
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై అరండల్‌పేట పీఎస్‌లో కేసు నమోదు అయింది. ఏపీలో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై 118, 505(1)బి, 505(2), 54 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment