Minister Ambati Rambabu Slams Janasena Chief Pawan Kalyan - Sakshi
Sakshi News home page

తెలుగు రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ కామెడీ పీస్‌: అంబటి రాంబాబు

Published Fri, Jan 13 2023 2:31 PM | Last Updated on Fri, Jan 13 2023 3:16 PM

Minister Ambati Rambabu Slams Janasena Chief Pawan Kalyan - Sakshi

సాక్షి, సత్తెనపల్లి: తెలుగు రాజకీయాల్లో పవన్‌ కామెడీ పీస్‌ అని ప్రజలకు అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు, మంత్రులను దూషిస్తాడు. పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. జగన్‌ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్‌ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అని మండిపడ్డారు. 

'సింగిల్‌గా వెళితే వీరమరణం అని నీకు అర్థమైంది. పిరికి సన్నాసుల్లారా మీకు దమ్ము, ధైర్యం లేదు. మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే. మీకు ఆరాటం తప్ప పోరాటమే లేదు. పవన్‌ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయే. తగిన ప్యాకేజీ అందితే పొత్తుకు సిద్ధమని పవన్‌ మరోసారి చెప్పాడు. చంద్రబాబు కోసం పెట్టిందే జనసేన పార్టీ. పవన్‌లాంటి చీడ పురుగులకు ప్రజలు ఓట్లు వేయరు. చంద్రబాబుతో పవన్‌ ఏం మాట్లాడాడో మాకు తెలుసు. పవన్‌ వెళ్తున్న మార్గం మంచిది కాదని యువత గుర్తించాలి' అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

చదవండి: (పవన్‌ ఏమాత్రం సంస్కారం లేని వ్యక్తి: మంత్రి దాడిశెట్టి రాజా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement