బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ అప్‌డేట్స్..
వైఎస్సార్ జిల్లా: బద్వేల్‌లో మీడియాతో వైఎస్ జగన్
👉చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
👉ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
👉శనివారం ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు
👉నేను వస్తానని తెలిసి ఇప్పుడు సాయం చేశారు
👉చంద్రబాబు పాలన ఇలాగే కొనసాగితే తిరగబడతారు
👉కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు..ప్రజలకు భరోసా లేదు
బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు
👉బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక
👉బాలికపై అత్యాచారం చేసి నిప్పంటించిన కీచకుడు
👉బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
👉బాధిత కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
👉 బద్వేల్‌కు బయలుదేరిన వైఎస్ జగన్
👉 గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు.
👉 ఇదే సయంలో రాష్ట్రంలో బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ ఆదుకుంటుంది. ప్రతీ కుటుంబానికి రూ.10 సాయం అందించనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం రెడ్ బుక్ పాలన వదిలేసి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. బాధితులను ఆదుకోవాలన్నారు.
👉 ఈ సందర్భంగా సహానా కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే, సహానాకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
👉 వైఎస్ జగన్ జీజీహెచ్ చేరుకున్నారు. ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు, ప్రజలు చేరుకున్నారు.
👉 వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. కాసేపట్లో సహానా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
👉వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు.
👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment