అమెరికా నుంచి వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌ | A couple Came To Guntur From America Tested Corona Positive | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌

Jan 8 2023 9:48 AM | Updated on Jan 8 2023 10:13 AM

 A couple Came To Guntur From America Tested Corona Positive - Sakshi

గుంటూరు మెడికల్‌ : అమెరికా నుంచి గుంటూరు వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుమారు పదిరోజుల కిందట ముత్యాలరెడ్డినగర్‌కు చెందిన దంపతులు అమెరికా నుంచి గుంటూరు వచ్చి శుక్రవారం ప్రైవేటు ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

కరోనా పాజిటివ్‌ రిపోర్టు శనివారం రావడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధితుల ఇంటికి వెళ్లి వారికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందజేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కరోనా ఫోర్త్‌ వేవ్‌ కేసులు కొంతకాలంగా విదేశాల్లో నమోదవుతున్న నేపథ్యంలో జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం బాధితుల శాంపిల్స్‌ను విజయవాడ ప్రభుత్వ మైక్రోబయాలజీ ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement