
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోవిడ్ ఐసీయూ వార్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఐసీయూ వార్డులో ఉన్న పేషంట్లను మరొక వార్డుకు తరలించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.