
బీజేపీ, టీడీపీలకు ఓటు వేస్తే ప్రమాదం
‘బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి నరహంతకుడు. బీజేపీకి, టీడీపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృతం అవుతాయి.
సత్తెనపల్లి,న్యూస్‌లైన్: ‘బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి నరహంతకుడు. బీజేపీకి, టీడీపీకి ఓటేస్తే గోద్రా ఘటనలు పునరావృతం అవుతాయి. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేసి ఆదరించాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని నాగార్జుననగర్‌లోని రాంబాబు కార్యాలయంలో శనివారం చర్మకారుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు బుల్లా రాము నేతృత్వంలో వంద మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలతో రాక్షస పాలన కావాలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సువర్ణ పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.
విశ్వసనీయత గల నేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సీలింగ్ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రానున్న 30 ఏళ్ల పాటు సీమాంధ్రలో సువర్ణపాలన అందిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ యర్రయ్య, ఇసాక్, కొత్త కోటేశ్వరరావు, ఏసోబు, యలమంద, ఏలియా, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, నాగభూషణం, ఏబు, అగస్టిన్, చిన్న, బంకా వందనం, ఇరియాలతోపాటు మరో 100 మంది వైఎస్సార్ సీపీ తీర్థం తీసుకున్నారు. వారందరిని అంబటి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. భీమవరానికి చెందిన 120 మంది కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.