నింబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన మార్కెట్ తొలగింపు.. ఉద్రిక్తతకు దారి తీసింది. గుంటూరు జిల్లా సత్తెన పల్లిలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం అధికారులు పోలీసుల సాయంతో అక్రమ కట్టడాలు తొలగించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంకాయమ్మ అనే మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు.
మరో వైపు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాపులను ఖాళీ చేయాల్సిందిగా పలుమార్లు హెచ్చరించామని అధికారులు తెలిపారు. ఫలితం లేక పోవడంతోనే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చిందని వివరించారు.