అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం మూడున్నరేళ్లుగా తాత్సారం చేస్తుందని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులు ఇంకా అవ్వా సోదరులు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. హయ్‌లాండ్ లాభాల వివరాలు కోర్టుకు తెలియచేయాలని కోరారు.
రెండు నెలల్లోగా అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరి డిపాజిటర్‌కు డబ్బు అందేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని ముప్పాళ్ల అన్నారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశామని తెలిపారు. రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితుల కోసం రూ. 2 వేల కోట్లు ఇమ్మని సీఎంని అడిగామన్నారు. దీనిపై ప్రభుత్వ, అగ్రిగోల్డ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కమిటీ వేస్తామన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment