సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలోని టీడీపీ నాయకుల్లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచరులు ఒక వర్గంగా, రాయపాటి రంగబాబు అనుచరులు మరో వర్గంగా చీలిపోయి ఆందోళనలు చేపడుతున్నారు. రంగబాబు ఆధ్వర్యంలోని వర్గం అన్నా క్యాంటీన్ వద్ద ధర్నాకి దిగిన కాసేపటికి.. కోడెల వర్గం ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది. కాగా కే ట్యాక్స్ పేరిట కోడెల కుటుంబం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివప్రసాదరావు సహా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిపై పలు కేసులు నమోదైన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment