సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ఉన్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వెళ్లారు.
ఇక, వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ గుంటూరులో హెలికాప్టర్ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఆసుపత్రి వైఎస్ జగన్ పరామర్శలకు కాస్త ఆలస్యమవుతోంది. అయినప్పటికీ వైఎస్ జగన్.. అందరినీ పలకరిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment