
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు శుక్రవారం ఉదయం వెల్లడించాయి.
షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment