
సాక్షి, గుంటూరు : రానురాను మానవత్వం మంటగలుస్తోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా. .ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని తాకడానికి కూడా సాహసం చేయలేకపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుమీదకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్వాస ఆడటంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలి కన్నుమూశారు. సమీపంలో చాలామంది ఉన్నా.. కరోనా సోకుతుందేమోనని అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే ఇరుగుపొరుగు వారు బాధితుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తే కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకుతుందని భావించి ఓ ఒక్కరూ కూడా బయటకు రాలేదు. సుమారు మూడు గంటల పాటు నడిరోడ్డుపైనే మృతదేహం అలాగే ఉండిపోయింది. తరువాత సమచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment