ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.
సత్తెనపల్లి: ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గాంధీచౌక్ వద్దగల బాలాజీ ఎలక్ట్రికల్ దుకాణంలో శుక్రవారం జరిగింది. మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.