టు నుంచి ముద్దాయి రఫీ చాకచక్యంగా పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో సత్తెనపల్లిలోని ఓ గోడౌన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోటేశ్వరరావును కొంతమంది వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ స్థల విషయమై కోటేశ్వర రావుతో కొంతమంది వ్యక్తులకు పొరపొచ్చాలు రావడంతో వారు హత్యకు పూనుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా ఒకరు చనిపోయారు. మిగిలిన ఐదుగురికి గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.1000 జరిమానా కూడా విధించారు. పారిపోయిన ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడంలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.