
సాక్షి, గుంటూరు : కరోనా వైరస్‌పై తనను సలహాలు అడగడం లేదనే ధోరణితో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాట్లాడారని, ఆయన సామర్థ్యం చూశారు కాబట్టే ప్రజలు టీడీపీని చాపలో చుట్టి పక్కన పడేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. కరోనా నివారణ కోసమే కాకుండా ప్రజల భద్రతపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో నష్ణపోయిన రైతును ఒక్కరినైనా చంద్రబాబు చూపిస్తారా అని ప్రశ్నించారు. ప్రతీ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకుంటోందని, స్విట్జర్లాండ్‌కు మామిడి ఎగుమతులను కూడా ప్రారంభించామని చెప్పారు. ( సీఎం గారూ.. నా భర్త చివరి కోరిక నెరవేర్చండి )
ఆక్వా రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటూ చంద్రబాబులాగా హైటెక్ ప్రచారాలకు ముఖ్యమంత్రి పోలేదన్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యల పై ఎప్పుడైనా చర్చించడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి కష్టకాలంలో ముఖ్యమంత్రి పరిపాలనను స్వాగతించాలి కానీ, రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ( కరోనాపై పోరులో మరో చీకటి కోణం )
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : హోంమంత్రి సుచరిత
కరోనానుండి బయటపడేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత కోరారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత నెల రోజులుగా కరోనా నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment