సాక్షి, సత్తెనపల్లి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి శ్యాంసుందర్ పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగాయి. ఇద్దరు వ్యక్తులు బైకులో పెట్రోలు నింపుకోవడానికి గుంటూరు రోడ్డులోని ఈ బంక్ వద్దకు వచ్చారు. బంక్ సిబ్బంది పెట్రోలు పోస్తున్నసమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్‌లో సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment