
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు నిరసన గళం వినిపిస్తున్నారు. కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు స్వీపర్లు సోమవారం ధర్నా చేపట్టారు. కోడెల బినామీలైన విజయలక్ష్మి సహా, శ్రీనివాసరావు, సురేంద్రలు తమ పీఎఫ్ సోమ్మును కాజేశారని స్వీపర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment