రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Chandrababu Govt Over Law And Order Situations In AP In Guntur Visit | Sakshi
Sakshi News home page

YS Jagan In Guntur Visit: కళ్ల ఎదుటే సాక్షాలు కనిపిస్తున్నా.. శిక్ష ఎందుకు లేదు?

Published Wed, Oct 23 2024 12:17 PM | Last Updated on Wed, Oct 23 2024 12:52 PM

YS Jagan Slams Chandrababu Govt Over AP Situations

సాక్షి, గుంటూరు: ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉందో సహానా ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదని చెప్పుకొచ్చారు. అలాగే, పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా బాధితులకు సాయం చేసి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. దళిత చెల్లి పరిస్థితిని చూస్తే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్ఢర్‌ లేదు. శాంతిభద్రతలు దిగిజారిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేది. దిశ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం. 

ఈ ఘటనలో నిందితుడు నవీన్‌.. చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. నిందితులు బాధితురాలిపై శారీరకంగా, లైంగిక​ దాడి జరిపి ఆసుపత్రిలో జాయిన్‌ చేసి వెళ్లిపోయారు. యువతిపై మృగాళ్లలా దాడి చేశారు. యువతి దేహాంపై కమిలిన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కళ్లేదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిందితుడు అధికార టీడీపీకి చెందిన వాడు కాబట్టే అతడిని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదు. నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి ఆసుపత్రికి వచ్చారట.

రాష్ట్రంలో ప్రతీచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బద్వేలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. పలాసలో టీడీపీకి చెందిన ప్రబుద్దులే అత్యాచారం చేశారు. అఘాయిత్యాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నారు. పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నాడు. పవన్‌ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు. హిందూపురంలోనూ అత్తాకోడలిపై గ్యాంప్‌ రేప్‌ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరామర్శకు వెళ్లలేదు. అనకాపల్లిలో బాలికను ప్రేమోన్మాది చంపేశాడు. వేధింపులపై అంతకుముందు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు.

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్‌ బుక్‌ పాలనలో నిమగ్నమయ్యారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్‌ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్‌ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి. దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement