గుంటూరు, సాక్షి: విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని వైఎస్సార్‌సీసీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నించారని.. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అలవాటైన మోసాలను ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. ప్రతిపిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడ సీఎం చంద్రబాబు ఎలాంటి జీవో ఇచ్చారో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం ప్రతి తల్లికి రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చారు. ఇది సూపర్ సిక్సా? లేక సూపర్ మోసమా?.
.. ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు. మోసం చేయటం చంద్రబాబుకు అలవాటు. వైఎస్ జగన్ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అని ప్రచారం చేశారు.. అవి ఏమయ్యాయి?. నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే.
.. 42లక్షల 61వేల మంది తల్లుల ఖాతాలో వైఎస్ జగన్ నగదు జమ చేశారు. జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట. మోసాలు చేయటం అలవాటు పడిన చీటర్ చంద్రబాబు. చంద్రబాబుకు ఓట్లేసిన వారు ఆయన చేసిన మోసాలను గుర్తించాలి. హామీలను అమలు చేయలేక వైఎస్ జగన్‌ను చంద్రబాబు దూషిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
.. చంద్రబాబు ఇచ్చిన జీవోని మార్చాలి. జీవోలో ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలి. క్యాలెండర్ ప్రకారం సంక్షేమాన్ని అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. మోసం చేయటానికి అడ్డగోలు హామీలు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’’ అని అంబటి అన్నారు.
ఎలక్షన్లకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అని ఊదరగొట్టి ఇప్పుడు ఇంటికి ఒకరికే అని జీవో ఇచ్చి అక్కచెల్లెమ్మలను మళ్ళీ మోసం చేస్తున్న @JaiTDP కూటమి ప్రభుత్వం. pic.twitter.com/X9lhXGxmc0
— YSR Congress Party (@YSRCParty) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment