ఈ విజయం నాకెంతో ఆనందం: పవన్ | Was Pawan Kalyan the defining factor in Seemandhra elections? | Sakshi
Sakshi News home page

ఈ విజయం నాకెంతో ఆనందం: పవన్

Published Sat, May 17 2014 2:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఈ విజయం నాకెంతో ఆనందం: పవన్ - Sakshi

ఈ విజయం నాకెంతో ఆనందం: పవన్

సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం తనకెంతో ఆనందం కలిగిస్తోందని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ చెప్పారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని... దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో మంచిపాలన కోరుకున్నారని తెలిపారు. మోడీ పాలనాదక్షతను తాను గుజరాత్ వెళ్లినపుడు చూశానన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. అందులో నేనూ ఒకడిని. 2009లో జరిగిన ఎన్నికల్లో నాకు పార్టీ ఉంది. పోటీ కూడా చేశాం. అయితే ఈసారి పోటీ చేయలేదు. ఓట్లు చీల్చకూడదని, ఒకే పార్టీకి మెజార్టీ రావాలనే కోరికతోనే పోటీ చేయలేదు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement